మనిషి రాలేని తీరానివో
మనసు తేలేని భారానివో
కలలు కోరేటి దృశ్యానివో
కనులు కార్చేటి కన్నీరువో-
మధుర భావాల రాగానివా
మనసు చేసేటి మారానివా
కనులు కోరేటి స్వప్నానివా
కథలు మార్చేటి కాలానివా
-✍️లక్ష్మీ నారాయణ D.
-
ఎదను కాల్చేటి కావ్యానివా
కథను మార్చేటి కల్పానివా
కడకు చేర్చేటి పాశానివా
బ్రతుకు నేర్పేటి పాఠానివా
-
తలపులన్నింట నీవేనులే
వలపు వాకిట్లొ ఉన్నాను నే..
కలలు అన్నింట నీవేనులే
కలవరిస్తున్న నీ ప్రేమకే..-
నిదుర రాకుంది నీ ధ్యాసలో
మరువ లేకుంది నీ ఊసులే
గతము కానుంది ఓ గమ్యమే
తొలగి పోనుంది ఆ మౌనమే-
మనసులో లేకపోతే హితం
మనిషిలో ఉండునా వర్ణమే
విధముగా చూసినా, వచ్చునా
అసలు సత్యానికుండే స్థిరం
-
ప్రతిభ నీదే ప్రమోదంబు నీ
దె తరుణీ నీదె భోగంబు నీ
కు తృటిలో సోకు దైన్యంబు తీ
రి తలపంగా బ్రియంబౌను లే-
పలికె వేవేల వేదాలనూ
కొలిచె ఎన్నెన్నొ దైవాలనూ
మరచె మానుష్య సంబంధమూ!
వెరసి పుణ్యంబులేమొచ్చునో?-
కలల లోనుంచి పోనంటదే?
కనుల ముందైన రానంటదే?
మనసు కల్లోలమౌతుంటె తా
నొకతి నవ్వేసి, పొమ్మంటదే!?-