బాధల సంద్రాన ఉప్పొంగుతున్న సెలయేరులా
మనసు పొరలోంచే ఊరే ఉప్పు నీటి సరస్సులా
కార్చే ప్రతి బొట్టు నిరాశను నింపుకున్న నిలయంగా
ఆవేదనలనే అణువులన్నీ కలిసిన మంచు ముద్దలా
గుండెలోని రక్తమంతా ఉబికి వచ్చే లావా లాగా
కళ్ళల్లోంచి కారేనుగా కన్నీరు నేడిలా..
ఒక్కసారి వర్షం వస్తే బావుండు
తడిసి తడిసి ముద్దయ్యి తనివి తీర ఏడ్చేస్తా...
- వెంకీ ✍️
-
గుండెను దోచుకునే మంచితనం ఉండాలి"
కవితలు అల్లే అంత క... read more
సమయమయ్యిందని బెదిరిస్తూ
ఆకలేలను గుర్తుచేస్తూ
అలిసినారని తెలిపేస్తూ
చదువులమ్మ చెంతన గణ గణ మోగే
నేను మౌన వ్రతం పూర్తి చేసి
వెక్కిరించే గోడలను , మూసి వేసిన గేటును
చూసి చూసి విసుగుచేంది
ఒంటరిగా గడిపే నేను
నేడు
మూగ నోము త్యజిస్తూ
నిశ్శబ్దాన్ని చేధిస్తూ
బడి పిల్లల సంతసాన్ని
కళ్ళారా చూసేందుకు
భావి తరాల వారసులకు
నా శక్తి కొలది సేవ చేస్తూ
మళ్ళీ గణ గణ మోగలని
ఎదురుచూస్తూ ఉన్నాను..
- బడి గంట..-
పోయేదేముంది నవ్వుతూ బతికేద్దాం..
ఏమో ఆ నవ్వులే హృదయ తోటలో
పువ్వుల్లా వికసించి ఆహ్లాదాన్ని కలిగిస్తాయెమో!!!
వెంకీ✍️-
దాచుకున్న అందాన్ని తెలియకుండ దోచావు
మది నిండా జ్ఞాపకాలని పారెలా నింపావు.
ఆలోచించే ప్రతి క్షణాన్ని విలువెంతో తెలిపావు
మాట్లాడే ప్రతి మాటను ముత్యాల్లా పేర్చావు
హృదయంలోని రుదిరానికి ప్రేమను జత చేశావు
నిద్దురని మరిచేల జాగారాన్ని పెంచావు
ఎదురుచూపులకి విరహాన్ని జొడించావు
మధురమైన బంధాన్ని జీవితాంతం ఉండేలా
పట్టుకున్న వ్రేలు విడవకుండా చూడాలని
వేసిన ముడి ఏపుడు కదలకుండా కాపాడమని
నీ కోరుకునే నీ ఇష్టసఖినీ....
- వెంకీ ✍️-
ఓ"మని"షి !!
నీవు మళ్ళీ కనబడవని తెలిసి నీ కడచూపు కొరకు వచ్చే వాళ్ళ సంఖ్యే నీ మంచితనం కు నిదర్శనం..
అహంకార ధోరణితో అందరినీ దూరం చేసుకోకు..
ఆ నలుగురైన నిన్ను పంపేల చూసుకో..
వెంకీ✍️
-
జీవితమనే ఆటలో
దోబూచులాడే నేస్తాలు
ఒకరి విలువ
మరోకరు చెప్పకనే
చెప్పువారు..
వెంకీ✍️-
మనసు భాషలో మౌనం ఒక చిన్న పదం
ఎన్నో అర్థాలను తెలిపే ఒక పెద్ద గ్రంథం
వెంకీ ✍️-
మౌనానికి మించిన సమాధానం లేదు ఒక్కోసారి..
మౌనానికి మించని ప్రశ్నే లేదు ఒక్కోసారి..
వెంకీ✍️-
మౌనం ఒక అందమైన అబద్ధం
మనసు పోరల్లోంచి ఉబికివచ్చే
శబ్దాల ప్రవాహం
కానీ కనపడని వినపడని
అదొక నిశ్శబ్ద విప్లవం..
ఇది నిజం..
వెంకీ✍️-
మౌనంగా మౌనాన్ని పలకరిస్తే
మౌనమే ఒక్కోసారి మాయమయ్యే
మనసేమో మౌనగీతం ఆలపిస్తే
మౌనమే మంత్రముగ్ధులయ్యే
వెంకీ✍️-