పగొడు చేసిన మంచిని గుర్తించాలన్నా
మనం చేసిన తప్పు ఒప్పుకోవాలన్న
మనిషికి కావాల్సింది దైర్యం మాత్రమే.-
నిజాయితీని గుర్తించలేనప్పుడు,
న్యాయాన్ని కోరుకునే హక్కు లేదు.
-
చెట్టు బలం ఎప్పటికీ
ఏపుగా పెరిగిన కొమ్మలది కాదు,
భూమిలో పెనవేసుకున్న వేర్లది-
తగ్గటం అంటే
వెనకడుగు వేయటం కాదు
వెనక్కి వెళ్ళినా బాణం
ముందుకే దూసుకెళ్తుంది,
వెనక్కి నొక్కబడ్డ ట్రిగ్గర్
బుల్లెట్ని ముందుకు తోస్తుంది.
తగ్గటం అంటే పడిపోవటం కాదు
పడకుండా ఉండటం.
-
మాటలు మాట్లాడటానికి
ఆ మాటలు చేతల్లో చేయటానికి
చాలా వ్యత్యాసం ఉంటుంది.
మాటకి చేతలు సరితూగుతెనే
నీ వ్యక్తిత్వం
పది మందిలో పదిలంగా ఉంటుంది.
లేకపోతే "DJ TILLU" మూవీలో
డైలాగ్ లా ఉంటుంది ఏంటంటే
"చేసేవన్నీ దేవుడి పూజలు
దురేవన్ని గబ్బు గుడిసెలు" అని
-
మనం వాడే పనిముట్లైనా
పలకరించే బందుత్వాలైనా
మరుగున పడితే కదలటం కష్టం
పనిముట్లు అయితే పని చేయవు.
బంధుత్వాలైతే పిలిస్తే వినపడిన,
వినపడనంత దూరంలో ఉంటాయి.-
ఒక్క యాప్ పని చేయకపోతే
దాని ప్రత్నాయ మార్గంగా
ఇంకోటి చూసుకోవచ్చు,
అదే రైతు లేకపోతే
ఆకలికి ప్రత్నాయమార్గం లేదు.
యాప్ లు వస్తుంటాయి,పోతుంటాయి
వ్యవసాయం పోతే మళ్ళీ రాదు.
-
ప్రేమంటే ఎదురుచూడటం,
అలా ఎదురుచూడటం లో
సెకనులు నిమిషాలుగాను,
నిమిషాలు గంటలుగాను,
గంటలు రోజులుగాను,
రోజులు వారాలుగాను,
వారాలు నెలలుగాను,
ఇప్పుడు
నెలలు సంవత్సరాలుగా
మారనున్నాయి.-
మాటలతో చేసే యుద్ధంలో
గాయాలు అయ్యేది
దేహానికి కాదు మనసుకి.
మాట మనసుని తాకేల ఉండాలి
మనసుకు తగిలేలా కాదు.-