నా జీవిత కథకి నేను పెట్టుకునే పేరు
నా సహాయం, నాకు లేదు సహాయం.-
ఉన్నోళ్ళకు ఎన్నోసార్లు అన్నం పెట్టిన మనం..
లేనోళ్ళకు ఆకలి తీర్చాల్సిన సమయమొచ్చింది..
మీకు దగ్గరలో ఉన్న అనాధ శరణాలయం,
అడుక్కునే వాళ్ళు ఎవరైనా కనిపిస్తే
తోచినంత ఏదైనా సహాయం చేయండి..
దీపాలు వెలిగించి ఐక్యతను చాటించాం కదా,
ఇప్పుడదే ఐక్యతను నిరూపించుకుందాం పదా!!-
సహాయం
హృదయం ఎక్కడున్నదో అందరికి తెలుసు....
ప్రేమ ఎప్పుడు పుడుతుందో కొందరికే తెలుసు.....
మంచి చెడులు ప్రతి ఒక్కరికి తెలుసు.....
కానీ సహాయం చెయ్యడం మాత్రం బాధ అనుభవీంచినవారికే తెలుసు.......-
ఈ వేళ పొ౦దిన సహాయం
రేపు మరచిన...
సహాయపు ఫలితం గడియ గడియకు
సూదిలా అ౦తరాత్మను గుచ్చుతూ చూపిస్తు౦ది...
పొ౦దిన సహాయాన్ని మరవకు
మరల సహాయాన్ని పొ౦దే అవకాశాన్ని చేజార్చుకోకు
-
తొంభైతొమ్మిది సార్లు సాయం చేసినపుడు
నువు దేవుడివవుతావ్ వాడికి...
అదే ఆఖరిసారి వీలుపడదన్నపుడు
నువు శత్రువవుతావ్...
ఒక్కసారేగా శత్రువయ్యేది
మిగతా తొంభైతొమ్మిదిసార్లూ నువు
దేవుడివేగా... చేసేయ్ సాయం వీలైనంతగా...
వెన్నెల సతీష్...-
చెప్పేవారు ఎందరున్నా
వినేవారి కోసమే మన నిరీక్షణ
ఉచితమైన సలహాలకన్నా
ఖరీదైన సహాయమే మిన్న-
సహాయం అడిగితే సలహాలు రావొచ్చు
సలహాలు అడిగితే సహాయం రావొచ్చు
సహాయమైనా, సలహాలైనా వ్యక్తిత్వం నుంచే వస్తాయి
వ్యక్తిత్వాలన్నీ ఒకేలా ఉండవనేదే ఈ జీవిత సారం.🤘-
నీవు ఎవరికైనా సాయం చేయడంలో
విజయం సాధించినట్లైతే...
నీవు నీ జీవితంలో విజయం సాధించినట్టే...
-
నువ్వు చేస్తున్న సహాయం చూసి పదిమంది మారుతారు అనుకుంటే,
నీ సహాయం చిన్నదైన సరే పదిమందికి చూపించు..!!!-