Aswartha Lakshmi Mitta   (మిట్టా లక్ష్మి ✍️)
114 Followers · 8 Following

read more
Joined 9 December 2019


read more
Joined 9 December 2019
YESTERDAY AT 22:14

ఈ రోజు మన పనులు
కర్మలు, క్రియలు
రేపును నిర్ణయించినట్టే
ఇప్పటి జీవితం
మరణాపంతర జీవితాన్ని
నిర్ణయిస్తుంది

-


4 MAY AT 12:04

పిల్లలతో కలిసి
తల్లిదండ్రులు జీవితం
ఆశయాలు అన్ని
నలుపు మరియు తెలుపు
సినిమా లాంటిది
పిల్లలు పెద్దయ్యాక
మాత్రం వారి జీవితం
ఈస్టమన్ రంగులో
ఇంకా చెప్పాలంటే
అచ్చు తెలుగు సినిమా లా
సగం ఇండియా లో
సగం విదేశాల్లో

-



కళ్ళాపి చల్లిపోయింది
కళ్ళు కప్పి పోయింది
దుమ్ము రేగకొట్టింది
ఉడుకు రేగకొట్టింది
వచ్చినట్టే వచ్చి
వెళ్లి పోయింది వాన

-


2 MAY AT 17:24

జన్మదినము
జన్మ మన చేతిలోలేనిది
జన్మంటూ ఎత్తినాక
పెద్ద పండుగ అనికాదుగానీ
జన్మ ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు
పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు
మనసుకు హెచ్చరికలు
శ్రేయోభిలాషుల శుభాకాంక్షలు
అంతే ….పటాటోపము
బహుమతులు పార్టీలు కాదులే
పుట్టినరోజు శుభాకాంక్షలు

-


2 MAY AT 16:34

మిట్ట మధ్యాహ్నం వరకు
నిప్పులు చెరగిన ఎండ
ఎండగట్టేసిన ఎండదొర
అంతలోనే ఓ అద్భుతం
మేఘావృతమైన ఆకాశం
తొలకరి చినుకులు కురిసి
జల్లులుగా చిలకరించిన వేళ
చల్లగా పులకరించిన నేల

-


2 MAY AT 10:55

విద్యుత్తు లేని కాలం
చీకటి పడిపోతే
ఇక ఏమీ చేయలేక
అందరికీ విశ్రాంతి
ఈ ఎండల్లో శరీరాన్ని
కష్టం పెట్టకుండా
మధ్యాహ్నం ఓ చిన్న నిద్ర
ఇంట్లోనే ఉంటూ
ఓ ఉల్లాసపరచే ప్రక్రియ

-


2 MAY AT 10:50


మండే ఎండల్లో
డొల్లు కర్తరీ
నిజ కర్తరీ అంటూ
ఏవేవో పేర్లు
పేర్లు ఏవైనా
మధ్యాహ్నం ఓ కనుకు
నీకు నీవే ఇచ్చే కానుక
డస్సిపోయిన శరీరానికి
నిజమైన విశ్రాంతి

-


1 MAY AT 17:51

ఉదయం నులివెచ్చని
లేలేత ఎండ
మధ్యాహ్నం
మేఘావృతమైన ఆకాశం
కురిసి ముద్దగా తడిపేసే వాన
వెరసి గత నలబై ఒక్క ఏళ్లుగా
బెంగళూరు చరిత్ర
సున్నా వర్షపాతంతో
ఈ సంవత్సరం కొత్త చరిత్ర
ఆకాశహర్మ్యాలు నిర్మించిన
చెరువులు ఆక్రమించేసిన
చెట్లను కొట్టి వేసిన
ఘనజనుల ఘనచరిత

-


1 MAY AT 15:42

బహిరంగ రహస్యం
జీవమున్న మనుషులు
నిర్జీవమైన మనసులు
పెద్దలో, డబ్బులో
లింగవివక్షో ,కాలపరీక్షో
ఎప్పుడో మరణము
జరిగిపోయింది
యాంత్రిక బ్రదుకులు
యంత్రంలా జీవితాలు

-


1 MAY AT 13:22

శ్రమ,
శ్రమకు గుర్తింపు
లేకపోవడము
శ్రమ దోపిడి
ఎప్పుడూ
ఏ రంగమైనా
ఎక్కడైనా
ఉంటూనే ఉంటాయి
శ్రమయేవ జయతే
రక్తపు చుక్కలు
స్వేదపు చుక్కలై
జీవన రథాన్నినడిపే
శ్రమకు జయహో జయహో

-


Fetching Aswartha Lakshmi Mitta Quotes