QUOTES ON #కర్మ

#కర్మ quotes

Trending | Latest
20 MAR 2021 AT 10:29

మనకొస్తే కష్టకాలం..
యెదుటోడికొస్తే కర్మఫలం..!!

-


23 OCT 2019 AT 22:32

# కర్మ - The Fate

కాలం ఏ సన్నివేశాన్ని మర్చిపోదు
కర్మ రూపంలో గుర్తుచేస్తూనే ఉంటుంది

కర్మ కాలితే కాలంలో గతించిన మర్మాలే
సాక్షాలై నిలువునా దహించివేస్తాయి

కళ్ళతో చూసిన నిజాలకూ
చెవులతో విన్న ప్రశ్నలకూ
నోటితో విసిరిన నిందలకూ
తెర వెనుక నడిచిన భాగోతానికి
సంక్షిప్త సమాధానమే 'కర్మ'


-


12 FEB 2018 AT 18:12

‌జరుగుతున్నది జగన్నాటకం
దర్శకత్వ పర్యవేక్షణ ఆ భగవంతుడు
నువ్వు చేసేది నేను పట్టించుకోకపోయినా
ఆయన చూస్తూనే వుంటారు
చిత్రగుప్తుడు చిట్టాలు రాస్తూనే ఉంటాడు
నీ కర్మ కి నిన్ను వదిలేయడం నా మంచితనం
అది నా బలహీనత అనుకోవడం నీ వెర్రితనం
చూద్దాం ఎవరి రాత ఎలా ఉందొ.

-


21 APR 2018 AT 8:33

కర్మ:

మనం చేసిన మంచి లేదా చెడు మళ్లీ తిరిగి మన దగ్గరికే వస్తుంది🍃

ఖర్మ:

ఎదో ఉద్దరిస్తారని మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే, జనాల్ని జలగల్లా పీలుస్తూ, వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మనల్ని పావులుగా వాడటం.
ఈ విషయంలో అన్ని పార్టీలు ఒకే త్రాటిపై ఉండం నిజంగా మన ఖర్మ కాక,ఇంకా ఏమిటి ?!

-


2 MAY 2017 AT 12:06

ఒక చేతిలో గీత పట్టుకొని
ఇంకో చేతిలో గీతలు లెక్కెట్టుకుని
అలా చూస్తూ కూర్చుంటే ఎలా పార్థా!?

ఏ కర్మా చెయ్యకుండా నా ఖర్మ ఇంతే అంటే ఎలా.🤘

-


9 FEB 2020 AT 12:00

కర్మ సిద్దాంతం అంటే?

ప్రపంచంలో ఎంతో మంది ఉన్నా
మీరూ నేనూ ఇలా కలిసి ఉండడం.🤘

-


31 MAY 2019 AT 7:48

కర్మ ఫలితం,
జన జీవితం.

-


21 NOV 2019 AT 11:09

కళ్ళు పొంగె
విషాద ఆనందాల వేళ

కడలి పొంగె
అమావాస పున్నమి వేళ

ఆ కడలి చల్లపడునెప్పుడో
ఈ కళ్ళు మూతపడునెప్పుడో

కాలమే సమాధానం చెప్పాలి
కర్మ ఫలితమే అనుభవించాలి.🤘

-


24 APR 2021 AT 10:12

చావనివ్వనిది కర్మే
బ్రతకనివ్వనిది కర్మే...

కదిలించేది కర్మే
కదిలికాపేది కర్మే...

పుణ్యమిచ్చేది కర్మే
పాపమిచ్చేది కర్మే...

వరమయ్యేది కర్మే
శాపమయ్యేది కర్మే...

బంధించేది కర్మే
బంధమయ్యేది కర్మే...

నీ త్రికర్మలను కర్మయోగిగా దాటరా,
ఆర్య పుత్రుడా, ఆత్మ నిష్ఠుడా...

-


24 APR 2020 AT 7:51

ఉంటుందో లేదో మళ్ళీ ఈ జన్మ
వీలైనంత చేయాలి మంచి కర్మ

-