నువ్వు స్థాయిని పేరులోనూ,
ఆస్తిలోనూ లెక్కిస్తావేమో..!
నేను వ్యక్తిత్వంలోనూ,
సంస్కారంలోనూ లెక్కిస్తా...
అందులో
నేనెప్పుడూ పైనే...
నువ్వెప్పుడూ కిందే...
-
సంస్కారం లేని సన్నాసులు ఎంతమందో!
చదువు"కొంటున్న" కాలంలో,
సంస్కారం అమ్మే వాళ్ళు ఎంతమందో!!?-
నిట్టనిలువు అలలపైన,
నట్టనడుము కడలిలోన,
చిక్కుకున్న చిన్నిపడవ కోరేదేమిటి?
- చేరువైన ఓ దూరం;
వెలుగులీను ఓ తీరం....
ఆ నడిసంద్రపు పడవ రీతి,
అట్టడుగున, బాధలోన,
ఈ జీవిత గాధలోన,
చితికిన ఓ చిన్నిబ్రతుకు కోరేదేమిటి?
- మనసుకింత మమకారం;
మనిషిలోని సంస్కారం....-
ఎంత చదివామన్నది కాదు,
ఎంత సంస్కారం ఉందన్నది ముఖ్యం...
పేరుపక్కన డిగ్రీలు ఎన్ని ఉండి ఏం లాభం,
కనీస ఇంగిత జ్ఞానం లేనిది...
కానీ అందరికీ కావాల్సింది పైకి కనిపించే డిగ్రీలే,
లోపలి సంస్కారంతో పనిలేదు వీరికి...
కానిచ్చేద్దాం, ఇలాగే పేరు చివరన
తోకల్లా మాత్రమే మిగిలే డిగ్రీల్ని కొని
కానిచ్చేద్దాం...
సంస్కారం అక్కర్లేదు,
సంస్కరించే మనిషీ అక్కర్లేదు వీరికి...
వెన్నెల సతీష్...
-
సంస్కారం పుట్టుకతో రాదు
పెరుగుతున్న వాతావర్ణాన్నీ బట్టి వస్తుంది...-
మలి అడుగుల తాతతో
తొలి అడుగుల మనవడు
జీవితాన్ని ఆస్వాదించిన అనుభవం
జీవితంలోకి ప్రవేశిస్తున్న వయసు
ఏక కాలంలో వేసే ఘడియలు
స్వార్ధాన్ని వీడాలని
సమస్యలను అదిగమించాలని
అందరినీ ప్రేమించాలని
మలి అడుగులు తొలి అడుగులకు
నేర్పుతున్నట్టుంది..-
డబ్బు,ధనం,హోదా,..
సంపాదించ వచ్చేమో,..
కానీ సంస్కారం మాత్రము
సంపాదించలేము,..
వేల కోట్ల ఆస్తిపరులు
కూతురి పెళ్లిలో
కుటుంబ సభ్యులందరూ
వికలాంగులకు కొసరి కొసరి
మరీ వడ్డించిన తీరు అత్యధ్భుతం
అంబానీ దంపతుల సంస్కారానికి
ఇదే ఒక గొప్ప నిదర్శనం-
బురదలో పడిన వస్తువును శుభ్రం చేసి స్వీకరిస్తాం.
బంగారానికి వన్నె చేకూర్చేందుకు అగ్నిలో పుటం వేస్తం.
దీన్నే పారిభాషిక పదంలో "సంస్కారం" అంటాం.
మానవుని జీవితకాలంలో కొన్ని ముఖ్యమైన దశలలో 16 సంస్కారాలను ఆర్ష సంస్కృతి ప్రవేశపెట్టింది. అందులో మూడు సంస్కారాలు జీవి పుట్టక మునుపే మోదలవుతాయి.
1)గర్భాదానం 2)పుంసావనం 3)సీమంతం..
ఇవి అన్నీ కూడా వాస్తవానికి జీవిని సరి చేసేవి.
ఆ వరసలో జీవి పుట్టాక మొదటిది 4)జాతకర్మ.
చివరి సంస్కారమైన 16)అంత్యేష్టికి ముందుది 15) వివాహం.
మనం వివాహాన్ని గొప్పగా జరుపుకుంటాం. మిగతవి జరుపుకోం.. కొందరు కొన్ని చేస్తారు.
ఏం చేద్దాం అన్నింటికీ కాలం చెల్లింది. అవగాహన లోపించింది.
శుద్ది చేయని పాత్రలో పాలు పోస్తే పగిలిపోతాయి.
ప్రతి జీవీ పొందాల్సింది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కోరికలతో అశుభ్రమైన బుద్ది నిలుపుకోలేదు. బుద్ధి ని శుద్ది చేయాలి. శుద్ది చేసే ప్రక్రియే వివాహ సంస్కారం. పరమపద సోపానం అధిరోహించే క్రమంలో వివాహం నిచ్చెన.
ఇదే సనాతన ధర్మం. ఆర్ష సంస్కృతి వైభవం.
"స్వస్తి నో బృహస్పతిర్దధాతు"-