రామరాజ్యం
కొనసాగుతుంది
ధృతరాష్ట్ర పాలన-
మానని మనసు గాయాలకు
లేపనం కానరాక
ఏకాంతనై
కాలుతున్న కొవ్వొత్తి వెలుగులో
చెక్కిట రాలిన కన్నీటి చుక్కులు
చితి మంటల్ని తలపిస్తుంటే
ఛిద్రమైన మనసుని
చీకటి సంద్రంలో కలిపేస్తూ
ఏకాంతగా మిగిలిన ఈ కాంత బ్రతుకును
శూన్యంలోకి తరుముతూ
నాకు నేనే సంతోషంగా
రాసుకుంటున్న నా 'మరణ శాసనాన్ని'..
-
ఎడబాటైనా.. తడబాటైనా
మన్నించు.. నీ ప్రేమతో
విరహమైనా.. కలహమైనా
మన్నించు.. నీ లాలనతో
ద్వేషమైనా.. దూషణైనా
మన్నించు.. నీ పలుకుతో
కోపమైనా.. తాపమైనా
మన్నించు.. నీ స్పర్శతో
ఎందుకంటే మన మధ్య
ఇవన్నీ తాత్కాలికం
ప్రేమ బంధం ఒక్కటే
శాశ్వతం అనుకొనే
మాయలో బ్రతుకున్న
నీకు ఏమి కాని బంధాన్ని కన్నయ్య నేను..
-
ఆశలెలా చిగురించునో మానవత్వం కరువైన మనసు లేని ఈ లోకనా..
నవ్వులెలా చిగురించునో నువ్వు లేని ఈ జీవితనా..
కనుమరుగైపోవునా గుండెలోని నీరూపం
నిన్నుచూసిన కన్నులతో చూడలేను అంధకారం..
చీకటిలో వెతకలేను వెక్కిరించే నీ నవ్వులను
శిథిలమైన నవ్వులతో గెలవలేను బ్రతుకును..
జీవితానే నరకంగా మార్చిన ఎదగాయంతో
మృత్యువునపుతూ బ్రతుకలేను భయంతో..
నీ తలపుల చితిపేర్చి నాతనువును జతకూర్చి
పయనమయే తుది శ్వాస.. తోడులేని ఈ లోకాన్ని విడిచి...
-
నాకు నేనే అంతుచిక్కని ప్రహేళికనై మిగిలా..
కలం కదలని ఆలోచనలా ప్రవాహంలో...
-
అంతులేని అగాధమెదో తరుముతున్న
అనుక్షణం ముడుచుకుంటున్నా నాలోనేను..
అవమానాలు అతిథిగా ఆదరిస్తే
అవని అంత సహనం లేని నేను
అణుచుకుంటున్న ఉద్వేగాల సమరంలో
అంతర్మథనపు కల్లోలం నాలోనేను..
అపనిందలు మోసినవేళ
అశోకవనంలో అతివను నేను
అదేగా సమాజపు కట్టుబాటు
అలల హోరుని హరించే చెలియలికట్ట
అలుసేగా ఆడదాని జీవితపు చిట్టా..
-
ఆకాశ వీధిలో అందాల తారకనై
నీ చల్లని కిరణానికై వేచియున్న
గల గల పారె నీ జలపాత ధ్వనికై
వయ్యారి నదిలా వేచియున్న
నీ సింధూరపు కిరణాల కాంతికై
తూర్పు పాపిటనై వేచియున్న
నీ స్వాతి చినుకుల చిరుజల్లుకై
చకోర చంద్రికనై వేచియున్న
వెచ్చని నీ అధరాల శ్వాసకై
తనువుని నిలువెల్ల తొలిచిన వేణువునై వేచియున్న
ఈ గోరంత ప్రాణం నీలో చెరేదెపుడంటూ
కొండంత ఆశతో ఈ దివిన వేచియున్న.. గోపాలా..
-
నీ దరి చేరు మార్గంకై వెతుకుతున్నా..
మనసు తీరంలో దాచిన చిరునవ్వుల జ్ఞాపకాల ఊసులతో..
నిన్ను చేరే దారి తెలియకపోయిన ..
నువ్వు నా కనులకు మాత్రమే దూరమే కానీ..
కలలకు దూరం కాదుగా..
స్నప్వసీమలో నిను చేరు క్షణమున..
మన ప్రేమ మిగిల్చిన పరిమళాన్ని ఆస్వాదించుటకు
నేను ఎల్లవేళలా సిద్దమే..
మనసుల కలయిక ముఖ్యం కాని
తనువుల ఆరాటం కాదుగా..
ఏరులై సాగె మన ఆటల మాటల ప్రవహంలో
తార శశాంకలే సిగ్గుపడి దాగుకొనగా..
మంచు పువ్వులే మల్లే పూవులుగా మారి కాలమే స్థంబించదా
మన కలయికలో..-
గాలిలో ఎగిరే పక్షికి తెలియదు.
తన గూడును కూల్చేసే శత్రువు గాలే అని..
నీళ్లల్లో ఈదే చేపకు తెలియదు..
తన మృత్యువుకు కారణం తన నుండి దూరమైన నీళ్లే అని..
ధనవ్యామోహంలో ముగిన మనిషి తెలియదు..
తన పతనానికి కారణం ఆ ధనామేనని..
డబ్బుందన్నా గర్వంతో మురిసిపోతావ్..
బంధాల్ని బంధుత్వాలని మరచిపోతావ్..
అయినవారందర్ని దూరం చేసుకుంటావ్..
శత్రువులందర్ని దరిచేర్చుకుంటావ్..
జానడంత జాగ కోసం ఆరాటపడుతావ్..
అన్నదమ్ముల బంధం విడగొట్టుుకుంటావ్..
స్నేహితులను కూడా శత్రువులా చూస్తావ్..
డబ్బే నీ సొంతమనుకుంటావ్..
చివరికి ఆ డబ్బే నీ అంతానికి మూలం అని తెలుసుకోలేకపోతావు..
జీవించేందుకు డబ్బు అవసరం కావాలి కానీ జీవితమే డబ్బు కారాదు..
-
నిజాన్ని అబద్దం అని నమ్మించలేక
నిజాన్ని దాస్తే....
నిజాన్ని దాచడం మోసమైంది..
నిజంగా అభివర్ణించబడ్డ అబద్దం నమ్మకంగా మిగిలింది..-