QUOTES ON #పల్లెటూరు

#పల్లెటూరు quotes

Trending | Latest
4 MAY 2018 AT 11:34

"మాది పల్లెటూరు అండి ఆయ్ ''అని మొదలెట్టి మనోళ్లు చాలా రాసేస్తున్నారు . కానీ మాది గటు పల్లె గాదు,గిటు పట్నం గాదు. గీ యాస నాకసలే రాదు.అయిన సరే రాద్దామని మొదలెట్టిన మా నల్గొండ యాసల.
ఓసారి సెలవులకని మా మేనత్త ఊరికి పోయినం. గా పల్లెటూరోళ్ల మాటలకు రాగాలెక్కువ ,అనురాగాలూ ఎక్కువే ..
ప్రతోడు పలుకరిస్తడు,బాగోగులు అడుగుతడు..తీరొక్క కులమైనా అందరు ఒక్కింటోళ్ల లెక్కనే కలిసుంటరు....

వరిచేళ్లు, పిట్టగూళ్ళు, వాగు నీళ్ళలో ఆడిన ఆటలు,...
కొత్త దోస్తులు ,కొంటె చేష్టలు ,వలేసి పట్టిన చేప పిల్లలు,...
ఈతపళ్ళు , తాటిముంజలు ,సందేళ తాగిన తీయని కల్లు ....
వాళ్ళ యాసకు నవ్వుకున్న చాటుమాటు నవ్వులు,
నా యాసకు గేలి చేసారని నే రాల్చిన కన్నీళ్లు ...
అంతలోనే మామ కొనిచ్చిన రంగురంగుల పుల్లైసులు..
అత్త చేసి పెట్టిన కమ్మని గుంట పొంగణాలు ....
ఆరోతరగతి సెలవుల్లోని ఈ జ్ఞాపకాలు ...
పల్లెటూరు పై పెంచెనెన్నో మమకారాలు ...

గిట్ల జెప్పుకుంట బోతే శానా ఉన్నయ్...
నా వరకైతే భూలోక స్వర్గాలు పల్లెటూళ్ళు ....

Sandhya. Ch




-


21 DEC 2018 AT 21:03

పల్లెటూళ్లు దేశానికి పట్టుకొమ్మలంటూ ఒక ముసలాయన కళ్లజోడూ, చేతికర్రతో వెతుకుతున్నాడు..
పట్టణాలు పొట్టనబెట్టుకున్నాయి అని చెప్పా... మరోసారి హే రామ్ అన్నాడు..

-


7 MAY 2019 AT 0:29

నా పల్లె అందాలు..
విరిసిన మల్లె గంధాలు..!
నా ఊరి హొయలు..
అవి సంగీత లయలు..!

పచ్చచేనుల పైటకొంగులు..
వెచ్చచెరువుల ప్రక్కకొంగలు..
పిల్లగాలుల పిలుపులు..
తల్లిఏరుల పరుగులు..

మాటతప్పని మనసులు..
మనసుతిప్పని మనుషులు..
చక్కని మానుష చిక్కని ప్రేమలు..
చిక్కని ప్రేమల చెక్కిన మనుజులు..

నిండగు చెట్లు..
నింగికి మెట్లు..
కలువల చెరువులు..
కల్పతరువులు..

ఇది కాదా..
నా పల్లెటూరు..!
ఇది కాదా..
నే నడిచేతీరు..!!

-


3 MAY 2018 AT 19:36

మాది పల్లెటూరు అండీ ఆయ్..
ఎంటట్ట చుత్తన్నారు, రండి చూపిత్త మా ఊరు !!
మాట కొంచెం మోటు కానీ మా మనసు ఎన్నపూస..
మనుషులం మొరటుగుంటం కానీ మోసం సెయ్యం.
పాతబట్టలు కడతాం కానీ కొత్తవాళ్ళకి హానీ చెయ్యం..
ఉన్నంతలో తృప్తిగా వుంటం కానీ ఉట్టికి ఎగరం..
పచ్చడి మెతుకులు తింటం కానీ పక్కనొడిది కాజేయ్యం..
నిజమే మా బలం, ఆప్యాయత ప్రేమే మా బలహీనత..
నమ్మినొడికి ప్రాణం ఇస్తాం, ఆదరిస్తే అక్కున చేరుస్తం..
అలాగని,
మమ్మలిని చులకనగా చూస్తే మాత్రం తుప్పు వదిలిస్తం..!

