పాల కడలి అలల నురుగు నా తెలుగు
జాబిలి కెరటాల వెలుగు నా తెలుగు
అవనియందు భాషలెన్ని ఉన్నకాని
మిరుమిట్లను గొలుపు జిలుగు నా తెలుగు
పరభాషల మోజులోన అలసిపోతె
సేదదీర్చు ఇంటి అరుగు నా తెలుగు
అమ్మచేతి స్పర్శ తగిలి తోడుకున్న
ఆవుపాల గడ్డ పెరుగు నా తెలుగు
అవరోధాలన్ని దాటి సాగుతోన్న
రవి చేతిన కలం పరుగు నా తెలుగు
-
అచ్చులతో అనుబంధాన్ని
హల్లులతో హాయిని
గుణింతాలతో గుణగణాలను పంచిన
మృదుమధుర భాష
ఏకాక్షరమైన ద్విత్వాక్షరమైన
పదమైన వాక్యమైన
కవనమైన పద్యమైన
భావలహరి కురిపించు
తేనెలూరు భాష
తేట తెలుగు భాష-
గజాలా గారూ..మీకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు..!!
ఓహ్..thankyou and wish you the same..
(అమ్మా...ఇప్పుడెందుకు పీకారో తెల్సుకోవచ్చా)
నేను చెప్పినదానికి మీరు కనీసం ఈ ఒక్క రోజైనా తెలుగులోనే కదా సమాధానం ఇవ్వాలి..??-
తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్లనృపులు గొల్వ యెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స
(శ్రీకృష్ణ దేవరాయలు)-
తేనెలొలికే తెలుగు మాది,
మిణుగురులాడే వెలుగు మాది.
మధురాలోలికే భావాలు మావి,
మనస్సుమెచ్చే అనురాగాలు మావి.
ఆప్యాయతల పుట్టినిల్లు మాది,
అనుబంధాల పొదరిల్లు మాది.
తేనెలొలికే తెలుగు మాది,
మిణుగురులాడే వెలుగు మాది.-
గురువు అన్నా
తెలుగు భాష అన్నా
నాకు అమితమైన ప్రేమ...గౌరవం
అందుకేనేమో...
నా కూతురు గురు పూర్ణిమ రోజు పుడితే
నా కొడుకు తెలుగు భాషా దినోత్సవం రోజున
పుట్టాడు...
నా పిల్లలంటే ఎంత మురిపెమో
నా తెలుగు అంటే కూడా నాకు అంతే మురిపెం..
నా భాష సౌందర్యానికి నేను ముగ్ధురాలిని అవుతాను...
నా తెలుగు సాహిత్యానికి నేను పరవశించిపోతాను..
అచ్చం నా రోహన్ మాటలకు మైమరచినట్టు..
రోజూ చూస్తున్నా వాడిని
ఎప్పటికప్పుడు కొత్త సాహిత్యాన్ని చదువుతున్నట్టు ఉంటుంది...
హాయి గొలిపే తన మాటలు
సుప్రసిద్ధ తెలుగు కవుల కవనాలలో మెటాఫర్లలా
అనిపిస్తాయి...
ఒక్కోసారి తన అల్లరి చూస్తే వచ్చే కోపం
తెలుగును కూనీ చేస్తూ అరకొరక భాషా జ్ఞానంతో
మాట్లాడేవారిపై వచ్చే కోపంలా ఉంటుంది..
పుత్రోత్సాహం కూడా అచ్చంగా
తెలుగు రచయితలు ,కవులను చూసినప్పుడు ,
నా భాష యొక్క కళా వైభవాన్ని తలుచుకుంటే నాలో ఉప్పొంగే గర్వంలా ఉంటుంది...
నా ముద్దుల కొడుక్కి
నా మాతృభాషకు నూరేళ్ళ ఆయుష్షు ప్రసాదించమని ఆ పరమాత్మను ప్రార్ధిస్తూ...
"జన్మదిన శుభాకాంక్షలు రోహన్ బంగారం💐💐"
"తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ...💐💐"
-
తెలుగు సాహిత్యం చదువుతూ
తెలుగు సంగీతం వింటూ
తెలుగు మాట్లాడే వారందరికీ
తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు💐-
తెలుగై తరలివచ్చెనురా/తెలియని వైనం
తెలుగై పరిమళించెనురా/తెలిసిన భావం
తెలుగై ఉద్భవించెనురా/తరముల కావ్యం
తెలుగై వెలుగునిచ్చునురా/తడిసిన నయనం-