ఆనందం అలసిపోక ముందే,
అరనిమిషం అయిన ఆస్వాదించు...
ప్రాణం తన పయనం ముగించకముందే
పావుగంటైనా ప్రశాంతంగా వుండు......
నిరాశా నింగికి ఎగిసేలోపే,
నిశ్శబ్దాన్ని నెమ్మదించు...
దుఃఖం దరిచేరిలోపే,
దండేసి దానికి దండం పెట్టు......
మొత్తానికి ఇతరులని ఇబ్బంది పెట్టకుండా,
నీకు నచ్చినట్టు ఆనందంగా వుండు...-
నీ వెచ్చని కౌగిలినే నేను కోరుకున్న,
నీ మనసునే నా మనసుతో హద్దుకున్న,
తెలుపగలన ఆ భావన ఏంటో,
వివరించగలన ఆ అనుభూతి ఏంటో.....!!! ❤️❤️
మనస్సే తెలికయ్యేనే ఆ వెంట,
ముద్దులతో ముంచేయమంది నా పెదవుల జంట,
దీపకాంతులతో వెలిగిపోయెను నీ అందం,
అలా నిన్ను చూసిన నా హృదయం ఉప్పెంగేనే ఆ నిమిషం.....!!!! ❤️❤️❤️-
నీతో కాసేపు ఆడన ఓ చిలిపి ఆట,
కదలకుండా కవ్వించాలని ఉంది నిన్ను నా కనుసైగల వెంట,
కానీ నీ పాలబుగ్గల సోయగంలో ఏముందొనట,
తనివి తీరా సేద తీరాలని ఉంది నీ వయ్యరాల నడుమ చెంత,
ఆ క్షణం ఆట మొదలైన వెంట, అన్నీ మర్చిపోతానట నీ మాయలో పడిన వెంట...-
సమానం........ సమాజం.....డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్.
ఈ సమాజంలో పుట్టిన ప్రతిఒక్కరు సమానమే అంటు,
కుల, మత, లింగ, వారసత్వ, విద్య, వివాహ, వివక్ష, ఇంకా ఎన్నో మరెన్నో అంశాలపై,
అలుపెరుగని పోరాటం చేసి,
ఈ సమాజంలోని ప్రతిఒక్కరికి సమాన హక్కులని కల్పిస్తు రాసారు రాజ్యాంగం, అదేంటో ఒక్కసారి చూద్దాం :
మన దేశానికి అదే రాజసం,
పరిపాలించేది ఎవరైనా అదే మన రాజరికం,
మనకి హక్కులని కల్పించే న్యాయాధికారి,
మన విలువలని కాపాడే సర్వాధికారి,
ప్రతి సమస్యకు దారి చూపుతుంది,
కొత్త సమస్య వచ్చిన ప్రతిసారి తనలో కొన్ని మార్పులకు సహకరిస్తుంది,
అయింది ప్రతి పౌరుడికి పవిత్ర గ్రంథం,
అనుసరిస్తే చూపుతుంది ఏ సమస్యకైనా అంతం..!!
ఇంతటి గొప్ప బహుమతిని మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఏ వివక్ష లేకుండా అందించిన ఓ మహానుభావా నీకే కోట్లాది వందనాలు.
-
నువ్వు నా వైపు చూస్తే కాని తెలియలేదు లోకం ఇంత అందంగా ఉంటుంది అని,
నువ్వు నాతో మాట్లాడితే కాని తెలియలేదు
ఒకరి ప్రేమ ఇంత అద్భుతంగా ఉంటుంది అని,
నువ్వు నా ప్రక్కన కూర్చుంటే కాని తెలియలేదు ఈ హృదయానికి ఒక తోడు దొరికిందని,
నీతో ప్రేమలో పడ్డాక కాని తెలియలేదు నా జీవితం సంపూర్ణం అయింది అని.......!!!
