Jaswanth Mani Sirdha   (✍🏻 మణి)
127 Followers · 36 Following

read more
Joined 24 March 2018


read more
Joined 24 March 2018
15 JUN AT 8:15

నాన్న....
నవ్వుతున్నట్టు కనపడతాడు కాని
ఆ నవ్వు వెనక కన్నీళ్లు మనకి కనిపించవు
మౌనంగా ఉన్నట్టు అనిపిస్తాడు కాని
ఆ మౌనంలో దాగిన కష్టాలు మనకి తెలీవు
ఖాళీగా ఉన్నట్టు చెప్తాడు కాని
ఆ ఖాళీ లో పడే శ్రమ మనకి చెప్పడు
విస్పోటం లా పేలుతున్నట్టు ఉంటాడు కాని
ఆ విస్పోటం వెనుక ఉన్న ప్రేమ మనకి చూపడు
ఏ భావం చూపక మూర్తి స్వరూపమై కనిపించే నాన్న
ఏ దేవతా మూర్తి కన్నా తక్కువేం కాదు

-


4 AUG 2024 AT 9:57

పచ్చికన చినుకులా
చీకటిన వెలుగులా
అలసటన బాసటగా
ఒంటరితనాన నీడగా
అవసరమైనా
అవకాశమైనా
అవరోధమైనా
ఆవేశమైనా
నేను ఉన్నానంటు పలకరించేది
స్నేహం...మన స్నేహం
మిత్రులందరికి
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

-


20 MAR 2024 AT 20:46

అలకైనా

ఆపదైనా

కలహమైనా

ఓటమైనా

ఏమైనా సరె చలించు కాని చింతించకు

-


14 JAN 2024 AT 15:02

జగము ఎరగని
హనువు లోహితమును
ముత్య గర్భమున దాచింది తానే
జనుల కొరకని
హనుమంతు అశక్తతకు
మణి కవచమును ఇచ్చింది తానే
మంచి నొసగని
మైఖేల్ అను అసురుడి
ఆహుతిని కబళించింది తానే

-


28 DEC 2023 AT 22:17

అయ్యో సారు
జనానికి పుక్కట్ల ఇచ్చే
ప్రభుత్వ పథకాలు కావాలి కానీ
మంచి చేసే సలహాలు ఎందుకు !!!

-


15 NOV 2023 AT 10:14

Life is a chance
It is only one chance
What ever comes in life,
are not the chances.
They are just opportunities
Either win those
or
Experience the life.

-


24 JUN 2023 AT 16:38

కాలం పరిగెడుతోంది
పరిగెడుతూ.....నన్ను లాక్కుని వెళుతోంది
నేనింకా నీ జ్ఞాపకాలలో ఉన్నా
నీ పలుకులకై వెతుకుతూ
నీ నవ్వులకై వెంపర్లాడుతూ
ఏదో రూపము లో నన్ను పలకరిస్తావని కలవరిస్తున్నా...

-


29 AUG 2022 AT 18:20

నా హృదయ వీధల్లోకి
కూసింత బెరుకు తోటి
కాసింత చింత తోటి, అడుగులేస్తున్న నీకు
హర్షమునైన,
పరుషమునైన,
వర్షము మారిన,
మరో అంతరిక్షము లోకి భూమే, చేరిన
నీదే వేలు విడువని, తోడై ఉంటా

-


1 AUG 2022 AT 22:12

ఇష్టమైన వాటిని తినకుండా ఉండగలము
కానీ
ఇష్టమైన వాళ్ళని వదిలి ఉండలేము

-


19 JUN 2022 AT 8:32

నేడు అనే రోజున
గెలిచిన, ఓడినా
అలసినా, సొలసినా
రేపు అనే రోజుకు
బాధ్యతని, ధైర్యాన్ని
పోగేసుకని, రోజు పోరాడే నాన్నకు
పితృ దినోత్సవ శుభాకాంక్షలు

-


Fetching Jaswanth Mani Sirdha Quotes