QUOTES ON #నాలుక

#నాలుక quotes

Trending | Latest
29 FEB 2020 AT 18:58

నలుగురిని గెలిచినవాడు కాదు,
నాలుకని గెలిచినవాడు ధీరుడు...

-



నలుగురిలో ఉన్నప్పుడు నాలుక..
ఒంటరిగా ఉన్నప్పుడు
ఆలోచనలు జాగ్రత్త..

-


17 APR 2020 AT 21:48

చేంతాడు ఎంత పొడుగ్గా ఉంటే
అంత మెలికలు పడుతుంది
నాలుక కూడా అంతే
ఎంత పెద్దగా ఉంటే అంత
మెలికలు తిరుగుతుంది
అందుకే చేంతాడును నాలుకను
మెలికలు పడకుండా జాగ్రత్తగా
చుట్టి అవసరము ఉన్నప్పుడే వాడాలి

-


1 SEP 2020 AT 19:28

అప్పటి కత్తులకన్నా
ఇప్పటి‌ నాలుకలకే
పదునెక్కువ
అప్పుడు
తలలు మాత్రమే తెగేవి
ఇప్పుడు
కుటుంబాలు
కుటుంబాలే తెగిపోతున్నాయ్

-


21 AUG 2021 AT 19:54

ఆరడుగుల‌ ఆజానుబాహుడిని
అరంగుళం నాలుక శాశించినట్టు
అర్ధ రూపాయికి తూగనోడు
అందరిపైన ఆజమాయిషీ చేస్తుంటడు

-


26 NOV 2019 AT 23:00

సన్ననైనదేమో నాలుకనట
పలుకులేమో అనంతమట
పదునైనవేమో మాటలట
బంధాలనేమో తెంచేస్తవట

-


2 JUN 2020 AT 7:49

నడుచుకుంటూ వెళ్లే నాలుక
అవసరాన్ని బట్టి...
వేగం పెంచుకుంటుంది

-


25 AUG 2020 AT 7:35

"ఏడుస్తుంది స్వర్గం
అందరికి తననే కోరుకుంటారని
ఎంతమందికని తను ఆశ్రయం ఇవ్వగలదు?ఎన్నాళ్లు ఇవ్వగలదు?!"

-


7 MAR 2020 AT 6:40

💞
"ప్రేమ"
మూతి కుట్టుకొంటే
మాటలు రావేమో ...
కొట్టుకొనే గుండె
కట్టుబడే ఉంటాది ...
మూసుకోని మనసు
బాసలు చేస్తుంటాది ...
మరువలేని మది
మారాం చేస్తుంటాది ...
మనిషి చేసిన "ప్రేమ"
మరణం లేదంటాది ...
నీ ఆఖరి
ఊపిరి వరకుంటాది ...

... ✍ "కృష్ణ" కలం

-


14 JUL 2019 AT 15:37

నవ్వించి నొప్పిస్తుంది
కవ్వించి కాటేస్తుంది
నరం లేని నాలుక


-