Pavan Kumar_ gpk   (Pavangpk)
356 Followers · 165 Following

అలల తాకిడికి కూలిపోయిన
ఇసుక గూడు నేను
కలల రాపిడికి రాలిపోయిన
కన్నీటి బొట్టు నేను ✍🏿
Joined 27 January 2018


అలల తాకిడికి కూలిపోయిన
ఇసుక గూడు నేను
కలల రాపిడికి రాలిపోయిన
కన్నీటి బొట్టు నేను ✍🏿
Joined 27 January 2018
10 NOV 2024 AT 16:28

తాత్కాలిక ఆనందాల మోజులో
నిన్ను నువ్వు కోల్పోతున్నావ్
శాశ్వతమేదో తెలియక
మూర్ఖంగా మిగిలిపోతున్నావ్

-


22 JAN 2024 AT 19:41

నేను నాది నా అనే అహంస్వార్ధాలు నీకున్నంత వరకు
నిన్ను ప్రేమించే వారి విలువ నీకర్థం కాదు..

-


21 JUL 2023 AT 16:55

మనతో మాట్లాడాలని తపన పడే వాళ్ళకి
మనం టైం ఇవ్వం ,
మనల్ని అస్సలు పట్టించుకోని వాళ్ళకి
టైం ఇస్తాం కాల్ చేసి మరీ కదిలిస్తాం..
దగ్గరగా ఉన్న వాళ్లని దూరంగా చూస్తాం
మనకస్సలు కనిపించని వాళ్ళని మాత్రం
చాలా దగ్గరని చెప్పుకుంటాం.
మోడ్రన్ లైఫ్, మాటవినని ప్రపంచం☹️

-


15 JUL 2023 AT 7:12

ప్రేమ ఉన్న చోట
త్యాగం ఖచ్చితంగా ఉంటుంది
ఆ త్యాగం గొప్పతనం అర్థమైనపుడే..
ప్రేమించే వ్యక్తి విలువ తెలుస్తుంది

-


5 OCT 2022 AT 10:03

Without you,It's like,
Just being, with no light.
Just living, with no heart.

-


7 AUG 2022 AT 0:11

చీకటి
ఒంటరితనం
కారణం లేని కన్నీళ్ళు
ఎందుకో తెలియని ఆవేశం
మనలో మనం పడే బాధ
హృదయాన్ని చాలా గట్టిపరుస్తాయి...

-


26 JUN 2022 AT 8:37

అన్నీ తెలుసుకుని చేస్తే అది వ్యాపారం అవుతుంది,
ప్రేమ కాదు.ఏమి తెలిసినా తెలియకపోయినా
పుట్టే సమయంలో ప్రేమ పుడుతుంది.
పుడుతుంది అంతే, చావు లేదు దానికి...

-


12 JUN 2022 AT 20:00

ఎన్నాళ్ళిలా చీకట్లో పరిగెడుతూ
వెలుతురున్న కలల్ని కంటాం..
అసలు వెలుతురులో ఎప్పుడుంటాం.‌.?
దాదాపు సామాన్యులంతా,
నాలా,ఇలా అనుకుంటూ బ్రతికే వాళ్ళే..

-


24 APR 2022 AT 21:20

కొన్ని గాయాలను,
గాయపరిచిన వారు మాత్రమే
నయం చేయగలరు..

-


2 APR 2022 AT 21:01

ఎవరైతే ఎక్కువగా నీ సంతోషానికి
కారణమవుతారో,వాళ్ళే ఎక్కువ
సందర్భాల్లో నీ బాధకి కూడా
కారణమవుతారు‌...

-


Fetching Pavan Kumar_ gpk Quotes