-


6 MAY 2019 AT 10:22

అనురాగపు జల్లులు కురిసే వాకిళ్ళు
ఆప్యాయత వర్షించే లోగిల్లు
ప్రేమతో పిలిచే పలకరింపులు
చుట్టరికంలేని అనుబంధాలు
ఇవన్నీ పల్లెటూర్లకే చెల్లు

-


19 APR 2020 AT 9:12

సమస్యాపూరణం 42
శివయోగి sir
Anamika Sonu
Harish Thati
విజేతలుగా ప్రకటిస్తున్నా

-


3 MAY 2018 AT 22:32

మా ఊరు ఒక అందమైన పల్లెటూరు
స్వాగతం పలుకుతుంది పచ్చని వరిపైరు
ప్రేమానుబంధాలకు ఇది మారుపేరు
వేదశాస్త్రజ్ఞులకు పెట్టింది పేరు
కనువిందు చేస్తుంది కాలువల హోరు
మురిపెంగా ఉంటుంది మా ఆత్మీయ తీరు
ఒకసారి వస్తే మళ్ళీ రావాలని ఎవరు కోరుకోరు??

-


3 MAY 2018 AT 22:56

" మాది పల్లెటూరు అండి ఆయ్ " అనే వాక్యంతో రాత రాయమని నాకు ఇష్టమైన వై.క్యు మాష్టారుగా మీరు ఆజ్ఞ చేసిండ్రు. నాకేమో గా యాస మొత్తంగా రాదాయె. అందుకే నాకొచ్చిన తెలంగాణ యాసలో రాస్తున్న సార్. జర గుస్సా కాకుండ్రి. మా ఊరు అంటే నాకు మస్తు పాణం. మా ఊరు పేరు యాదికి రాగానే చిన్నపుడు ఆడిన గోటీలాట, గిల్లి పన్న, ఓమన గుంతలాట, కైలాసపటం, చెరువులకి పొయ్యి ఈతకొట్టుడు, చింత చెట్టుకి ఊయలూగుడు గిసొంటి మస్తు ఆటపాటలు గుర్తుకొస్తయ్. కష్టాన్ని నమ్మినోళ్లం సార్, కాబట్టి పొద్దుగల్ల లేస్తూనే ఊరు ఊరంతా చేన్ల పోడితి పని జెయ్యనీకె పొయ్యెటోల్లం. పొద్దుమూకి అందరూ అరుగుల మీద కూసొని ముచ్చట్లు పెట్టేటోల్లు. ఇగ దసర పండగపుడు, పీర్ల పండుగలకి అలయ్ బలయ్ తో ప్రేమను పంచుకునేటోల్లం. కులం, మతంతో సంబంధం లేకుండా, ఊరందరినీ మామ, కాక, అత్త, అవ్వ , చాచా, తాత అంటూ పలికే వరసలే మమ్మల్ని కలిపి ఉంచేట్వి. ఇగ ఎవ్వరింట్ల లగ్గమయ్యినా తలా ఇంత సాయం చేసుకొని మా ఇంట్ల పెండ్లిలాగ మురిషెటోళ్లం. ఎవ్వరింట్లనైన దీపమారిపోతే ఆ బాధంతా ఊరు మోశేది. ఇంక చెప్పనీకె మస్తు ఉన్నాయి గానీ మా ఊరు ముచ్చట్లు, ఈడ జాగ సరిపోతలే. మల్లెప్పడైనా రాస్తా. ఇట్లా రాశినందుకు బేజారు కాకుండ్రి సార్. ఊరు కదా ఊరి భాషలోనే రాయాలనిపించింది. వేరేలాగ అనుకోకుండ్రి. ఇగ ఉంటా సార్.😇🙏
ప్రేమతో మీ

-


17 JUN 2020 AT 22:20

అదగదిగో మా పల్లెటూరు
అందాలకు పెట్టింది పేరు
మమతను పంచు మాట తీరు
మనషులెల్ల మహా కుదురు..!!

-


3 MAY 2018 AT 20:34

మాది పల్లెటూరు అండీ ఆయ్...
కన్నీళ్ళు దాసేసుకుంటాం.. నవ్వులు పూయితుంటాం..
సిన్న ఇళ్ళలో ఉంటాం.. పేద్ద మనసులతో బతుకుతుంటాం..
గౌరవం మా ఇంటి పేరులెండి.. మాటకు ముందో అండి మాటకు వెనకో అండీ మాకో ఊత పదం అంటే నమ్మండి..
దూరాలు పోయినప్పుడు మీరు నమ్మరు మా ఊరు పేరు వింటే ఆహా ఏం ఆనందం అండి బాబు..

-