అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందళం ఎక్కేవారు కొందరు అయితే,...
వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటూ
అదః పాతాళానికి పోయేవారు మరెందరో,...-
అవకాశం... అవసరం రెండూ ఒకలాంటివే
అవకాశాల కోసం
ఎన్నాళ్ళైనా ఓపిగ్గా ఎదురుచూస్తాం
ఎంతైనా కష్టపడతాం
ఒక్కోసారి వాటికోసం
ఎంత నీచానికైనా దిగజారతాం
ఎన్ని మోసాలైనా చేస్తం
అవసరాలు అలాంటివే
మనచేత అబద్దాలు ఆడిస్తాయి
లేని మాటలని పుట్టిస్తాయి
బ్రతుకులను ఆగమాగం చేస్తాయి
అందుకే,
అవసరాలని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి
అందివచ్చిన అవకాశాలను కలల సాకారానికి వాడుకోవాలి
ఏదేమైనా, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి
నలుగురికి ఆనందాన్ని పంచాలి..
-
తలుపుతట్టిన అవకాశాలను
బద్ధకమనే అవలక్షణంతో జారవిడుచుకునే!
సమయపాలనలేని దినచర్యతో
విలువైన జీవితాన్నే కోల్పోయే!
దారం తెగిన గాలిపటంలా
గమ్యం లక్ష్యం లేకుండా కొట్టుకుపోయే!
ఎవరికీ ఉపయోగపడకుండా!!
ఎవరికీ గుర్తుండకుండా!!-
ఎప్పుడు తనంతకు అవి రావు..
మనమే కల్పించుకోవాలి..
ఒకవేళ వచ్చిన సద్వినియోగం చేసుకోవాలి
-
కనిపించినట్టే కనిపించి
కనులకు కనికట్టు చేసి
లేనిపోని ఆశలు పుట్టించి
అందినట్టే అంది చెయ్యి చాచేలోపే
అందకుండాపోతాయి అవకాశాలు
బోరుమని విలపించిన మనసుకి
మళ్ళీ ఏదో ఒక అవకాశం
ఎదుట ప్రత్యక్షమై ఉర్రూతలూగించి
ముందుకు సాగేలా చేస్తూనే ఉంటుంది....-
అవకాశాలు బిందువంత చిన్నవా
సముద్రమంత పెద్దవా అన్నది
కాదు ముఖ్యం. ఆ అవకాశాల
నుండి వీచే శ్రమ అనే వెచ్చని
సమీరం..నీ విజయతీరాలకు
నిన్ను ఎంత వరకూ చేరువ
చేసింది అన్నదే ముఖ్యం.
-
మొదటి అవకాశం తలుపు తట్టినప్పుడు
వాటిని సద్వినియోగం చేసుకోవాలి
మొదటి సారి వచ్చే అవకాశం అంత
గొప్పగా రెండవది ఉండదు కనుక-