అది సహజత్వాన్ని సంతరించుకున్నప్పుడు....
-
అన్ని రోజులూ ఒకేలా ఉండకపోవచ్చు
కానీ ఒకేలా లేని రోజుల్లో కూడా
ఎప్పటిలా ఉండగలగడమే ప్రేమ...
నిజానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడే
బంధం ఆసరా అవ్వాలి...
అలా కాని బంధం వ్యామోహాల లెక్కలోకి పోతుందే కానీ
బంధాల లెక్కలోకి రాలేదు...-
మన ప్రపంచం ఎప్పుడూ చిన్నగా ఉంటేనే
మనకు ప్రశాంతంగా ఉంటుంది
ఎప్పుడైతే మన ప్రపంచం విశాలంగా మార్చుకుంటామో
అప్పుడే అన్ని సమస్యలనీ మనం ఎదుర్కోవల్సి వస్తుంది
ముఖ్యంగా మనల్ని మనం నిరాశల నుండి
నమ్మక ద్రోహాల నుండీ
మోసపూరిత మాటల నుండీ
కాపాడుకోవలసి వస్తుంది.
జాగ్రత్త ... పరిధి దాటి విస్తరించాలని
అనుకుంటే సిద్ధంగా ఉండండి
జీవిత గుణ పాఠాలు నేర్వడానికి....
-
ఇష్టమైన వాళ్లకు చెప్పే
మన భావాలు
చాలా సార్లు వ్యర్థ ప్రసంగాలు లా
మిగిలిపోతాయి...
వ్యర్థ ప్రసంగాలు ఏ ఒక్క మెదడును
కదిలించలేనట్టే
మన భావాలు కూడా ఎదుటి వారిని
చలింపచేయవు...
ఇవన్నీ వదిలేద్దాం అనుకున్నప్పుడే
లోపల నుండి మరో కొత్త భావన పుడుతుంది
ఈ మార్గం సరైనది కాదేమో
మరో మార్గం లో చెప్పాల్సిందేమో
అప్పుడైనా అర్ధం అవునేమో అంటుంది...
ఈ మనసు మారదు...
భావాలు నిలిచిపోవు...
ప్రేమ ముందు పౌరుషం ఓడిపోతూనే ఉంటుంది...
-
ప్రేమకు గొప్ప బహుమతి ఎప్పుడు దొరుకుతుంది తెలుసా..?
అవతలి వ్యక్తి
ఆ ప్రేమను గుర్తించి , ఆస్వాదించినపుడు....!-
లగేజ్ మోయగలిగే
శక్తి ఉంటేనే ప్రయాణం మొదలుపెట్టాలి..
ఏదో ఒక చోట కచ్చితంగా
ఆ బరువు మనం మోయాల్సిందే...
అన్ని సార్లు నౌకర్లు , వాహనాలు
అక్కరకు రాకపోవచ్చు...
ముళ్ళు రాళ్ళు దాటుకుని వెళ్ళే
దైర్యం ఉండాలి...
అంచులకు చేరుకుంటేనే మరో ప్రపంచాన్ని
చూడగలుగుతాం....
ఓపిక లేక ప్రయాణాన్ని మధ్యలో ఆపేసి
వెనుదిరిగితే
నీతో నడిచే వారికి కూడా నిరాశ మిగులుతుంది..
నిన్ను వదులుకోలేరు
నిన్ను మోస్తూ వెళ్ళలేరు ..
ప్రయాణమైనా , బంధమైనా మొదలుపెట్టాలంటే
ఓపిక , దైర్యం ఉండాలి...
జ్ఞాపకాల భారం లగేజ్ బరువు కంటే ఎక్కువ...
-
అలవాటయ్యే కొద్దీ కొన్ని పరిచయాలు, ఇష్టాలు
పాతబడిపోతాయి....
మరికొన్ని మాత్రం మెరుగు పెట్టిన బంగారం లా
నిత్యం మెరిసిపోతూ ఉంటాయి...
మీకు మీ చుట్టూ ఉండే వాళ్ళతో
మీకున్న సంబంధాల పట్ల స్పష్టమైన అవగాహన
ఉండేలా చూసుకోండి..
పాతబడింది బోరింగ్ లా ఉందనిపిస్తే
ఆ స్నేహాన్ని ఇష్టాన్ని అక్కడితో వదిలేయండి
అవతలి వ్యక్తికి ఎక్కువ హోప్ ఇవ్వకండి...
ఎందుకంటే మీ ఫీలింగ్స్ తెలియక
వాళ్ళు ఫీలింగ్స్ పెంచుకుని ఓన్ చేసుకుంటే
పాపం అందులోనుండి బయటకు రాలేక
చాలా యిబ్బంది పడతారు ..
-
మనసు పొలిమేరల్లో ఎప్పుడూ ఏదో ఒక అరుపు
వినిపిస్తూ ఉంటుంది...
తరచూ మనం నెగెటివ్ వైబ్ అని వదిలేస్తూ ఉంటాం...
కానీ నిజానికి అది మనకి
హెచ్చరిక చేస్తుంది...
నువ్వు వెళ్ళే దారి ప్రమాదం అని....
చిక్కుల్లో పడకు వెనక్కి రా అని...-
పట్టుకున్నపుడే వదిలేయడం నేర్పి ఉంటే బాగుండేది...
ఆనందంలో ఆకాశాన్ని అందుకునే లా చేస్తుంది...
అంతలోనే అగాధాన్ని కూడా పరిచయం చేస్తుంది...
కన్నీటి పరిచయం లేని ఒక్క కథనైనా
రాయగలిగిందా ఇంతవరకైనా...
అయినా చిత్రమే..
శిశిరం లో విడిచిన గురుతులను
వసంతం వెతికి తీసుకొచ్చినట్టు
మాయదారి ప్రేమ ఎన్ని చేసినా
మనసు దాటి పోదు....-