నువ్వు వచ్చాకే తెలిసింది, నా లైఫ్ కి టర్నింగ్ పాయింట్ నువ్వేనని........!!!-
నీ వయ్యారి సొగస్సులతో సతమతం అవుతున్నాను,
నీ హవభావాలతో మంత్రముగ్ధున్ని చేస్తున్నావు,
అచ్చికబుచ్చిక లాడు నా సిరివెన్నెల దేవత,
మైమరిచి పోయాను నేను నీ వెచ్చని కౌగిలిలో, నా దాహం తీరక.....!!!-
ఓ కమ్మని జ్ఞాపకం నీతో గడిపే ప్రతి క్షణం
నీ ప్రతి స్పర్శ మధురాతి మధురం,
నిక్కపొడుచుకున్నాయి నా శరీరం లోని ప్రతి అణువణువు,
నీతో అనుదినం ప్రతి క్షణం పెరిగిపోతుంది నా చనువు.
ఆశ రేపుతోంది రేపు అనే ఓ పర్వదినం,
నీతో కలిసి గడపాలని ఉంది ప్రతి యుగం,
ఆ దేవున్ని కోరాను లెక్కలేనన్ని సార్లు,
నీతో కలిసి జీవించటానికి, నీలో నేనై బ్రతకడానికి.
నా ప్రాణం ప్రవహిస్తుంది నీ తీరం అంచున,
సమయం కూడా సన్నగిల్లుతుంది నీతో ఎంత సేపు గడిపిన,
వెళ్ళలేక వీడుతున్నాను,
మళ్ళీ ఓ మహా అలనై నీ తీరం చేరుటకొరకు.
నీవు లేని చోటు పేరే శూన్యం అంటు నీ పేరే జపిస్తుంది నా ప్రాణం, నా ప్రాణం !!-
ఓ కమ్మని జ్ఞాపకం నీతో గడిపే ప్రతి క్షణం
నీ ప్రతి స్పర్శ మధురాతి మధురం,
నిక్కపొడుచుకున్నాయి నా శరీరం లోని ప్రతి అణువణువు,
నీతో అనుదినం ప్రతి క్షణం పెరిగిపోతుంది నా చనువు.
నాలో కామవాంఛ రేఖేతిస్తుంది నీ సోయగం,
అది చల్లార్చడానికి కావాలి ఓ మహా సముద్రం,
నీ ప్రేమ మహా అలకే శిరస్సువంచింది నా ప్రాణం,
నీతో మమేకం కావాలని ఆశ పడుతుంది నాలోని ప్రతి కణం.
నీవు లేని చోటు పేరే శూన్యం అంటు నీ పేరే జపిస్తుంది నా ప్రాణం, నా ప్రాణం !!
ఆశ రేపుతోంది రేపు అనే ఓ పర్వదినం,
నీతో కలిసి గడపాలని ఉంది ప్రతి యుగం,
ఆ దేవున్ని కోరాను లేక్కలేనన్ని సార్లు,
నీతో కలిసి జీవించటానికి, నీలో నేనై బ్రతకడానికి.
నా ప్రాణం ప్రవహిస్తుంది నీ తీరం అంచున,
సమయం కూడా సన్నగిల్లుతుంది నీతో ఎంత సేపు గడిపిన,
వెళ్ళలేక వీడుతున్నాను,
మళ్ళీ ఓ మహా అలనై నీ తీరం చేరుట కొరకు...
నీవు లేని చోటు పేరే శూన్యం అంటు నీ పేరే జపిస్తుంది నా ప్రాణం, నా ప్రాణం !!-
Destiny,
An unknown place, which we doesn't know, how to go, when to go, where to go. It just comes and fall into the right place at the right time, filling the empty spaces in our lives, as if it was always there with us like a shadow, which we didn't recognise all the time.
It speaks louder when we try to connect all the dots that it left behind for us starting from the beginning.-
గాయ పడ్డ ఈ హృదయానికి,
వెన్న లాంటి నీ మనసుతో చికిత్స చేసావు,
తేనే లాంటి నీ నవ్వుతో,
ఆ గాయన్నే మాయం చేసావు.......
మచ్చ కూడా కనుమరుగయ్యేనే,
స్వచ్ఛమైన నీ ప్రేమతో,
మళ్లీ ప్రేమే చిగురించేనే,
నీ పై నా హృదయంలో.........-