కనుల మాటున కన్నీరు దాచి..
కలలు అన్నీ కాలంతో పాటు సమాధి చేస్తూ..
సొంత వారి కోసం సంతోషాలు త్యాగం చేస్తూ..
ఉద్యోగం పురుష లక్షణం అని..
జీతం కోసం జీవితాన్ని బలిచేస్తూ..
అప్పులు, EMI, Bills ,loans, expectations
మధ్య బరువు బాధ్యతలు మోసే ప్రతి మొనగాడికి
అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు..-
అమ్మ నవమాసాలు కడుపున పెట్టుకొని మోస్తే..
నాన్న పాతికేళ్లు భుజానికెత్తుకొని మోస్తాడు..!
ఎదుగుతున్న మనతో పాటు..
పెరుగుతున్న ఆప్పులు..
తరుగుతున్న ఆస్తులు..అయినా..!
లక్షలు పోగేసి ఫీజులు కడతాడు..
ఆస్తులు అమ్మి అయినా ఆడపిల్ల పెళ్లి చేస్తాడు..
వయస్సు పెరిగే కొద్దీ.
బాధ్యత గుర్తు చేసే తండ్రికి.
బలాదూర్ తిరిగే కొడుకుకు..
వైరం లేని దూరం పెరుగుతుంది..
రెక్కలోచిన కొడుకులు దిక్కులకేగి పోతే..!
ఊతకర్ర సహాయంతో..
మన వెన్నంటే వుండి వంగిపోయిన వెన్నెముకతో..
ఆసరాగా వుండి అరిగిపొయిన కీళ్లతో..
పోలం పనులు చేసి పగిలిన కాళ్లతో..
అవసరాలు తీర్చి అలసిపోయిన దేహంతో..
చేతకాక చావుకు చేరువలో వున్న కూడా .
చివరి వరకు మన గురించే ఆలోచించే చాదస్తాపు మనిషికీ ...
నా పాదాభివందనం..-
నిరుద్యోగిని..
సూర్యుడు సైతం దూరని గదిలో
కొత్త వెలుగుకై పోరాటం..
పుస్తకాలను మస్తకంలోకి ఎక్కించడానికి..
ఇన్స్టిట్యూట్, లైబ్రరీ, స్టడీ హల్ చుట్టూ
తిరిగి అరిగిన చెప్పులు..
కరిగిన కాలం..కాలే కడుపులు..
కన్నవారి కలలు మధ్య..
వెలువడని నోటిఫికేషన్లు
పెరుగుతున్న పొటితత్వంలో..
ఒక్క అడుగు ఒక్క మార్కు దూరంలో
ఎన్నోసార్లు గెలుపు నుంచి దూరంగా
విసిరివేయబడిన...!!
కోరిక చావక.. ఆశ తీరక పోరాడుతున్న
ఓ గెలుపెరగనని నిరుద్యోగిని..-
అందని ఆకాశంలో..
నీకై ఉరుములు, మెరుపులు దాటి..!
అలసిపోయిన ఊహలరెక్కలు..
నీ కపటిప్రేమ పిడుగుదాటికి తెగిపడి..
నా కన్నీటి తుఫానులో
కొట్టుకుపోయాయి..-
హర హర మహదేవ శంభో శంకర...
సూర్యచంద్ర,అగ్నిహోత్ర నేత్రధార త్రీనేత్ర..
అదియు, ఆంతము లేని ఆదిశంకరా.
రూప అరూప శరూప రుద్రేశ్వరా...
జటాజుటమున గంగను బంధించిన గంగాధరా..
సతికి సగభాగమునొసగిన అర్థనారీశ్వరా..
హలహలంను కఠమున గల నీలకంఠుడా..
సత్య,తమో,రజో గుణ అధిగమణ త్రిశూలధారా..
ధర్మస్థాపన ధ్యేయ నందివాహానా...-
ఎల్లలుగా చీలిన పుడమి మధ్యలో
ఆధిపత్యం కోసం మారణహోమం..
