QUOTES ON #అవసరం

#అవసరం quotes

Trending | Latest
21 SEP 2019 AT 1:06

నువ్ లేని లోటు తెలీడం లేదంటే
అచట నీ అవసరం అనవసరమని అర్థం
ఇచట నువ్విది తెలుస్కోవటం అత్యవసరమని అర్థం

-


23 JAN 2019 AT 9:37

అవసరం అయినది ఏది కోరిక అవ్వదు. కోరిక ఎప్పుడూ అవసరం అవ్వదు.!!

-


26 SEP 2018 AT 21:34

తియ్యతియ్యని మాటలు మాట్లాడిస్తుంది..
ఆకాశానికి ఎత్తేసే పొగడ్తలను కురిపించేలాచేస్తుంది..
మెప్పునుపొందడానికి ఇష్టంలేని చర్యల్ని కూడా చేపట్టిస్తుంది..
అవసరం ఏదైనా చేయిస్తుంది..
వ్యక్తిత్వాన్నే చంపేస్తుంది..

-


30 AUG 2022 AT 2:15

మనిషిని మనిషిలా కాకుండా
అవసరంతో పోలిస్తే అర్ధమవుతాడు..

అవసరానికి మించి
మనిషి పాత్రుండదు...

-


19 JUL 2019 AT 13:31

ఎవరికైనా నువ్వు అవసరంలోనే గుర్తొస్తావ్
నీ అవసరం ఉన్నంత వరకే గుర్తుంటావ్

-


6 MAR 2020 AT 7:34

అవసరాల వరకే బంధాలు,
తర్వాత నువ్వెవరో, నేనెవరో!!

-


31 OCT 2021 AT 1:08

ఒకరికి మంచి అనిపించేది
మరొకరికి చెడు అనిపించవచ్చు
ఒకరికి చెడు అనిపించేది
మరొకరికి మంచి అనిపించవచ్చు

ఒకరికి అవసరం అనేది మరొకరికి అనవసరం
ఒకరికి అనవసరం అనేది మరొకరికి అవసరం

ఒకరికి నచ్చేది మరో వ్యక్తికి నచ్చదు
ఒక వ్యక్తికి నచ్చనిది మరో వ్యక్తికి నచ్చుతుంది

ఒక వ్యక్తిని కొందరు ఇష్టపడతారు
అదే వ్యక్తిని కొందరు ద్వేషిస్తారు

మంచి చెడు అనేవి లేవు
అవసరం అనవసరం
నచ్చేవి నచ్చనివి
అనేవి మాత్రమే ఉన్నాయి

-


30 OCT 2019 AT 0:29

అవసరం మించి వాడితే వ్యసనం
పరిమితికి లోబడితే సుఖ జీవనం

ఏది అవసరమో అనవసరమో బేరీజు వేసేది వివేకం
అనవసరమైన బేషజాలకు పోయి నగుబాటయేది డాంబికం
సుమనప్రణవ్

-


5 APR 2018 AT 20:59

నీ ముందు నాలుగు అద్దాలు ఉంటే వాటిలో నిన్ను నువ్వు చూసుకుంటే నీకు నువ్వే నాలుగు రకాలుగా కనిపిస్తావు. అలాంటిది నీ ముందు ఉన్న ఇంతమందికి ఎన్నివిధాలుగా కనిపిస్తావు??!!!
వారి అవసరాన్ని బట్టి నీ ప్రతిబింబం మారుతుంది.

-



అవసరం అంటూ వేడుకుంటారు..
అవసరానికి వాడుకుంటారు..
అవసరం తీరాక ఆడుకుంటారు..

-