రంగులన్నీ మిలితం
సర్వమత సమ్మేళనం
అందరికి ఆదర్శం
అదే నా దేశం-
నడిరేయి జాములో
వెన్నెల వాకిట్లో
నక్షత్రాల తోటలో
పున్నమి వెలుగుల్లో
పూసింది ఒక గులాబి
నీకై వేచింది ఈ జాబిల్లి-
అడిగి అడిగి
అలుసై పోకే మనసా
నలుసనుకుంటున్న
వాళ్ళ దగ్గరనుండి
వలసెళ్లి పోవే వయసా
చులకన చేసే వారి
చుట్టూరా తిరగకే మనసా
చుట్టపు చుపుదే
ఈ జన్మ అని
తెలుసుకోవే మనసా
కలసి నడవని
పాదాలకోసం
కలవర పడకే మనసా
జీవితం కథనరంగం
కాకుండ చూడవే మనసా-
పాటరాని దానను
వెయ్యలేను తాళమైన
రాగమెరుగని దానను
కదపలేను అడుగునైనా
నాట్యమెరుగని దానను
ఉండలేను క్షణమైనా
నిన్నువీడని నీడను
పలకలేను మాటనైనా
సిగ్గులొలికే చినదానను
వీడలేను ప్రాణమైన
నినుచేరే నీ దానను-
ఏమైందమ్మ ఓ మనసా
నీకెందుకే ఇంత అలుసు
బాగుందమ్మా నీ వరసా
వదిలెయ్యవా నీ నస
//ఏమైందమ్మ //
చెంతకైన నను చేరనీవు
చింతలైన తీర్చుకోవు
గుండెగొంతు విప్పిచూడు
గోడు నాతో చెప్పిచూడు
మందు ఐనా లేదు కదా
సంధి నాతో చేసుకోవు
//ఏమైందమ్మ //
పారిజాతమల్లె
పవిత్రమైంది జన్మ
వీడుకోలు పలుకే హక్కు
నీకు లేదమ్మా
కంట నీరు కారనీకు
ఒంటిగానే బ్రతికి చూడు
//ఏమైందమ్మ //-