ఆయువు తీసే ఆయుధంతో..
పగల సైగలు కక్కె ఫిరంగులతో..
ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన సైనికుని..
వీరమరణం సృష్టించిందీ వినాశనమే..
మారుభూమిలో ఎటుచూసినా..
విధ్వంసపు వినాశనమే..
విద్వేషపు విలయతాండవమే..
కదలలేని కళేబరాల కోసం..
కాచుకున్నా రాబందులు..
తెగిపడిన శరీరావయవాలు..
తెగిపోయిన బంధాలు..
ఈ వినాశనపూరిత విజయం తరువాత అయినా
యుద్ధం అంతం కావాలని కాంక్షిస్తూ..-
పల్లెటూళ్లు దేశానికి పట్టుకొమ్మలంటూ ఒక ముసలాయన కళ్లజోడూ, చేతికర్రతో వెతుకుతున్నాడు..
పట్టణాలు పొట్టనబెట్టుకున్నాయి అని చెప్పా... మరోసారి హే రామ్ అన్నాడు..-
అలసిన మనసు
తెల్లవారని రేయితో తగువుపడి నిరీక్షించే అనుదినం..
కాలం గతం జ్ఞాపకాలను కప్పిపుచ్చుతుంటే..
మనసు అవి మానని గాయలు అని మభ్యపెడుతుంది..
గతం,వర్తమానంతో పని లేని ఉహాలు
నువ్వువస్తావని ఊపిరిపోస్తున్నాయి..
కనుల కంచె దాటి కురిసే వానలో..
శిలనై..
శిథిలమై..
ఎదురుచూస్తున్నా...-
గళమెత్తనీ జనం కోసం ఎలుగెత్తి..
బానిస సంకెళ్ళతో..
అంధకారంలో అలమటిస్తున్న వారికై..
ఆయువు పోసే చేతులతో అయుధం..
పట్టినా ఓ ఆగ్రహతేజం...!
భయం ఎరుగని కనులతో..
విప్లవరూధీరం నిండిన నరాలతో..
బిగించిన ఓ ఉక్కుపిడికిలి..!
సమసమాజమే ధ్యేయంగా
సామ్రాజ్యవాదులపై సమరం
సాగించిన ఓ గొరిల్లా యోధుడు..!
ఆధికారాలు అన్ని త్యజించి
అభాగ్యుల ఆఖరి అశ్రువు సైతం
తుడవాలనే తలంపుతో ఆస్తమించిన ఓ ధ్రువతార..
ఏ వర్గానికో,ఏ ప్రాంతానికో
పరిమితం కాని పోరాటపటిమ..
ప్రపంచ విప్లవ చరిత్రలో
చెక్కుచెదరని ఓ విప్లవ సంతకం..
మరణం దేహంకే కానీ అలోచన కాదని..
ఏ విప్లవానికైనా ఉత్తేజపు ఊపిరిపోసే..
20వ శతాబ్దపు విప్లవసూర్యుడు..-
విధాత తలపున ప్రభవించిన అక్షరకుసుమం..
ఆర్థశతాబ్ధపు అజ్ఞానాన్ని నిగ్గదిసి అడిగే ఆక్రోశం..
యుగాలన్ని సాగినా ...!!
జరుగుతున్న జగన్నాటకామని భగవత లీలను
నిత్య జీవన సత్యాలుగా వర్ణించిన ఓ ధర్మజ్ఞాని..
నిదురపోతున జగమంత కుటుంబాన్ని
ఛలోరే ఛలోరే చల్ అని లేపి..
చేసేదేదో చెయ్యమని..
సత్యం ఏమిటో..
చివరకు మిగిలేది ఏమిటో..
శోధించి,సాధించమని..
ఏవరు రాయగలరు...? మీరు తప్ప..!!
అక్షరకిరణాలు జగమంత కుటుంబాలకు
పంచుతున్న మీకు దండలయ్యా...-