పరిగెడుతున్నానా..? నిలబడి పొరబడుతున్నానా....!!?
వీడిన గురుతులు చొరబడి గుండెను తడమగ
వెనుకకు చూస్తూ ముందుకు పరిగెడుతున్నానా??
కాలం తరమగ సాగిన పయనం
సాయం దొరకక ఆగిన సమయం
గాయం బలపడి కలబడుతుంటే
పరిగెడుతున్నానా..? నిలబడి పొరబడుతున్నానా....!!?
సంద్రపు అలనై ఎగబడుతున్నా
తీరపు అంచులు తాకుతు ఉన్నా
సంద్రపు నీరయి తీరపు అలనై
ముందుకు వెనుకకు పరిగెడుతున్నానా..?
నిలబడి పొరబడుతున్నానా....!!?-
⚛ Dec born saggitarian
⚛ Introvert
⚛ Solivagant
⚛ Paying words to pain
📞8500... read more
కలవదు అని కలనైనా
మిగిలినది ఇక కలతేనా
కనబడనని తను కదిలాకా
కనులకు మందు కన్నీరేనా
అడియాసలు నిండిన ఎదలోన
నెత్తురింక ఎండమావేనా
సత్తువెంత కూడగట్టినా
గతానికి గమనం సాధ్యమేనా!?-
గతమొక
అఘాథమనుకోకు
అఘాథం
అపాయామనుకోకు
అపాయం
ప్రమాదామనుకోకు
ప్రమాదం
విషాదమనుకోకు
విషాదం
విలాసమనుకోకు
విలాసం
గతమని అనుకోకు
-
వ్రాయుదు నెవ్వని జీత? వ్రాయుదు
నెవ్వని ఘనము? నే వ్రాయుదు
నెవ్వని గతము? మహిలో జనియించి
నే తృణమున్ బోలి, వ్రాసేద నా
అజ్ఞానంబును క్రౌర్యములన్, నా
పాపంబును నేనెరిగిన నేరమ్ములన్
నేరక భయభీతి వలన చేసిన కర్మములన్.-
కదిలే మేఘాల్లా జ్ఞాపకాలు అలా వచ్చి వెళ్తునే ఉన్నాయి.
కొన్ని మేఘాలు మాత్రం వర్షాన్ని కురిపిస్తున్నాయి,
అదే.... జ్ఞాపకాలు.
కళ్ళల్లో చెమ్మ వలనేమో - మనసు మాత్రమే చూడగలుగుతోంది
కేవలం చూస్తోంది.
బహుశా జ్ఞాపకాలే తన బంధీఖానా కాబోలు.
-
అందాల అపరంజి బొమ్మా
ఆడింది చాలింక లేమ్మా
ఆటల్లొ అలిసింది మరిచావమ్మా
పరుగాపి పడుకోవమ్మా
నీ కడగంటి చెమ్మ
నా గుండె తడుపు
నీ చిన్ని పాదం
నా పైన మోపు
కంది పోకుండ చూస్తానమ్మా
నువు తింటున్న వేళ
పొలమారి పోతే
పొరపాటు నాదే
మన్నించు నన్నే
నిను తలచింది నేనేనమ్మా
నీ బోసి నవ్వే
విరిసేలా పువ్వై
ఎదగాలి నువ్వే
మీ నాన్న కలవై
మురిసేలా నిను కన్న అమ్మ-
తరాల నాటిది ఇది
తరగని సంపద ఇది
పురాణ పాఠ్యం ఇది
పుణ్య భూమి ఇది
శాంతి కపోతం ఇది
పోరు కవాతు ఇది
దేశాల వెలుగు ఇది
జగాన గురువు ఇది
బ్రతుకు వేదం ఇది
వేదాల సారం ఇది
పదాన భారతం ఇది
భావాన భాగ్యం ఇది-
మరణమెంత హాయి అని చెప్పినోడు ఎవడు ?
పోయినోళ్ళ గొప్ప మాట విన్నవాడు ఎవడు ?
నువ్వు నేను ముందు వెనుక పోక తప్పదొకనాడు,
రేపనేది ప్రశ్నే గా మనిషికి అది ఏనాడూ....!?-
కలకాలం ఉండరుగా నీ వాళ్ళు, కలగానే పోదురు ఒక నాడు. జ్ఞాపకమై ఉందురు చాన్నాళ్ళు, ఊపిరితో నువు ఉన్నన్నాళ్ళు.
చేదు అనుకోకు ఏ శోకం,
చేతికి తగిలిన ఏ గాయం.
నువు నేర్చితె ఓ పాఠం,
తిరిగి రాదులే ఆ అధ్యాయం.
కాదంటావా.... ఓ మనిషీ!
నువ్వో ఒంటరి బాటసారి.
అలలైతే సంద్రాన్ని, కలలైతే నేత్రాన్ని
వీడేనా ఏనాడు, నీ తనమే నీ తోడు.-
గెలుపుకై ఎందుకు రాజీ పడడం,
ఓటమిలో ఇంకో మలుపు చూడక.
నిత్యం నీతో పోటీ అయితే,
ప్రతి పూట తప్పదు ఓ ఆట.
నిను నువ్వే గుర్తించేందుకు,
కావాలా భగవద్గీత....
సరిపోదా నువు నడిచిన బాట.
మన గతమే మనమని అవగతమే అవకుంటే,
మార్చేందుకు వీలవుతుందా గతమయ్యే ఈ నిమిషాన్ని....
నిరసిస్తూ కూర్చుంటావా స్వగతంలో నీ దుఃఖాన్ని.-