QUOTES ON #వేగం

#వేగం quotes

Trending | Latest
10 MAR 2018 AT 23:04

కాల౦ చాలా వేగంగా పరిగెడుతు౦ది...
తనువుకి స్పర్శ తెలియని పాదం పరుగులా...
యవ్వనంలో ఉన్న హృదయపు ఆలోచనలా....
వల బారిన చిక్కకూడదని పరిగెడుతున్న చేప పిల్ల ఆశ అ౦త వేగ౦లా...

-


5 JUL 2019 AT 9:41

ఎవరెంత హేళన చేసినా నీదారిలో నువ్ సాగిపో...
కోయిల ముందు కప్ప బెకబెకమంటూ అరుస్తూ
" నేనూ నీలాగే పాడగలను తెలుసా " అందిట...
వారిదీ అదే తీరు...
నీ ప్రయాణంలో అలాంటి బెకబెకలు ఎన్ని వినాల్సి వచ్చినా ఓర్పుతో ముందుకెళ్ళు, కప్పలన్నీ కొట్టుకుపోతాయ్ నీ ఉధృతికి...
వెన్నెల సతీష్...

-


12 SEP 2020 AT 11:05

కాలం కన్న
వేగంగా
మనుషుల
మనుసులు
మారుతున్నాయి

-


14 SEP 2021 AT 9:26

ఒక వ్యక్తి 10నిమిషాలకి 15కిలోమీటర్ల వేగంతో
ప్రయాణిస్తున్నాడు అయితే
తన గమ్యస్థానానికి చేరుకోవాలంటే అదే వేగం తో గంట సమయం పడుతుంది కానీ అంతే వేగంతో వెళ్లిన గమ్యస్థానాన్ని చేరుకోలేకపోయాడు ఎందుకు?

-


18 NOV 2018 AT 18:35

మితి మీరిన వేగం,..
మతి తప్పిన దేహం,..ఒక్కటే

-


28 MAY 2017 AT 23:01

ఒక కవి కరమున
కలం అన్నది
కవితావేశపు
కవి హృదయంతో..

"నా వేగం నీ ఆవేశానికి
దాసోహం కాదా" అని.

-


28 MAY 2017 AT 21:07

లేత పాదాలతో క్రింద పడి లేస్తూ మొదటి అడుగు

వేయడానికి ప్రయత్నిస్తున్న పసివాడి తో గిర గిర

తిరిగే భూమి అన్నది ....

నా వేగం నీ ఆవేశంకి దాసోహం కాదా అని!!

-


13 JUL 2020 AT 15:32

కాలం కూడా కరోనాకు భయపడుతున్నట్టుంది

మరింత వేగంగా కదిలిపోతుంది

నాకు పనులెక్కువవ్వడం వల్ల అలా అనిపిస్తోందా

నిజంగానే కాలం గేర్ మార్చి వేగం పెంచిందా..?

-


18 MAR 2021 AT 22:05

నిజం అబద్ధం.....

నువ్వు నీ మనస్సాక్షి.....

ఇంకా చెప్పడానికి ఏముంది !!!

-