ఎగిరెందుకు రేకల్లిచ్చిన, ఎలా ఎగరాలో,
ఎంత ఎత్తుకు ఎదగాలో అనేది
నీ పరిస్థితులే స్వయంకృషితో నేర్పిస్తాయి,
నిన్ను నీవు నమ్మితే, నీ రెక్కలే
నీ బలం అని తెలుస్తుంది.
స్వీయప్రయత్నాలు ఎప్పుడు ఓడిపోవు.-
మనసుకు ఆహ్లాదకరమైన స్పర్శ మీటినప్పుడే
బలమైన భావాలు ఉత్తేజమవుతాయి,
నీ భావాలు బలంగా ఉన్నప్పుడే,
నీలో ఆత్మస్థైర్యం నిండుకుంటుంది.-
నీ మనసులో నా గురించి
ఏదైతే అభిప్రాయం ఏర్పరచుకున్నావో
దానికి కారణం నేను అయితే కాదు,
ఎవరో చెప్పిన దాన్ని నమ్మి,
నువ్వే ఏదో అనేసుకొని,
ఒక అభిప్రాయాన్ని సృష్టించుకున్నావు,
నిజానికి నేను అలా ఏ మాత్రం కాదు,
నాతో ప్రయాణం చేయకుండానే
అలా అనేసుకొని నిర్ణయానికి
రావటం ఎంత వరకు సరైనది?-
ఒకరి మనుసులో చోటు కోసం
నిన్ను నీవు మార్చుకోకు,
నిన్ను నీలా ఇష్టపడే వారికి మాత్రమే
నీ మనుసులో చోటు ఇవ్వు,
అలాంటి జీవితాన్ని
ఓ బహుమానంగా స్వీకరించు.-
నీవు ప్రతిసారి
ఒంటరిగా
మిగిలిపోతున్నావంటే,
ఆ ఒంటరితనమే,
నీకు అలవాటు
పడింది అని అర్ధం.
మనశ్శాంతిని కోల్పోయే
అవకాశం ఒంటరితనంలో
ఉండదు, స్వేచ్ఛగా
ఉండిపోవచ్చు.-
ఇతరుల కంటే కూడా
నన్ను నమ్మి నాతో
నిజాయితీగా ఉన్నది
అంటే ,అది నాకు నేనే.-
పట్టుకున్న చెయ్యి పైన
ఉన్న నమ్మకం
దృఢంగా ఉన్నప్పుడు,
అంతులేని ఆనందం
సాధ్యపడుతుంది.
పడిపోతాను అనే భయం
ఏ మాత్రం ఉండదు.-
చిన్న వెలుగు చాలు
చుట్టూ చేరిన చీకటిని
తొలగించి దారి చూపటానికి,
ధైర్యంగా వెళ్ళు, నీ వెళ్ళే దిశ
అదే కనిపిస్తుంది.-
చెడు సమయం అసలు
రూపాలను చూపెడుతుంది.
అంతా మన మంచికే అనుకోని,
అలాంటి వారిని మర్చిపోవాలి.-