ఇ౦తే రాసిపెట్టు౦దేమో అని సరిపెట్టుకు౦టే ఆత్మ స౦తృప్తి...
ఇ౦కేదో రాసిపెట్టు౦దని వా౦ఛతో తహతహలాడితే ఆసక్తి....
ఇక ఇ౦తే నాకే౦ రాసిపెట్టిలేదేమో అనుకు౦టే విరక్తి....
విరక్తితో ఎక్కువగా కాలక్షేపం చేయకుండా పొ౦దినదానికి ఆత్మస౦తృప్తితో సాగిపోతూ నవమలుపుకై ఆసక్తిగా ఎదురుచూద్దా౦.....-
నీపై ప్రేమని నీవే విరక్తిగా మార్చి
నే రాయిలా నిలబడితే
ఇప్పుడెందుకలా జాలిగా చూస్తావు-
సమాజం ఇంద్రధనస్సు లాంటిది
చుట్టూ అవహేళన చేసే ప్రజలు
ఏ పని చేసిన తప్పులని మాత్రం గుర్తించే లోకం
బాహ్య సౌందర్యాన్ని మాత్రం వెలెత్తే చూపే చేతులు
ఇంకొక వైపు ముందుకు నడిపే ఉత్సాహం నింపేవారు
మరో వైపు ఎవడు ఎలా పోతే నాకేంటి నేను బావున్నా అనుకునేవారు
ఎలా అయితే ఇంద్రధనస్సు ఎండ వర్షం ల కల ఇకతో ఏర్పడుతుందో సమాజం కూడా ప్రేమ ,ద్వేషం ల కలయికతో ఏర్పడుతుంది
అందులో మనం చూసే చూపు బట్టి మనం ఏ రంగుకు సంబంధించిన వారమో నిర్ణయించబడింది
-
ఎక్కువగా వెతక్కు
గాయం చేసిన
నా గుండె గది
తలుపు తెరుచుకొని
నువ్వెప్పుడో వెళ్ళిపోయావు
మిగిలిన జ్ఞాపకాలేమైనా ఉంటే
కనీళ్లలో కొట్టుకుపోయావు
విచ్చుకోని పెదాలపై
విరక్తి నవ్వై
మళ్ళీ పుయ్యాలనుకోకు-
తిన్నావా లేదా అని అడగని నీకోసం
తనువెల్లా కళ్ళై ఎదురు చూస్తానెందుకు
బతికున్నానా లేదా అని పట్టని నీకై
బతుకంతా రాసిస్తానెందుకు
ముల్లులా గుచ్చే మాటలు బాధిస్తున్నా
మౌనాన్నే బదులిస్తానెందుకు-
కొందరికి
మనవి కాని వాటిపై "ఆసక్తి"
మనవైన వాటిపై "విరక్తి" ఎక్కువ!!
...✍️వెన్నెల సీత-
ఒక విధంగా చూస్కుంటే ఒకప్పటి బాల్య వివాహాలు మెలనిపిస్తుంది...
యుక్త వయసు వచ్చేలోపే ఒక తోడు వుండనే వుంటుంది....
ఇప్పుడు 30 వయసు వచ్చిన పెళ్ళిల్లు కాక 30 మంది పై మనసు పారేసుకున్న వారు కొందరు అయితే.....
ఒకరి పైనే మనసు పడి వాళ్ళని దక్కించు కోలేక బాధని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కొందరు...
ఇక భాదను భరించ గలిగిన వాళ్ళు ప్రేమ మరియు పెళ్లి పై విరక్తి చెంది ఒంటరిగా మిగిలిపోయే వారు ఇంకొందరు.....-
ఏకాంతత,ఒంటరితనం
ప్రశాంతత,మౌనం
ఒంటరిగా ఉండే వాడు
ఒంటరితనం అనుభవించేవాడు ఎప్పుడు మౌనంగా ఉంటాడు.
ఒంటరితనం ప్రతి విషయం పట్ల అనుకూలతను కోల్పోయినప్పుడు విరక్తి పుడుతుంది.
ప్రశాంతంగా ఉండేవాడు
ప్రశాంతతను అనుభూతి చెందే వాడు ఎప్పుడు ఏకాంతంగా ఉంటాడు.
ప్రశాంతత ప్రతి విషయం పట్ల అవగాహనను మెరుగుపరుచుకునే వ్యక్తిత్వం నుంచి విముక్తి పుడుతుంది.
ఊహాగానాలు,భ్రమలు తొలిగినప్పుడు
మనిషి స్పష్టమైన ఔనిత్యాని,ఔదార్యాని పొందుతాడు.-
అలసి పోయేను,
సొలసి పోయేను,
విశ్రాంతి లేక నిదురకు కరువాయేను,
విరిగి పోయేను,
చెదిరి పోయేను,
చుట్టూ జరిగే రాజకీయాల మధ్య నలిగిపోయేను,
విసిగి పోయేను,
విరక్తి కలిగెను,
చూస్తూ ఊరుకోడం తప్ప ఏమీ అనలేను,
పైకి నవ్వలేను,
లోపలే ఏడవలెను,
మౌనం పాటించడం తప్ప ఏమీ
చేయలేను......
ఇంకా ఎక్కువ ఆలోచిస్తే, మిగిలిన ఈ కాస్త ప్రశాంతతకు కూడా దూరం అయ్యేను......
-