విజేతగా నిలిచేవరకు ప్రయత్నాన్ని ఆపకు!!!
-
నీరు గారుతున్న ఉత్సాహాన్ని ఉరకలెత్తించాలంటే నిన్ను నువ్వే వెన్నుతట్టుకొని పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి.
-
నేను నేనుగా ఉంటూనే
కొంత మారాలనుకుంటున్నాను!
నీ కోసం! నా కోసం! మన కోసం!!!-
ఏం ఎండలు రా నాయనా
నీటిలో మునక వేయకుండానే
వేసుకున్న బట్టలతోసహా తడసిపోతున్నాము 😂-
ఇలా అడిగితే నేనేం చెప్పను?
ఎలా మరచిపోగలను?
నీవు నా జీవితంలో ఒక భాగమయ్యావు
ఎలా మరచిపోతాను?
ఎక్కడినుండి వచ్చావో తెలియదు
ఆరోజు మా ఇంటికెందుకొచ్చావో తెలియదు
నీ అమాయకపు ప్రేమ మాయాజాలంలో చిక్కుకున్న నేను..
నీకు ఎప్పుడు అంతగా ఎలా దగ్గరయ్యానో తెలియదు
నీ ముద్దు ముద్దు రాగాలు నాకు సరాగాల్లా వినిపించేవి
నీ అమాయకపు కళ్ళను చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించేది
కసురుకొని ప్రక్కకు తోసేసినా
నా ఒళ్ళోకి వచ్చి చేరడం
నీకిష్టమైన ఆహారం నీముందున్నా
నేను తింటున్న రస్క్ మాత్రమే కావాలని మారం చేయడం
ఆశ పెట్టినా.. ఆశ పెడ్తున్నట్టు నటించినా
అది నిజమనుకొని అమాయకంగా నా చెంతకు చేరడం
నీతో దాగుడుమూతల ఆటలు..
నీతో నేను గడిపిన రోజులు..
నేను కనిపించకపోతే నువ్వు నాకోసం వెతికావో లేదోగానీ
నువ్వు నా ముందు కనిపించకపోతే..
ఎక్కడెక్కడ నా మనసు వెతికేదో నీకు తెలుసునా?
పరిస్థితుల వలన నేను నిన్ను వదిలివేసిన క్షణం నుండి
కొన్ని రోజుల వరకు నా నవ్వులు కూడా దూరమయ్యయని నీకు తెలుసునా?
నా మనసు భావాలను ఎలా తెలుపను నీకు?
నాకు నేనే ఇలా తలచుకుంటూ డైరీలో రాసుకోవడం తప్ప!
నీ మనసు భావాలు, మూగ సైగలు నాకర్థమైనా
నేను రాస్తున్న ఈ మాటలు నీకెన్నటికీ అర్థం కావు
ఎందుకంటే నువ్వు మా బుజ్జి పిల్లిపిల్ల "మ్యావ్ మ్యావ్" కనుక
నీకు "మ్యావ్ మ్యావ్" అనడం తప్ప ఇంకేమీ రాదుగనుక!😘-
ప్రతీ పుణ్యక్షేత్రం వ్యాపారకేంద్రమే!
ప్రతీ మతం ధ్యేయం ఇతర మతాలమీద ఆధిపత్యమే!
మానవత్వం కన్నా మతం ముఖ్యమనే భ్రమలో బ్రతుకుతున్న పిచ్చి భక్తులు...
ఆ పిచ్చికి పరాకాష్టే తోటి మానవులపై కొనసాగుతున్న మారణహోమాలు!!-
జీవితాలను వికసింపజేయాలన్నా, నాశనం చేయాలన్నా "ప్రేమ" అనే ఒకే ఒక అస్త్రం చాలు!!
-