దూరంగా ఉన్నా విడవలేనిది
దగ్గరగా ఉన్నా వదలలేనిది
దూరాలకు అతీతంగా
దృశ్యానికి అందకుండా
హృదయాలను పెనవేసే
అద్భుత శక్తే ప్రణయం!-
ప్రతి పొద్దుకి ప్రశ్నిస్తున్నా
తను తోడున్న క్షణాలిమ్మని.
కాలానికి గాలాలు వేస్తున్నా
ఆలాపనల రాగాలు వినమని.
అనుక్షణం ప్రణవనాదాన్ని మీటుతున్న
నిరీక్షణల నిడివి తగ్గించమని
నీరాజనమై తనకు కవ్వించమని...
-
క్రొంగొత్తగ స్వప్నకలువ నర్తించెను నయనములో
నీ ప్రేమే తారకలా ప్రభవించెను హృదయములో-
నీ పలకని పెదాల పదనిసే
నీ మది మాటున దాచిన ప్రణయం
నీ చిలకని చూపుల గుసగుసే
నీ కను చాటున కాచిన ప్రళయం
నీ అలకని అడుగుల రుసరుసే
నీ తను మాటున వేచిన ప్రణయం-
కాటుక కనులు...
చామంతి వెలుగులు
గులాబీ పెదాలు... మల్లెపూల నవ్వులు
మందార చెక్కిల్లు.... సంపెంగ సిగ్గులు
నెమలి కురులు... రమ్యమైన సిరులు
ఇన్ని పువ్వులు ఇన్ని వెలుగులు
ఇన్ని నవ్వులు ఇన్ని సిగ్గులు
ఇన్ని సిరులుతో నిండిన
ఈ దివ్యమైన దేవకన్య సొగసుకు....
ఈ భక్తుడు💛దాసోహం☺️-
తను వీడని తలపులతో అల్లుకున్న మల్లికలవొ
నను తీయని ఊహలలో చేరుకునే మళ్ళి కలవొ-
ప్రేమలు రెండు రకాలు
సాంగత్య ప్రేమ
ప్రకృతి ప్రేమ
రెండు జీవులు కానీ ఇద్దరు మనుషులు కానీ
ఒకే చోట కలిసి జీవించడం వల్ల
కలిసి సహకరించుకోవడం వల్ల కొన్ని రోజులకు
సహచరత్వం సాంగత్యం పెరుగుతుంది
అది ఇష్టంగా మారితే
స్నేహంగా ప్రేమగా మారుతుంది
ఇది సాంగత్య ప్రేమ
స్త్రీతత్వ జీవులైన
పువ్వులను చూసినప్పుడు
కుందేలు చిలుక పావురం నెమలి
బాతు హంస కుక్క పిల్లలు జంతు పిల్లలు
పక్షి పిల్లలు చూసినప్పుడు
పసి పిల్లలను చిన్న పిల్లలను చూసినప్పుడు
స్త్రీని పురుషుడు చూసినప్పుడు
స్త్రీతత్వ జీవులకు ఉండే అందం ఆకృతి
హావభావాల ద్వారా కలిగే ప్రేమ
ఇది ప్రకృతి ప్రేమ ఇది దేవుని ప్రేమ
Read remaining in caption 👇-
పెదవి పల్కినది గదనే
ప్రణయ పదములు తుదిగా,
మది గదిలో మెదులుతున్న
కథలు సుధలు ఈ మధుని
ఎదను వదిలెన్.-
పురుషుని బీజకోశంలో శుక్రకణాలు జనించి
పరిపక్వత చెంది సంభోగం ద్వారా
స్త్రీ యోని ద్వారం నుండి గర్భశయాన్ని
చేరడానికి పట్టే కాలం =3 నెలలు
ప్రత్యుత్పత్తి జరిగి స్త్రీ గర్భంలో పిండం అభివృద్ధి చెంది
బేబీగా జన్మించడానికి పట్టే కాలం= 9నెలలు
3నెలలు + 9నెలలు =12 నెలలు
సూర్యుని చుట్టూ భూమి ఒక పరిభ్రమణ కాలం =12 నెలలు
స్త్రీలో ఒక అండం విడుదలయ్యే కాలం = 30 రోజలకు ఒకసారి
భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమణ కాలం =30 రోజులు
సూర్య కిరణాలు నదులు సముద్రాలలోని
నీటిని వేడి చేసి మేఘాలుగా మార్చి వర్షంగా కురుపించి
భూమిలో ఉన్న విత్తనానికి నీరు వేడి వెలుగు ఇస్తూ
మొలకెత్తి పెరగడానికి ఆ మొక్కకు తండ్రి సూర్యుడు
అయితే నేలను ఆధారంగా చేసుకొని భూమిలో పెరిగే
ఆ మొక్కకు తల్లి భూమి అవుతుంది
read remaining in Capition👇-
చీకటికి వెలుగు అందం
వెలుగుకు చీకటి అందం
నిశికి శశి అందం
శశికి నిశి అందం
కనులకు కాటుక అందం
కాటుకకు కనులు అందం
పసిపాపకు చిరునవ్వు అందం
చిరునవ్వుకు పసిపాప అందం
మల్లెలకు పరిమళం అందం
మగువ చెక్కిళ్ళకు సిగ్గు💛 అందం
నదికి మలుపు అందం
నడుముకు మడత అందం
పురుషునికి స్త్రీ అందం
స్త్రీకి పురుషుడు అందం
జంటకు ప్రణయం అందం
ప్రణయానికి పరిణయం అందం
నువ్వు నాకు అందం
నేను నీకు అందం
మనకు ప్రేమ💛అందం
ప్రేమకు మనం అందం-