QUOTES ON #నాన్న

#నాన్న quotes

Trending | Latest

గమనించి చూస్తే నేనందుకున్న ప్రతీదీ...
నాన్న గుండెపై నా పాదం మోపితేనే...

-


16 JUN 2019 AT 9:13

సమయం సరిపోకున్న
సంతోషం దరిచేరకున్న
కష్టం ముంచెత్తుతున్న
నష్టం దండెత్తుతున్న
చెరగని చిరునవ్వుతో
కదలని మనస్సుతో
మన నడకలోనూ, నడవడికలోనూ
మన భారంలోనూ, బాధ్యతలోనూ
నీ వెంట నేనున్నా అనే నాన్న కు నమస్కరిస్తూ
పితృ దినోత్సవ శుభాకాంక్షలు

-


21 JUN 2020 AT 8:42

ఒంటరై ఓడిపోలేదు
ఓడిపోతానని తెలిసి ఒంటరయ్యాడు

-


23 JUL 2020 AT 22:59

నాన్నంటే పొగుడుతుంటె ఉండలేక కదిలానూ
కంటనీరు తిరుగుతుంటె ఆపలేక కదిలానూ

వేలుపట్టి వేలుపెట్టి బడికి వారు పంపిరంటె
భయంతప్ప పలికినట్టి మాటలేక కదిలానూ

అమ్మకన్న ఎక్కువగా అభిమానం పంచిరంటె
తలనిమిరిన క్షణమొక్కటి గురుతులేక కదిలానూ

తోడుండే ధైర్యమంటు తోటివారు అంటుంటే
ఎన్నడైన నాన్నొచ్చిన జాడలేక కదిలానూ

స్నేహితులుగ కలిసిమెలిసి తిరిగేటీ వారమంటె
గుండెలోన బాధనంత దాచలేక కదిలానూ

కవులెందరొ కమ్మనైన కవితలతో కొలుస్తుంటె
కల్పితాలు అల్లనంటు రాయలేక కదిలానూ

చదువుసంధ్య లన్నిటిలో అమ్మలాగ అండుంటే
ఇంకోలా ఉండేదని చెప్పలేక కదిలానూ

-



మనసులోనే బాధను అణిచిపెట్టి
కష్టం దరి చేరనివ్వని కవచం నాన్న

తన రెక్కల కష్టం మీద సింహాసనం వేసి
మన భవితకు పునాది వేసే మార్గం నాన్న

తడబడిన అడుగులకు నడకను నేర్పి
మన ఉన్నతికి దారులు వేసే భవిష్యత్ నాన్న

జీవితాన్ని ఒక పుస్తకంలా మలిచి
అనుభవ పాఠాలు నేర్పే తొలి గురువు నాన్న

ప్రేమకు ప్రతి రూపం నాన్న
ప్రపంచానికి అర్థం చెప్పే తత్వం నాన్న

Sravani kaicharla





















-


30 APR 2019 AT 23:40

నువ్వుంటే నా ప్రక్కన
నాకు ఒక ధైర్యం,
నేను పడిన ప్రతి సారి తట్టి లేపి ముందుకు నడిపిస్తావని...
నేనా! ఆ పని చేయగలనా? అని నేనన్న ప్రతి సారి, హనుమంతుడికి తన శక్తి ఎవరో చెప్తేనే తెలిసింది అట...
నేను చెప్తున్నాగా నువ్వు ఆ పని చేయగల సమర్దురాలివే అంటూ నాలోని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నూరిపోస్తావు...
నేను తప్పుచేస్తే సరిదిద్దుతావు, అల్లరి చేస్తే భరిస్తావు, ముద్దు చేస్తావు, సంస్కారాన్ని, విలువల్ని నేర్పిస్తావు...
నీ ఆశీర్వాదాలు ఇస్తావు...
ఇంత చేసి నా నుంచి నువ్వు ఆశించేది ఏమి ఉండదు...
ఈ స్వచ్ఛమైన ప్రేమకు నేను సదా కృతజ్ఞురాలిని...
నాన్నకు ప్రేమతో...
మీ లక్ష్మీ నారాయణ గారి అమ్మాయి...

-


17 JUN 2018 AT 15:43

నాన్నకి కోపంవస్తే
సూర్యుడు.
ప్రేమ పంచటంలో
చల్లని చంద్రుడు.
ఇప్పుడు ఇద్దరిలో
నాకు ఆయనే కనిపిస్తారు ‌‌ భౌతికంగా‌‌ లేకపోయినా!

-


3 APR 2020 AT 9:29

నువ్వే నేనైనపుడు
మళ్ళీ నీకై నే వేచి చూడటమెందుకు
నా మనసులోనే నీ రూపు కొలువున్నపుడు
నా కనులు నిన్నెక్కడో వెతకడమెందుకు

నువ్వే నేనైనప్పుడు
ఇక నాకు దిగులెందుకు
నువ్వే నాలో ఉన్నప్పుడు
వేరే సంతోషమెందుకు

-


2 FEB 2019 AT 20:57

నేను వంటచేసినప్పుడు అమ్మ చేత చివాట్లు తిన్నా, తమ్ముడు వెక్కిరించినా, నాన్న మాత్రం అచ్చం మా అమ్మలా భలే చేసావు అంటూ నన్ను మెచ్చుకున్న క్షణాలు ఆహా అద్భుతం...

-


6 APR 2019 AT 21:46

నాన్న
రెండక్షరాల అనురాగం.
అనుక్షణం మనకోసమే తపిస్తూ
మన నవ్వుల్లోనే ప్రపంచాన్ని చూస్తూ
ప్రేమతో చల్లని వెన్నెల కురిపించే జాబిల్లి

-