శ్రావణ సమీరం   (Sravani kaicharla)
331 Followers · 62 Following

read more
Joined 16 February 2020


read more
Joined 16 February 2020

ప్రశాంతంగా నవ్వుతున్న ఆకాశం
ఆమె ఆలోచనలకు అద్దం పట్టిందేమో..!?
ఓ కమ్మని కలకు నిచ్చెన వేసింది..

-





సమయం 10:00 గంటలు
రోజులానే టెర్రస్ పై కూర్చొని
పాటలు వింటూ..ఆకాశం వైపు చూస్తూ
చుక్కలు విసిరే ప్రశ్నల కోసం ఎదురుచూస్తున్నాను..
ఏంటి ప్రతిరోజూ ఇదే రొటీన్
బోర్ అనిపించట్లేదా అని
ఎక్కడో దూరంగా మెరిసి మెరవనట్టు ఓ చుక్క
ఓ మెరుపు లాంటి ప్రశ్న వేసింది..
అలవాటు అని చెప్తే పొరపాటవుతుందేమో కదా..
ఎందుకంటే
మనసుకు మనసుని అప్పగించే క్షణాల కోసం వెతికే నాకు
వెన్నెల ఓ కథే కదా మరి..

Sravani Kaicharla



-



మనసు మేఘం వర్షించిందా..!?
కన్నుల్లో చిటపట చినుకుల హడావడి..

-



చీకటిలో
ఆ వెన్నెల చినబోయిందో..!?
లేక
వెన్నెలలో
ఈ చీకటి అలుముకుందో ..!?
తెలీదు కానీ
ఆ చీకటి మదికి
జాబిలి ఓ నిదర్శనంగా తోచింది

-



చక్కగా చందమామ చుట్టూ తిరుగుతూ
చుక్కలకి వల విసురుతుంటే
అంతరిక్ష వీరుడేమో అనుకున్నాను..

సముద్రం ఒడ్డున కూర్చొని
ఆ అలలను వెంటాడుతుంటే
ఏ చెలి కోసమో ఎదురుచూపులని భ్రమపడ్డాను..

వాన ఆటలో మీ పదాలు పాడుతుంటే
తామరాకు పై ఓ నీటి బొట్టులా ఒదిగిపోయాను..

మీ అక్షర జాబిలికి చిక్కి
ఏ చుక్కో అంటూ..నా అక్షరాలు అల్లరి చేస్తుంటే
నన్ను నాకై తిరిగి కొత్తగా పరిచయం చేసుకున్నాను..

ప్రయాణం ఏమైనా
సముద్ర నానీలుగా మొదలైన ఈ సముద్ర వీరుడి కథ
అంతరిక్షానికి అల్లుడయ్యే వరకు
ఉన్నత శిఖరాలను
తాకుతూనే వుండాలని కోరుకుంటూ...మీ చెల్లి..

- శ్రావణ సమీరం (Sravani Kaicharla)




-



తన పరిమళాలు
ఈ పూవులో దాగున్నాయేమో..!
ఆమె అరచేతులు
అందంగా విచ్చుకున్నాయి..

- Sravani Kaicharla

-



ఈవేళ
చిగురు కొమ్మలో పిల్లగాలి చేసే హడావిడికి
మదిలో హాయి గొలిపే ఆశల అలికిడి మొదలై
ఏకాంతం రెక్కలొచ్చి అటూ ఇటూ ఎగురుతున్న భావన..

ఎన్నో క్షణాల నిరీక్షణ ఈ క్షణం అంతమైనట్లు
కలల వాన కవితలై కురుస్తూ అక్షరాల్లో చిందులేస్తున్న హాయి..

ఏమిటో ఈ హాయి..!
సూర్యుని ప్రతాపం తగ్గినందుకో
లేక
ఈ క్షణం ఏ ఆలోచన లేని ఒంటరి మదికి
ఈ చల్లగాలి తోడైనందుకో మరి..

Sravani kaicharla


-



కలం కాలం
ఈ రెండూ ఎప్పుడూ నాకు నేస్తాలే..
ఎందుకో తెలుసా..!?
కాలానికి నను వెనక్కి నెట్టే పని వుండదు
కలానికి నన్ను విమర్శించే శక్తి లేదు..

-



నీ నెమలి పింఛముతో
చిలిపి పసితనపు ఛాయలు మెరిసేలా..
నీ వేణుగానం
ఆలపించే ప్రతి మదికి
సరికొత్త లోక శృతి లయలే కదా..!
యశోదమ్మ ఒడిలో
నీ అల్లరి చూసిన
ప్రతి గోపిక మదిలో
నీ రంగుల హోలీయే కదా..!

-



నాకోసం నాలోన కొన్ని అక్షరాలు
ఇంకా మిగిలే వున్నాయంటే చిత్రంగా తోస్తుంది
నా చుట్టూ వెల్లివిరిసిన ఈ వెన్నెల అందంగా చెప్తుంటే...

-


Fetching శ్రావణ సమీరం Quotes