Sravan kumar   (@sravan)
42 Followers · 11 Following

Masters in Economics 👨🏻‍🎓
Osmania University, Hyd.
Joined 24 September 2019


Masters in Economics 👨🏻‍🎓
Osmania University, Hyd.
Joined 24 September 2019
9 APR 2022 AT 16:25

నీ వలపుల జడివానలో
నా దేహము తడిసింది
నీ పెదవుల తాకిడితో
నా హృదయం మురిసింది
ఈ తమకపు ఘడియలలో
నా ఊపిరి నీలో కలిసింది..!!

-


21 MAR 2020 AT 13:22

నా ప్రేమ తాలూకు జ్ఞాపకాల్ని
కన్నీటి సిరాతో
కాగితం పై అంటించా...
పోయెట్రీ అందువో...
పోయే కాలం అందువో..!!

-


8 AUG 2021 AT 12:29

ఈ మౌనానికి కారణం
నీ మనసు కౌగిట్లో
నా మాటలు బంధికావడమే..!!

-


4 AUG 2021 AT 17:50

కదిలించిన ప్రతి దృశ్యం
అక్షరరూపంగా కాగితాల్లోకి
చేరాల్సిందేనా..!!

-


14 JUL 2021 AT 20:21

నీ జ్ఞాపకాలను మోస్తూ
నా మనసుని నిందిస్తూ
ముందుకు సాగుతున్న
విరహ గాలుల్ని వెనక్కి తోస్తూ...

-


12 JUN 2021 AT 23:59

మది నీ ఊసులనే నెమరేస్తుంది...
నీ ఊపిరి చప్పుడు కూడా నన్నొదలనటోంది..
నీ జ్ఞాపకాల గంటలు నాలో
మార్మోగుతూనే ఉన్నాయి..
వింటున్నావా ...
మది గోడల్లో ఏ మూల దాక్కున్నావో...!!

-


11 JUN 2021 AT 19:35

ఆశకు-ఆశయానికి
లక్ష్యానికి-కాలానికి
కాలే కడుపుకి-రేగే ఆలోచనకి
నిత్యం సంఘర్షణే

-


11 JUN 2021 AT 19:17

మనసే కదలనంటోంది
నీ జ్ఞాపకాలను వీడనంటోంది.!!

-


6 JUN 2021 AT 22:18

బతుకే
కదలనంటోంది..!!

-


5 JUN 2021 AT 23:32

ఏదో వెలితితో విలవిలలాడుతూంటుంది...
నా ఊపిరి లో దాగిన నీ జ్ఞాపకాలలో
తేలుతూంటుంది..!!

-


Fetching Sravan kumar Quotes