పొగడ్తలు
శరీరానికి
ఇచ్చే
అనస్తీషియా.🤘-
ఎవడినీ ఎక్కువగా పొగిడేయకండి
పొగిడి గొప్పోళ్ళని చేయకండి...
వెన్నెల సతీష్...-
పొగుడుతు పో కొంచెము
పక్కనోన్ని సాంతము
పొగిడితేనె నేస్తము
ఓ కూనలమ్మ !!-
స్వేచ్ఛ విలువ తెలియాలంటే అనుక్షణం తన యజమాని కనుసైగలతో నడిచే ఓ బానిసని అడుగు..
ప్రేమ విలువ తెలియాలంటే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేని అనాధలను అడుగు..
ఆకలి విలువ తెలియాలంటే రోజుకో పూటైనా తిండి దొరికితే చాలనుకునే నిరుపేదను అడుగు..
పొగడ్త విలువ తెలియాలంటే రోజుకో తిరస్కరణ ఎదురుకొంటూ సమాజంలో తక్కువ చేసి చూపబడిన అందం లేని ఆడపిల్లని అడుగు..-
నీలోని మంచిని పొగిడే వారికన్నా,
నీలోని చెడుని వేలెత్తి చూపే వారిని ఎప్పటికీ వదులుకోకు.🤘
-
పొగడ్తలని, విమర్శలని సమానంగా స్వీకరించాలి ఎందుకంటే....
పూలు వికసించాలంటే ఎండా-వాన రెండూ కావాలి కదా....
విమర్శలను విశ్లేసించుకుంటేనే మనలో లోపాలను సరిదిద్దుకోగలం...-
కొందరి పొగడ్తలు
నీ స్థాయిని పెంచేస్తే
మరికొందరి పొగడ్తలు
నిన్ను నిలువున ముంచేస్తాయ్
జాగ్రత్త...!-
పొగిడిన నోటితో తిట్టడం,
తిట్టే నోటితోనే పొగడడం..!
నిమిషం కిందట పొగిడిన నోరే,
మరునిమిషంలో తిట్టేదీ మీరే...!!
ఇంత వరకూ బాగున్న వారే,
ఇంత సడెన్ గా మారిపోతారే..!!!-