నేటి నా భారతావని
మందార వర్ణ సింధూరాన్ని
స్వేధన భాష్పాలతో తుడుచుకున్న
అజ్ఞాతపు శ్రామిక భారతి...-
#ప్రహేళిక #నాభారతావని లో పాల్గొన్న ప్రతీ
ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ
Roopa rani గారిని తదుపరి ప్రహేళిక ఇవ్వవలసింది గా
కోరుకుంటున్నాను.. 🙏🏼
-
ప్రహేళికలో తదుపరి ఛాలెంజ్ ఇవ్వవాల్సిందిగా నన్ను కోరిన
Sandhya santhosh గారికి ధన్యవాదాలు తెలుపుతూ....
ప్రహేళిక : వచనా కవిత్వం ( అంశం : భారతదేశం )
1.అక్షర పరిమితి 50 అక్షరాలు
2.కేవలం 4 వాక్యాల్లో మాత్రమే వ్రాయగలరు .
3. #ప్రహేళిక #నాభారతావని క్యాప్షన్ లో వ్రాయవల్సిందిగా
కోరడమైంది...
*గడువు ఆదివారం వరకు
ఉదాహరణకు క్యాప్షన్లో చూడగలరు..-
నా ధాత్రి! సుప్రాచీన సంస్కృతుల కాణాచి
శాంతి సూత్రాలు వల్లించు స్నేహర్థి
కత్తి దూసి నిలవరించు భుజ కీర్తి
విశ్వమంత వాసికెక్కిన ధీయుక్తి-
నా భారతావని
చతుర్వేద సారం పురాణేతిహాసం
ఆథ్యాత్మిక జ్ఞానపిపాసుల జనని
వైజ్ఞానిక ప్రవాహ తీర్దం
-
నా దేశం దార్శనిక నివేశం
వేద వేదాంగాలకు నిలయం
జ్ఞాన కర్మ యోగాస్పదం
ముని యోగుల నివాసం-
నా భారతావని..
ఓ చెరగని చిరునవ్వుల గని..
పచ్చని పొలాల నడుమ పసిపాపల ధ్వని..
భిన్నత్వంలో ఏకత్వమైన అద్భుతం నా అవని..!!-