రక్తమోడినది భూతల స్వర్గం కాశ్మీరం
స్థాణువై నిలిచిపోయే ఆ హిమ సమీరం
చెరిగినది కలికి భారతికున్న సింధూరం
రగిలింది జాతికి మహోజ్వల ప్రతీకారం
గర్జించే సింహనాదమైంది వందేమాతరం
ఉగ్రరాజ్యంపై ఎక్కుపెట్టే సాయుధాస్త్రం
దాయాది గుండెల్లో రేపే కలవరం..!!
-
చదివినది బి.ఏ దూర విద్యా ఆంధ్ర విశ్వకళా పరిషత్, రాజమహేంద్రవరం. తెలుగు భాష పై మక్... read more
చెదరనిది దేశ రక్షణ రంగ ధైర్యం శత్రువుని చణికింది సైనిక రౌద్రం
ఉగ్ర స్థావరమైంది భస్మీపటలం భాసించే భారతి క్రాంతి సింధూరం
చల్లారాదిపుడే ఉగ్రనేత్రం! ఆరంభమిది! దాయాదికిది గుణపాఠం!!-
ఒత్తయిన గింగిరాల్లాంటి ఆ నీలి కురులు
హృదిలోన మత్తెక్కించే మోహపు మరులు
తాకుతూ నునుపాటి భారపు కుచపు గిరులు
కురియగ సుధా శృంగార రసమయ ఝరులు
జంట మిధునాల విరుపుల్లో పొంగు ఆవిరులు
కలికి దీప కళిక దరి చేరగా కరిగే కటి ఇరులు..!!-
రామ నామం పలుకుతూ త్యాగరాజు
సామ గానం పలుకుతూ త్యాగరాజు
హృదిని భవ్య ధామముగా మలుచుతూ
మృదుల భావం తెలుపుతూ త్యాగరాజు
శ్రుతిలయల గమకాలతో శ్రావ్యంగ
కృతిని మధురం చిలుకుతు రాగరాజు
సరిగమల స్వరాలే ఆలాపనగా
సౌఖ్యములే సలుపుతూ భోగరాజు
భక్తిజ్ఞాన వైరాగ్యాలే ముక్తియనీ
మోహాలన్ని విరుపుతూ యోగరాజు..!!-
చెప్పింది వేద శాస్త్ర ధర్మం
చూపింది భక్తి ముక్తి మార్గం
ఏకమేవ ద్వితీయం బ్రహ్మంటు అద్వైతం
నలుదిశలా నిలిపెను ధర్మ పీఠం
నిత్యం కోరే శాంతి కాముకం
సనాతన రక్షణకై రణము సలిపే ఆదిశంకరం..!!-
రగులుతూ మతోన్మాదం
రక్కసి మూకల పైశాచికత్వం
రుధిర ధారతో తడిసింది పసిమి
భూతలం స్తంభించింది ప్రజా జీవనం
మారణ హోమానికి స్థావరమైంది శీతల
కాశ్మీరం హతాశురాలై నిలిచింది భారతం
ఎక్కడున్నది స్వేచ్ఛా సమానత్వం
మరుగున పడిపోయింది మానవత్వం
పెచ్చుమీరుతోంది సీమాంతర ఉగ్రవాదం
నవజంట వేడుకున్న కరగలేదు
ఆ పాషాణ హృదయం ఉగ్రమూకలకు
పాడాలి చరమగీతం భారత శిక్షాస్మృతితో
తప్పక రాయాలిక మరణ శాసనం-
సత్యం సత్త్వతను సంతరించుకుంటుంది
అసత్యం విశ్వసనీయతను నీరుగారుస్తుంది..!!-
విరామమే ఎరుగని నిశ్చల సేవానిరతి
అజరామరం చెదరని ఆ స్వామిపై భక్తి
శ్రీ రామ కార్యమే కొలువుగా బంటు రీతి
సీతా వియోగ నిర్మూలనం మారుతి ధృతి
ఆ సంకల్ప బలమే నిత్యచైతన్య స్ఫూర్తి
గుండెలోన నిలిపెను సీతారామమూర్తి
రామ సహవాసమే అనిలాత్మజునకు ఆస్తి
అభిరామ పదసేవనమే పెంచే యశః కీర్తి
రాముని జపమే తనకి శక్తియుత సంపత్తి
మనమున తలచిన చాలద తొలగు భీతి
రామ చరితమే విన్న కలగదా సంప్రీతి
శ్రీ రామగానమే హనుమకు ప్రియశ్రుతి..!!
-
ఆ రఘుకుల తిలకుని సుస్మిత వదనం
చూసిన కలుగును హృదికి ప్రమోదం
నిత్య శ్రీ రామ నామ స్మరణ సంకీర్తనం
నడిపించు జీవగతిని భవ్యమగు సుపథం
షోడశ కళానిధికి జరుగు మహా వైభవం
లోకోపకారానికై జరిగే సీతారామ కళ్యాణం
ధర్మ నిరతిని కలిగి నడిచిన ప్రతి జీవికి
కాదా సుజన పరిపాల శ్రీ రామరాజ్యం
కలహాలతో కాకుండా ప్రణయ విరహాలతో
మెలిగిన చాలు ప్రతి జోడి బాపూరమణీయం..!!-
విశ్వావసు నామ వత్సరం
సత్సంకల్పాలకిది శ్రీకారం
సత్ఫలితాలకిది ఆకారం
ఆరంభ సూచనే మహత్తరం
ఆనంద యోగాలకు అంకురం
విఘాతిని తొలగించు తక్షణం
సకల సౌభాగ్యాలిచ్చు ప్రతిక్షణం
విశ్వానికి కలిగించు శ్రీకర శుభకరం
అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..!!-