డబ్బుకు మనసిచ్చే రోగుల మధ్య
ఎన్నాళ్ళని ప్రేమను బ్రతికించాలి
ప్రేమను నటించే దౌర్భాగ్యపు లోకంలో
ఎన్నాళ్ళని చస్తూ బ్రతకాలి
-
Nature & Wild Life Lover
March 18 - Birth Day
Staying in Hyderabad
Post... read more
పెళ్ళాం మోజులో పడి
కన్న తల్లిదండ్రులను పక్కన పెట్టిన
ప్రతీ సన్నాసికి ఇదే హెచ్చరిక
వీలైతే చచ్చిపోండి
మీరు నా మీద బతికితే
నాకు కూడా భారమే.
నేను భూమాతను
నేను ఒక తల్లినేనని
మర్చిపోవద్దు.
-
#రాయినైనా కాకపోతిని
రాయితో రాత్రంతా
ఒకటే గొడవ నాకు
విగ్రహమవుతానంది
గుడిలో పూజలు
అందుకునేందుకట!
పునాదిలో నీవుంటే
ఆ గుడినే నీ భుజాలపై
మోస్తూ దేవుడిని భక్తుల్ని
ఒకేసారి మోసే భాగ్యాన్ని
పొందుతావ్ కదా అని నేను!
సరే రెండు నేనే
అవుతానంది ఆఖరుకి
పునాదిలోనూ తనేనంట
గుడిలోనూ తనేనంట
ముక్కున వేలేసుకుంటి కదా
మాకెప్పుడు వస్తుందో
నీకున్న మంచి స్వార్థం !!-
సెల్లె ఎట్లున్నవే
ఆడ అంత మంచిదేనాయే
అల్లుడు అంబాడుతుండాయే
బావ ఎట్లున్నడే !
కట్నం ఇచ్చుడు దగ్గర కొద్దిగా
ఆలశ్యం అయినమాట వాస్తవమే
మనింటి పరిస్థితి బావకు తెలుసు కదే
సెల్లె మొదటి కాన్పు పుట్టినింట్ల
నోచుకోకపోతివి కట్నం లొల్లిలతోని
బావకు సెప్పే సంతానం అయితే
పురుడన్న అవ్వ సేతులమీద
జరిపిద్దామని మా అందరి కోర్కెఉండే
ఆ సంబరం గూడ లేకుంట ఎల్లిపాయే
బావకు సూపియ్యే ఈ ఉత్తరం
బావా పత్తి అమ్మిన పైసలు అచ్చినయే
బావ నీ కాల్మొక్కుతా సెల్లెతోని
ఒకసారి ఇంటికి అచ్చిపోయే
ఆడికి కుటుంబం మొత్తం అద్దామన్న
కర్సులకు పైసలు సాలయి బావ
కట్నం పైసలు ముట్టయెప్పంగా
రెండేళ్లు దాటిందే నువ్ పోయి
లొల్లిల మన్నువడ పైసల కాడనే
సెల్లె కొడుకుకి ఏం పేరు పెట్టినరే
పత్తి పైసలు అచ్చినయి ఆయిన్ని
పైసలు బావకు ముట్టసెప్పుతమే
పోసవ్వకు, ఎల్లవ్వకు చేసుకుందాం
సెల్లె బావను ఒప్పిచ్చి తొల్కరాయే-
తాతయ్య.. తాతయ్య
కళ్ళు తెరవండి తాత
మీకిష్టమైన వెనీలా కేక్ 🎂
హ్యాపీ బర్త్ డే తాతగారు.. 💥💥
కళ్ళు మసక మసకగా ఉన్నాయి
కొడుకులు, కూతుళ్లు, వాళ్ళ పిల్లలు,
మనుమళ్ళు, ముని మనమళ్ళు,
మనమరాళ్ళు, ముని మనమరాళ్ళు,
ఇంకా తోడబుట్టిన అక్కలు, తమ్ముళ్లు
ఎంత మంది ఉన్నారో గుర్తులేదు
రాత్రి 12am ఒక్కసారిగా
ఇంట్లో సందడి వాతావరణం
నా సొంతింట్లో పొలాల మధ్యలో
కన్నుల పండుగగా ఉంది
నా కుటుంబ వంశవృక్షాన్ని చూస్తుంటే
తాతగారు మీరు 22 వ
శతాబ్దంలో చేసుకుంటున్న
మొదటి పుట్టినరోజు ఇది..
నా పుట్టినరోజు మార్చ్
పద్దెనిమిది, ఎనభైఐదు దశకం
( కాప్షన్ లో మొత్తం చదవండి)-
#మాస్క్ ధరించనిచో
పోలీసులు 1000/- ఫైన్ వేస్తున్నారు
Lockdown లో జాగ్రత్తగా
నడుచుకోవాలి అంటున్నారు
అందుకే Playstore కి
కాలినడకనే వెళ్తున్నాను.
ఒక్కోసారి పరిగెత్తుకుంటూ
వెళ్లినా మాస్క్ ని మాత్రం
తప్పనిసరిగా దరిస్తున్నాను.
అక్కడ వివిధ పలురకాలైన
Apps ఉంటాయి వాటికి
ఇబ్బంది కలిగించకుండా
సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ
సానిటైజర్ తో చేతులు కడుక్కొని
Apps ని ఇన్స్టాల్ చేస్తున్నాను.
నా త్యాగ నిరతను ఇకనైనా
ప్రభుత్వం మరియు GOOGLE
గుర్తించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
వారిచే ఏదైనా ఒక చిన్నా చితక
అవార్డ్ ఇప్పిస్తుందేమోనని
కళ్ళు కాయలు కాచేలా
ఎదురుచూస్తున్నాను.-
కాలమే ప్రశ్నిస్తుంది
కాలమే సమాధానమిస్తుంది
సరైన సమయం కోసం
ఓపికతో నీరీక్షించు మిత్రమా!
ఇట్లు/ ప్రకృతి-
ప్రియాతి ప్రియమైన సుతి మెత్తని పొట్టకి
కుశలమేనని తలంచి వ్రాయునది ఏమనగా,
నువ్వున్నదే జానెడు
తినేదేమో తట్టెడు
తింటే తిన్నావ్ సరే
మరి నీ బుద్ధేమైంది
లాక్డౌన్లో బయటకి రావొద్దని
నెత్తి నోరు మొత్తుకుని చెప్తుంటే
ఎందుకు వస్తున్నావ్ మళ్ళీ?
నోటికి రుచెక్కువైతే
పొట్టకు బరువుక్కువైతదని
ఊరికే అన్నారా
జాగ్రత్త మరి, చిన్న పేగు, పెద్ద పేగును
మరీ మరీ అడిగినట్టు చెప్పు.
కొంచెం అడ్డమైనవి అరిగించుకోకని
చెప్పు ఒకేనా డ్యూడ్
ఉంటున్న మరి..!
ఇట్లు/ కన్నులు-
నేను లేకపోతే నీ యోగ్యతేంటో ఎవరికీ తెలీదు
నేను లేకపోతే అసలు నీ ప్రశంసకు పుట్టుకే లేదు-