QUOTES ON #చితి

#చితి quotes

Trending | Latest
13 MAR 2019 AT 22:28

గాయం మానిననేమి
జ్ఞాపకాలు చాలవా
చితి పెర్చ

-


25 JUN 2018 AT 1:56

నా ఎదురుచూపుకు విసుగు పుడుతుంది
నా ఎడబాటుకెప్పుడు ఎడారే ఎదురవుతుంది
నా పిచ్చి తపనకి అశ్రుధారే మిగులుతుంది
నా మనోవ్యధకి ముక్తి ముల్లోకాల్లో లేనట్టు౦ది
నా పరిస్థితి తిలకిస్తే చి౦త కూడా చితి మేల౦టు౦ది
ఇ౦తలా ఏది ఏమైనా నీమీద మాత్రం నా ప్రేమ చావడ౦లేదె౦దుకో..
ఎందుకంటే కాస్త అనుకూలిస్తే ప్రేమించడం
పరిస్థితులు కాస్త ప్రతికూలమైతే మరిచిపోవడ౦
నా సిద్దాంతం కాదు కాబట్టి...
మృత్యుక్షణ౦ నా ము౦గిట నిలిచిన నీతోడు విడలేను కాబట్టి
నా మది నిస్స౦కోచ౦గా నిన్ను మాత్రమే ప్రేమిస్తుంది కాబట్టి
బహుశా అ౦దుకేనేమో....


-


16 FEB 2020 AT 22:13

అంతేలేనిది కాలానికి
అంతుచిక్కదది మనుషులకి

గెలుస్తున్నానని నువ్వెగిరితే
ఓడిస్తున్నానని కాలమెగిరింది

చివరకు గెలిచేది ఎగిరిన నువ్వా
ఓడిస్తున్నానని విర్రవీగుతున్న కాలమా

నీ చితికి నిప్పు పెట్టిన నాడే ప్రపంచానికి తెలుస్తుందది.🤘

-


22 JUL 2019 AT 18:06

నన్ను నేను వెతకడంలోనే
బతుకంతా 'చితి'కిపోతుంది.

-


4 MAR 2019 AT 19:28

ఒంటినిండా చితాభస్మంతో,
వల్లకాట్లో తిరిగే ఆయనకే లేనిది,
మనుషులని అంటరానితనమంటూ
వివక్ష చూపుతారెందుకో...

-


4 MAR 2019 AT 20:11

చండాలుడి రూపంలో వచ్చి ఆదిశంకరులవారికి ఆత్మభోధ చేశాడు శివుడు, అప్పుడు కాని ఆయనకు జ్ఞానోదయం కాలేదు. మాములు మనుషులు ఏమ్మా త్రం, ఎన్ని జన్మలు ఎత్తాలో నిజాం గ్రహించటానికి.

-


6 FEB 2019 AT 20:35

కాలి చల్లారిన చితి మంటల చిరు దివ్వెలు
దారి తప్పిన ముదుసలికి త్రోవ జూపి..
బదులు సాయంగా...
నలుగురు మోసే పల్లకిపై త్వరగా వచ్చి..
చిరు దివ్వెలను చితాగ్నిగుండంగా మార్చమని చెప్పె..!!

-


22 JAN 2019 AT 20:26

ప్రశాంతతకై వెతుకుతున్నావా...??
అయితే వల్లకాట్లోకెళ్లు...
కాలే చితిని చూడు, నీ చింతలన్నీ ఎగిరిపోతాయ్...
వెన్నెల సతీష్...

-



గుండెల్లో రగిలే మంట ముందు,
చితిమీద మండే మంట పెద్దలెక్కెం కాదు.

-



చిరునవ్వులు చిందిస్తూ..
చిరకాలం తోడుంటానంటే..
చితిలో కూడా తోడొస్తా..

-