QUOTES ON #ధైర్యం

#ధైర్యం quotes

Trending | Latest
29 MAY 2020 AT 9:14

ఒక్కోసారి నువు
ఒంటరివి అవ్వొచ్చు
అయినా యుద్ధం చెయ్యాలి
నా అనుకున్న వారు
నీతో ఉండకపోవచ్చు
అయినా సరే పోరాడాలి
నిన్ను మెచ్చే నీ అనుచరులు
నీతోడు రాకపోవచ్చు
అయినా ముందుకు సాగాలి
నమ్మిన మిత్రులే
శత్రువులవ్వచ్చు
అయినా ఒంటరితనమే
నీ బలమవ్వాలి
నీచేతిలో ఉన్న ఆయుధం
నీకు సహకరించకపోవచ్చు
మనసున ధైర్యమే
నీ ఆయుధం అవ్వాలి
నిన్ను ముందుకు నడిపే
ప్రతి అడుగు దానికి పదునవ్వాలి
గెలుపు నీకు రాజసమవ్వాలి
అలుపు నీ బానిసవ్వాలి

-


7 MAR 2020 AT 8:14

ఒంటరోళ్లమని మా బ్రతుకులు మీకు అలుసవ్వచ్చు
మాకింకా బరువవ్వలేదు
మనసులో ధైర్యం కరువవ్వలేదు

-


25 JAN 2019 AT 12:55

ధైర్యం..

నీలో పుడితే బలం

ఒకరిని చూసి తెచ్చుకుంటే బలహీనత.

-


10 SEP 2019 AT 0:58

ఆగని
నువ్వాపలేని వాటిలోనే
నువ్వాగిపోతుంటే
అదృష్టవశాత్తు ఆ ఆగనిది ఆగిననాడు
నీకంటూ ఏమైనా మిగిలుంటుందో లేదో
అన్న భయాందోళనతోనే బ్రతికేవేం?
నువు ఆగిపోబోక ముందే నీలో
కదలికను కలిగించు
నీ కథలోని మలుపును నీ కనువిప్పుతోనే
మున్ముందుకు నడిపించు

-


12 APR 2020 AT 19:04

నేను వెళ్లే దారి అంతా
చీకటిగా ఉన్నా
చేతిలో దీపం ఉన్నంత ధైర్యం
ఆయన మాట
మదిలో మెదులుతున్నంతసేపు..😊

-


28 MAR 2019 AT 1:21

నువ్ వెళ్ళే దారిని ఒక్కసారిగా చీకట్లు కమ్మేసాయ్..
అపుడు క్షణం తడబాటు సహజం...
కానీ మరుక్షణం ధైర్యాన్నంతా కూడదీసి ముందుకెళ్ళు...
చీకటిని చూసి ఆగిపోతే ఇక నువ్వేన్నటికీ వెలుగుని చూడలేవ్...

-


10 AUG 2021 AT 7:32

మానసికంగా గాని
శారీరికంగా గాని
నా దృష్టిలో
ఆడదే చాలా స్ట్రాంగ్ ..

ఈ ప్రపంచంలో
అందరికన్నా
తురుంఖాన్ అని
ఒకడుంటే
వాణ్ణి కన్నది ఆడదే..

కన్ను తెరిస్తే
ఈ ప్రపంచాన్ని
అంతం చేసే
ఎంతో శక్తి ఉన్న
శివుడి గుండెల పై
కాలు మోపింది
కాళికామాత ఓ ఆడదే..

-


19 DEC 2019 AT 18:57

కొన్నిసార్లు అధైర్యం ఆహ్వానిస్తుంటే
ధైర్యం దాగుడుమూతలు ఆడుతుంటుంది

-


5 JUN 2021 AT 21:55

ఏ సూక్తి, ని బాధలను తీర్చి ఇవ్వదు ముక్తి
మనోధైర్యమే ని శక్తి
ఆత్మవిశ్వాసమే నీ సమస్యకు ఇస్తుంది విముక్తి

-


27 JUN 2019 AT 19:47

ఎన్ని కష్టాలు ఎదురైనా ఇంకా
ఈ ప్రాణం ఉంది అంటే
మా అమ్మ ఉందనే ధైర్యం!
నేను ఏ పని చేసిన తప్పు
మాత్రము చేయను అని
మా అమ్మకు నాపై ఉన్న నమ్మకం !

-