నీ మదిగదిలో ఊపిరాడక
ఉక్కపోస్తోంది!
నీ మనసు కిటికీ నుండి
ప్రేమ గాలిని పంపావ్ కదా..
అందుకే అది చల్లని
మంచుకొండగా మారి
మలయమారుతం అయింది!-
కాలంతో పరుగులు.. !!
కలం ఊసులు..
కాలం.. రుసరుసలు.. !!
కలం కోసం మెరుపులు..
కాల... read more
గాఢమైన ముద్దొక్కటి చాలు,
నీ ప్రేమెంతో తెలియడానికి!
బిగి కౌగిలి చాలు..
నిన్ను తలుచుకుంటున్నానని
చెప్పడానికి!!
కళ్ళల్లో నీ రూపు చాలు,
మదిలో నిన్ను అపురూపంగా
దాచుకోవడానికి!
నువ్వుంటే చాలు..
నా ప్రేమ రాజ్యాన్ని ఏలడానికి!-
నీమీద నా ప్రేమ
చెప్పలేకపోవచ్చు!
నీకు అర్ధం కాకపోవచ్చు!
నాకు తెలిపే విధానం
రాకపోవచ్చు!
కానీ నా ప్రేమ
నిజం!.. స్వచ్ఛం!
స్వార్ధం, సర్వం!
నీ ప్రేమలో నేనోడిపోయా!
నా ప్రేమలో నువ్వు గెలిచావ్!
అనంతమైన ప్రేమకి
గుప్పెడంత గుండె సరిపోదే!
నీలా నేను దాచుకోలేనే!
ఈ ప్రేమ (రాయ)భారం..
నాకేనా..!? నీక్కూడా..
ఉంది కదా!!
కానీ.. నీకెందుకు
అర్ధం కాదోయ్!??-
కన్నుల్లో నేను కన్నీరై కరిగేలోపే
నా ప్రేమను నీలో నింపి..,
నీలోని నా ప్రాణాన్ని బతికించుకుంటా!
కళ్ళల్లో ఈ ప్రేమను నీకందిస్తూ
గుండెల్లో నీపై నా ప్రేమను దాచి,
నీకోసం వెలిగే దీపమై నిన్ను కాపాడుకుంటా!-
నేనొక కలం..!
నల్లబడిన మనుషుల
మనస్సులో తెల్లగా
మెరిసే ఓ శ్వేత వర్ణం!
పరికించి చూడు..
పలికే ఓ మౌనం!
కదిలించి చూడు
కరిగే ఓ మేఘం!
నర్తించి చూడు..
నేనో మయూరం!
చలించిపోవా..
నేనో మధుర స్వప్నం!-
నా చెవుల నిండుగా నీ మాటలు ఉండగా..
ఈ అందమైన ఝంకాలు దండగే దండగ..!-
ప్రేమలో ప్రేమకు మరకలు ఉండవు
ప్రేమించే ప్రేమకు అరమరికలు ఉండవు
ప్రేమనే భాషకు భావాలే తప్ప బేధాలుండవు
ప్రేమికుల గుండెల్లో స్వచ్ఛమైన ప్రేమే తప్ప
పగలు, ప్రతీకారాలు, వంచన మోసాలు,ఉండవు!-
అలలుగ మనసెందుకో కనిపించని
కల్లోలంగా భ్రమించేనెందుకో..
ఎడతెగని ఆలోచనల వరదల్లో
మునిగిపోయే నా ఎద తీరమేమో..!
ఆశలకు హద్దు లేదేంటే..ఓ చిట్టిమనసా..
అందని ఆ ఆశకి.. కానరాని కమ్మని
స్వప్నమాయే నీ మాయలో పడి..
నా మతి చెడి..తడబడేను
నా గుండెలో తీయని అలజడి!-
ఈ దీపాల వెలుగులో నేను ఓ వెలుగునై
కాంతినిస్తూ కమ్మని తీపి రుచులను ప్రేమతో పంచుతూ
అందరి క్షేమాన్ని తలుస్తూ మరొక్కసారి అందరికి
దీపావళి శుభాకాంక్షలు 😊🙏-