వికసించే పుష్పాల వలే నీ తొలకరి చిరునవ్వులు
అమ్మానాన్నలతో దోబూచులాడే నీ దాగుడుమూతలు
చిన్ని చిన్ని పలుకులతో మదిని మైమరపించడాలు
స్వాతిముత్యపు జల్లుల వంటి నీ అడుగుల సవ్వడి
శ్రీ వేంకటేశ్వరుడు కన్న కలల ప్రతిరూపానివి వేదార్ష్-
నీకై ఎదురు చూసిన నాన్నకి పుట్టిన అమ్మవురా
అనుక్షణం వెన్నంటి ఉండే అమ్మకి తోడువురా
ఆటపాటలతో అక్కని ఆడించే పసిడి బంగారానివిరా
ఉరుకులు పరుగులతో అందరిని అలరిస్తావురా
సంహితముతో అందరి మదిలో నిలుస్తావురా-
జీవితమనే ఆటలో ఆడించేది ఎవరు ఆడేది ఎవరు
ఈ జగన్నాటకంలో అంతా ఆ జగన్నాధుడిదే ఆట
జనన మరణాలలో నీ ఆయువు ఎంత
ముప్పదుల జీవితానికే నూరు ఏళ్ళు గడిచేనా
ఎన్నెన్ని పూజలు చేసేనో అమ్మ
ఎన్నిన్ని నోములు నోచెనో అర్థాంగి
ఇన్నాళ్లు తండ్రికి చేదోడుగా ఉన్నావనుకోనా
ఆ భగవంతుడికి అసూయ కలిగెననుకోనా
కనుపాపల కాపాడుకున్న పిల్లలకి దూరమయ్యవా
అన్నయ్య అని వెన్నంటియుండే తమ్ముడిని వీడావా
ప్రమోదుడి ప్రేమకి ప్రతిఫలము లేకుండా పాయే
అన్నయ్యా మీరు ఏలోకాన ఉన్న
మీ పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని
ఎల్లప్పుడూ పరితపిస్తూ
మీ ప్రేమకోరే తమ్ముడు-
నేను అడిగితే కాదనకుండా ఇచ్చేవారు
నాకు తోడుగా ఉండేవారు
నేను కొప్పడితే అర్థం చేసుకునేవారు
నా బాధని తీర్చేవారు
ఒకరున్నారు అంటే అది నువ్వే-
ఏడుపుతో మొదలైంది నీ జననం
నీ జననం మాకు ఓ వరం
పుట్టుకతో ఏడ్చి మములని నవ్వించావు
పుట్టిన వెంటనే అమ్మ కళ్లల్లో ఆనందం
నాన్న రూపు పోలికలతో ఓ మధుర అనుభూతి
బాబాయితో ఆనంద హోరు హుషారుల చిందులు
పిన్నిని పరిగెత్తిస్తూ అలరించే దరహాసలు
చెల్లెలితో ఆడుతూ ముచ్చట్లతో కవ్వించడాలు
వెన్నంటి ఉండే తాత మోములో చిరునవ్వులు
నానమ్మ చుట్టూ అల్లర్లతో సంతోషాల జల్లులు
అమ్మమ్మతో ఆటపాటల సరదాలు
తాతయ్యతో కనులవిందు గావించే సంబరాలు
చిన్ని చిన్ని ముద్దు లొలికించే నీ మాటలతో
పరవశించెను నా మది ఆనందపు హరివిల్లులతో
మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ
మీ నాన్న....-
అందచందాలతో ఆకట్టుకోవడాలు
అల్లర్లతో మదిని మైమరిపించడాలు
చిరు నవ్వుల చిలిపి చేష్టలు
బాధలను మైమరపించడాలు
కను చూపులతో కవ్వింపులు
తడబడితే మాట సరిచేయడాలు
అడుగడుగునా తోడుండడాలు
జీవితపుటంచులవరకు నడవడాలు
నా జీవితపు అర్థాంగికి
జన్మదిన శుభాకాంక్షలు🎂💐-
ఆలోచనల అలజడులు
నిదురలేని రేయిలు
సమాధానంలేని ప్రశ్నలు
జీవన పోరాటాలు-