"వ్యక్తిత్వం" ( వ్యక్తి తత్వం )
మూడు పదుల ప్రయాణం
చేదు సంతోషాలదా గమనం
అలసిపోని ఆనంద పయనం ...
మెప్పించటం పెద్ద గొప్పేంగాదు
పదులు నిను మెచ్చటం మోదు
అదబ్బా పూ ఫలాల ఈ పాదు ...
నేల నుండే సాగిన వో నడక
అంతింతై ఎంతెత్తు ఎదిగినా
నేలనే నిలిచే వ్యక్తిత్వ తత్వం ...
సు గుణాల గుణకార గుడారం
సమ సత్వ రజో తమోగుణాకారం ...
అహంతో అంతా నేనే అనుకునే
ఆవగింజల అంతస్వరూపాలకు
ఆతనూ ...! వో అందని ఆకాశం ...
వినయం, సహాయం, సహనం
తన పర భేదం తెలియని తనం
ఆ అజాత శత్రువుది ఈ ఆకారం ...
... ✍ "కృష్ణ" కలం-
"ఎనిమిది ఏడయ్యింది"
నిశిరాతిరి నిదురలో
ప్రధమ ఆకు పండింది
అలా ఎనిమిది ఏడయ్యింది …
అమ్మ మొదటి గర్భం
ఉన్న ఊపిరులు నిండి
ఇలా ఈరోజు ఈశుని చేరింది ...
ప్రగడవారి ప్రతిబింబం
తాతావారి పంచన జేరి
మంచి కుటుంబాన్ని ఇచ్చింది ...
ముగ్గుల లోగిలి ఇల్లై
ముగ్గురు బిడ్డల తల్లై
ఆ మొగ్గ పువ్వై పండై రాలింది ...
తానో తిరగలిలా తిరిగి
పని పాటులతో అరిగి
కాటుకలా కరిగి నేలన వొరిగింది ...
హా ...
నిశిరాతిరి నిదురలో
ప్రధమ ఆకు పండింది
అలా ఎనిమిది ఏడయ్యింది …
... ✍ "కృష్ణ" కలం-
I noticed that the Time is an invaluable asset
And understood that it shapes our lives in profound ways. And also I could know that unlike money or material possessions, time is finite and irreplaceable
And finally came to know that once the time passes
it cannot be regained. That’s it and that’s all I learned.-
"కళ్ళల్లో బుడమేరు పొంగింది"
కొత్త నీరొచ్చి పాత నీరును తరిమింది
వరద పొంగుల్లో బురదను చిమ్మింది
తుది మొదలులేని విధి వెక్కిరించింది
కరిగిన కాటుక కాస్త వో కడలై కదిలింది …
కొత్తకు కొమ్ములు గిత్తకు పరుగులు సహజం
విత్తులు లేకుండా మొక్కలా ? అసహజం ...
నిండిన పాపం పూర్ణమై పండేది ఎపుడో ?
దాగిన పుణ్యం దరిజేరి దాహం తీర్చేదెపుడో ... ?
అన్నీ తెలిసిన అంతరంగానికి అలసట
నిన్నా నేడు నిన్నూ నన్నూ తా పిలచేనట
కారుణ్యం చూపిన కాలమా కదులుతోంది
కదిలిన ఈ కళ్ళల్లో బుడమేరు పొంగింది ...
హా ...
కొత్త నీరొచ్చి పాత నీరును తరిమింది
వరద పొంగుల్లో బురదను చిమ్మింది
తుది మొదలులేని విధి వెక్కిరించింది
కరిగిన కాటుక కాస్త వో కడలై కదిలింది …
... ✍ "కృష్ణ" కలం
-
"అనామిక" 💕"
తాను, నా కవితా కంటి కాటుక
పదమంటూ పరిగెడు పదాలు
నడిచే నడకల పాదాల పారాణి
ఆ అరణి నా కవితా శిల్పానికి
ప్రేరణ ప్రాణం ఉనికి ఊపిరి
ఔను ఆమే నా "అనామిక" 💕 ... !
ఒక తూరి నే తనను జేరి
తెలియక తన ఇచ్ఛకు నచ్చని
ఖచ్ఛితమైనదే అయిన మాటకు
బగ్గుమన్న కోపంతో దిగ్గని తల త్రిప్పి
ఉగ్రంగా నా వైపు చూసిన చూపులు ... !!
అప్పటి ఆ ఆమె భంగిమలో
తా తన జడను ముడివేస్తున్నది
అలా గ్రుచ్చుకున్న చూపులకు
న్రొచ్చుకుక్క నా చిన్ని గుండెన
విచ్చుకొన్న వో అక్షర “కవిత” ఇది ... !!!
... ✍ "కృష్ణ" కలం-
"ఉత్క్రుష్టం"
కుడి చెవికి వినికిడి కొంత తగ్గింది
ఎడమ కంట్లో కొత్తగా శుక్లం పుట్టింది ... !
మెట్లెక్కమంటే మోకాలు మొరాయిస్తోంది
కాదంటే కుయ్యో మొర్రో అని కేకలేస్తోంది ... !
పోపును జూసిన ఈ పంటి సిమ్మెంటు
పొసగదు పో ... పొమ్మని అంటోంది ... !
నాలుగు ఘడియలు కూర్చుంటే చాలు
నడుం నడుమ నరం నీరసమంటోంది ... !
వచ్చిన ఆలోచనలో అర్ధ అర్ధం అవదు
మొన్న గుర్తున్నా నిన్న చిత్రం నిలువదు ... !
నాసిక వొక్కటే వాసనలు కావాలని ఆశిస్తూ
నాలుక ఆ నవ రుచుల కోసం ఆవలిస్తూ ... !
వయస్సు వెళ్లిన భాగం ఎంతో తెలియదు
ఉన్నది చిన్నభాగమే అట్టేకాలం నిలవదు ... !
మరి ఇపుడు జపమాల పడితే లాభమా ?
ఇడా పింగళ సుషుమ్న సాకారం సాధ్యమా ?
అందుకనేనేమో ఏ జీవితం చిన్నదంటారు
ఇందుకనేనేమో ఈజన్మ ఉత్క్రుష్టమంటారు .. !!
... ✍ "కృష్ణ" కలం
-