you blindly Trust them!
-
గడిచే కాలాలకు గమనానై....
గమ్యం చేరే దారులకై అనునిత్యం తపించే....
నిత్యాన్వేషిని నేను! నిరంతర శ్రామికను నేను!
-
జీవితంలో ఎన్ని గుణపాఠాలు నేర్చుకున్నా....
ఎదుటివారి గుణాన్ని గుర్తించటంలో వెనుకంజలోనే ఉంటాం!-
కారణాలతో వెనక్కి తగ్గిన రోజు....
క్షణంలో చేజారిన కలగా నువ్వు!
పశ్చతాపంతో కుమిలిపోయే రోజు....
క్షణంలో విరిగిన శిలగా నువ్వు!
-
లక్ష్య చేరిక మార్గాలను అన్వేషించు....
శూన్యాన్ని చీల్చుకొని ప్రజ్వలించు!!!-
దుర్జనుడి సంకల్పితపూర్వక యత్నాలకు....
సజ్జనుడు ఎన్నడూ బెదరడు!
-
*నీ కల*
ఆచరణకు నోచుకోని ఆలోచనగా మిగిలిపోయిందా....
నీ కల!
ఎదగాలనే తపనలోని నిశ్శబ్దపు గందరగోళంలో మునిగిపోయిందా....
నీ కల!
కాలంతో పరిగెత్తలేని నిస్సహాయతలో కూరుకుపోయిందా....
నీ కల!
మధ్యంతర ఆకర్షణల నుండి బయటపడలేక కొట్టుమిట్టాడుతుందా....
నీ కల!
రెక్కలున్న ఎగరలేని పక్షినంటూ బద్ధకిస్తుందా....
నీ కల!
ఏ అంతా బలహీనమైనదా.... నీ కల?
-
తెర చాటున దాగిన చందురుడా....
తెరవెనుకన కథలన్నీ....
తెరమరుగై పోయేనా....-