చాటు మాటన
చేయి తడిపితే కానీ
కలము విదల్చని
బతుకు గీతలు
శ్రమ స్వేదాలనే
చమురోడే
పేదోని డొక్కలు
తాయిలం లెక్కలు
సుమనప్రణవ్
-
లంచం సమాజంపై దూసిన
రెండంచుల ఖడ్గం వంటిది
ఏ విధంగా నైనా సరే
నియమాలను పక్కకు నెట్టి
ఆరు నూరైనా లబ్ది పొందాలనుకొని
ఇవ్వచూపే వారు..
నియమ నిబంధనలు తుంగలో తొక్కి
తీసుకొనే వారు...
ఇరువురూ సమాజ హితానికి శత్రువులే....
చీడ పురుగులే....
సుమనప్రణవ్
-
మన అఖండ భారతంలో లంచమూ
మన అనుబంధాలలో అంతర్భాగమేమో
కొడుకు బర్త్ సర్టిఫికెట్ కి తండ్రి లంచమిచ్చి తన ప్రేమను చాటుకుంటే
ఆ తండ్రి డెత్ సర్టిఫికెట్ కి కొడుకు లంచమిచ్చి తిరిగి రుణం తీర్చుకుంటాడు-
లంచం !! పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా పీడించే
పెద్ద సమస్య లంచం!!
పుట్టిన దేహానికి లంచం, చచ్చిన శవానికి లంచం !!
వృద్దులని నిరూపించుకోవాలంటే లంచం !
నిరు పేదలకోసం ఇచ్చే రేషన్ లో మోసం !!
రహస్యంగా వీడియో చిత్రీకరించి
పోలీస్ లకు పట్టిస్తే.. అధికారం,రాజకీయం ఉపయోగించే
బడా బాబుల కుళ్ళు కుతంత్రాలు !!
రక్షక భటులే భక్షక భటులుగా మారి
తీసుకుంటున్నారు లంచం !!
చచ్చిన శవాన్ని దగ్గర పెట్టి బేరాలు ఆడి
తీసుకుంటున్నారు లంచం !!
ఇవన్నీ ఏంటని ప్రశ్నించే గొంతులు ఎన్నో ఎన్నెన్నో !!
వారి గొంతులు నులిమేయాలని చేసేను కుతంత్రాలెన్నో ఎన్నెన్నో !!
పేదవారికి ప్రభుత్వం చేసే సహాయ పథకాలకు
అడ్డంకులు ఎన్నో ఎన్నెన్నో !!
బడా బాబులకు అడ్డే లేని నియమ నిబంధనలు
పేదవారికి ఎందుకు అడ్డొస్తున్నాయి ??
రేషన్ కార్డ్ ఉండదు, కాటికి కాళ్ళు చాచే
అవ్వలకు పెన్షన్ లే ఉండవు.. !!
డబ్బే పాలిస్తోంది, అదే శాసిస్తోంది !!
రాజకీయ చరిత్ర సృష్టిస్తోంది.. !!
ఇంతేనా?? ఎప్పుడు మారతారు జనం??
ఎప్పుడు బాగుపడుతుంది సమాజం??
లంచగొండులను శిక్షించలేరా??
అధికారాలతో బయటకు వచ్చే ప్రయత్నం ఆపేయలేరా??
నీతి నిజాయితీగా ఈ సమాజం ఉండేదెప్పుడు??
అందరు ఆనందంగా బ్రతికేది ఎప్పుడు??-
తను నిర్వహించే
బాధ్యతాయుత కర్తవ్యానికి
వేతనం పొందుతూ
అదనపు సొమ్ము(లంచం)
వాంఛించడం
మరణ సాదృశ్యమే-
ఆ బిచ్చగాళ్లకు నేర్పించేది ప్రజలే
అందరిని బిచ్చగాళ్లను చేస్తున్న పాలకులు మాత్రం ఎవరి కంటికి కనబడటం లేదు-
ఎందుకో నాకు బిచ్చగాళ్ళంటే ప్రభుత్వ ఉద్యోగులే కనిపిస్తున్నారు ..!!
నిశ్శబ్ద కవిత
Kalimulla
*లంచంతీసుకునేవాళ్ళు-