SURESH SRINAGA   ($-SURESH ZONES-$)
66 Followers · 35 Following

I'm an INTROVERT FEMINIST
I'm an ATHEIST
I love WRITING
DIPLOMA CANDIDATE
ping 8499955392
Joined 7 July 2018


I'm an INTROVERT FEMINIST
I'm an ATHEIST
I love WRITING
DIPLOMA CANDIDATE
ping 8499955392
Joined 7 July 2018
27 MAY AT 23:31

చదివిన పుస్తకం నేర్పిన పాఠం.

తిన్నె కంచం కూడా
తిన్న తర్వాత ఎంగిలి పళ్ళెం అవుతుంది.

పొలంలో పంట కూడా కుప్ప నూర్పుల తర్వాత
గడ్డి అవుతుంది.

నువ్వు మరిచిన మోసమే
తర్వాత భరించే మౌనం అవుతుంది.

కృతజ్ఞత లేని రుణం
తర్వాత చెప్పలేని త్యాగానికి మర్చిపోయే మూల్యం అవుతుంది.

అశుద్ధం కడిగే చేయి కూడా
తర్వాత ఏడడుగుల నడిపించే నమ్మకం అవుతుంది

-


7 MAY AT 22:06

దేవుడిని భక్తితో కొలిచి పరమాత్మ అంటారు
బాధ,విచారం కలిగి దేవుడిని ఆశ్రయిస్తే వైరాగ్యం అంటారు.
దేవుడిపై కలిగే ప్రేమని భక్తి అంటారు
అదే మనిషిపై మనిషికి కలిగితే బలహీనత అంటారు.
ఒకరిది ప్రార్థన, మరొకరిది అవసరం.
దేవుడికి గౌరవం,మనిషికి అవమానం.
గొప్ప సమాజం.

-


5 MAY AT 22:52

నీ చిరనవ్వుల చెమట నేనౌతా
నా మెడ చాటున జ్ఞాపకమై నువ్వుంటావా?
ఒక్కసారి ప్రేమిస్తావా?
చివరి శ్వాస వరకు నీ ఊపిరినై ఉండిపోతా
నాకొక అనుభవంగా ఉండిపోతావా?
నేనొక జ్ఞాపకమై నీ ఆలోచనలో బ్రతికేస్తా

-


5 MAY AT 22:32

నా మనసుని సంధించే ప్రశ్నవు నువ్వు
నా మౌనానికి జవాబు చెప్పే జ్ఞాపకం నువ్వు
నా నవ్వు కి అర్ధం చెప్పిన భావం నువ్వు
నా బాధకి విలువ నేర్పిన అర్థం నువ్వు
నా కంటి వెలుగువై నిలిచిన రూపం నువ్వు
నా గుండె లయకు చరణం నువ్వు
నా శ్వాస చివరకి ఆనవాళ్లై మిగిలే గుర్తు నువ్వు
నా జీవన రాగానికి ఆఖరి రాగమాలిక నువ్వు

-


6 SEP 2024 AT 9:37

If OUR MISTAKES are our WEAPONS.
The THEORY I BELIEVE in is...

GOD'S WEAPON is KARMIC WAR..
KARMIC WAR is the GODS DOCTRINE

-


4 SEP 2024 AT 17:45

ఎలా చెప్పను...

తాను: సిగ్గు పడుతుంది సొగసు
మౌనం వీడమంటుంది వయస్సు
నీ ప్రేమే కోరుకుంటుంది మనస్సు

ఎలా చెప్పను....

నేను: మౌనం వీడని మాటలు
దొర వయస్సు వలపులు
దోబూచులాడే తలపులు

ఎలా చెప్పను..

తాను : నా వ్యాపకమే నువ్వుయ్యావు
నేను. : నా జ్ఞాపకమే మనమైయ్యాము.

-


27 AUG 2024 AT 10:09

నిశ్శబ్దపు చీకటి చాటున మౌనంగా కూర్చున్న వేళ..
కనుల నిండా కన్నీళ్ళ కలవరింతల కలలు..
అలల వెల్లువలా మదిని తాకే జ్ఞాపకాలు..
మోయలేని భావాలు...మరువలేని జ్ఞాపకాలు
మాట రాని మౌనలు..మదిని రగిల్చి జ్ఞాపకాలు
బాధించే భాద్యతలు... భరించలేని బంధుత్వాలు.

-


26 AUG 2024 AT 12:57

"STALKING"

IF YOU ASK ...
what is this STRANGE CUSTOM,

YOU will be TOLD ...that it is
An INTENSE RESEARCH PROCESS
that we do
TOWARDS SOMEONE.

-


25 AUG 2024 AT 11:13

మనస్సు..
కోరికలు,ఆశలు,ఊహలలో
ఆలోచిస్తుంటే..

హృదయం ..
వైరాగ్యం..వ్యామోహం..వేదనతో
ఆలోచిస్తుంది..

-


24 AUG 2024 AT 10:22

నువ్వు నాకు తెలుసు అని చెప్పడానికి...
నువ్వు నా స్నేహితులు అని చెప్పుకోడానికి
చాలా తేడా ఉంది.
తెలిసిన ప్రతి ఒకడు..స్నేహితుడు కాలేడు
తెలియని ప్రతి వ్యక్తి..శత్రువు కాడు.

-


Fetching SURESH SRINAGA Quotes