ఆనవాయితీ వృత్తిని వదిలేసినందుకు
దేవాలయంలో ప్రవేశించినందుకు
పరమతంలో ప్రవేశించినందుకు
ఎక్కువ కులం వారిని పెళ్లి చేసుకున్నందుకు
సామూహిక బహిష్కరణలు , వెలివేతలు , పరువు హత్యలు
బ్రతికినన్నాలు బానిసలా బ్రతకాలి
చచ్చిన వారికి డప్పు వాయించాలి
కాళ్లకు చెప్పులు కుట్టాలి
ఆ కాళ్ళ కింద చెప్పులా పడుండాలి
దళితులంటే దరిద్రులు గానే జీవించాలా????
మతాల గురించి మాట్లాడే వారికి కులం కంపు కనపడదెందుకో ????
అనాది కాలం నుండి ఆధునిక యుగం వరకు కులవివక్షనే
కుల వివక్ష మాసిపోలేదు రంగులు మార్చుకుంది అంతే
మనిషిని మనిషిలా కాకుండా
మానవత్వం లేకుండా
కులంతో గుర్తింపునిచ్చి , రాతలు రాసి , జీవితాలు కాలరాసిందెవరో ????
కులపు సంకెళ్లను తొడిగింది ఎవరో ??????????
✍️ Reflective writings-
కవి ఆయుధం కలం
విద్యావంతుడి ఆయుధం అక్షరం
ప్రతిఒక్క సామాన్యుడి ఆయుధం వోటు
సరిగ్గా వాడకపోతే మూల్యం నీ ఒక్కడిది కాదు..
గుర్తుపెట్టుకో... సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకో....
-
కనుల వెంట కలలు
కలల వెంట అలలాంటి నా పరుగు
కన్న కలలు కన్నీళ్ళలా రాలిపోకుండా
ప్లాస్టిక్ లా ఇంకిపోకుండా
మంచులా కరిగిపోకుండా
కాలంలో కలిసిపోకుండా
ఎదుటే ఉంటూ, ఎదలో ఉంటూ ఏడిపిస్తాయి, ఎదిగేలా చేస్తాయి
అందుకే గెలుపును గెలుచుకునేవరకు ఈ పరుగు ఆగదు
-
కనుల వెంట కల
కల వెంట అలలా నా పరుగు
పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావా లేక
ఓటమితో పోటీ పడలేక ఓడిపోయానా??
కలలన్నీ కల్లగా మిగిలిన కన్నీళ్లుగా రాలిపోయాయా??
కాలంతోపాటు కరిగిపోయాయా??
-
ప్రపంచం పోటా పోటీగా పరిగెడుతుంది
నేను మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నా
పరిగెత్త లేక కాదు పరిగెత్తాలి అని లేక-
why many people are more interested in others lives
than living their own lives-
ఓటమికి ఓపిక ఎక్కువ
గెలిచేంతవరకు, తనను హత్తుకునేంతవరకు పోరాడుతూనే ఉంటుంది
-