QUOTES ON #జన్మదిన

#జన్మదిన quotes

Trending | Latest
29 MAR 2019 AT 10:29

పురిటి నొప్పుల సుడి గుండంలో
ఆ అమ్మ మోములో చిరునవ్వు విరిసింది
గుమ్మం బయట నిల్చొని ఆశగా చూస్తున్న
ఆ నాన్న సంతోషం వెలకట్టలేని వేడుకైంది

ఎందుకు ఆ తల్లిలో ఆ చిరునవ్వు
ఎందుకు ఆ తండ్రిలో ఆ వేడుక

ఆ అమ్మ పురిటినొప్పుల త్యాగం
ఊపిరై ఆ తల్లిని చేరిందనేగా.....
ఆ నాన్న చెమటచుక్కల త్యాగం
ప్రాణమై ఆ తండ్రిని తాకిందనేగా....

నేడు ఆ మాతృమూర్తుల శ్రమ
విజయ శిఖరమై విరజిల్లుతుంది
Yq కవుల్లో ఉత్తేజం నింపుతుంది
తన రచనతో యువత ని తట్టి లేపుతూ
సాహిత్యంలో తన సత్తా చూపుతున్న సతీష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు

-


13 JUL 2020 AT 15:28

తొలిసారిగా వైక్యూలో చెల్లి అనే
ఓ పిలుపుతో మొదలైన పరిచయం
ఉత్సాహపు మెరుపులు
ఉరకలేసే సరదా వ్యాఖ్యలు
అన్నీ తనతోనే....
అభిమానపు ఊసులు
కవితల్లో కలువరేఖలా
సుమధురంగా వినిపించే
తన మాటలు
జీవితాన్ని వడబోసిన
ఆత్మీయత అనుభవం తన కళ్ళల్లోనే నింపుకునే
సుజాత త్రిపురారి అక్కకు జన్మదిన శుభాకాంక్షలు
శ్రీలక్ష్మి నివాసుని దివ్యాశ్శీస్సులు ఎల్లప్పుడూ తనకు ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్న💐💐💐
మీ వైక్యూ మిత్రులు



-


6 DEC 2020 AT 9:06

నిశ్శంకర సావిత్రి
గుంటూరు జిల్లా చిర్రావూరు
గ్రామంలో
జన్మించిన సావిత్రి
చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది.
పెదనాన్న వెంకట్రామయ్య చౌదరి
ఆమెను పెంచి పెద్దచేశాడు.
చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో
పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది.
అప్పుడే హిందీ నటుడు
పృథ్వీ రాజ్ కపూర్ చేతుల మీదుగా
బహుమానం కూడా అందుకుంది.
తర్వాత సినిమాల్లో నటించడం
కోసం మద్రాసు చేరింది.
చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది.
తెలుగులోనే కాక తమిళంలో
తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం
అనే బిరుదు పొందింది.
తమిళ నటుడు జెమిని గణేశన్ ను
పెళ్ళి చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు.
సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే
కూతురు,
సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు.
కుటుంబ కలహాలు, ఆర్థికంగా
ఇబ్బందులు
ఎదురవడంతో ఒక దశలో బాగా
బతికిన ఆమె చివరి దశలో
పేద జీవితాన్ని గడిపింది.
అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో
ఉండి 46 సంవత్సరాల వయసులో
మరణించింది.
తెలుగు, తమిళ సినిమా నటి,
దర్శకురాలు.
అభిమానులచేత మహానటిగా కీర్తింపబడింది.

-


16 OCT 2019 AT 12:43

విరించివో
విరబూసిన అక్షర కుసుమానివో
విల్లుల హల్లులు సంధించే
విశ్వరూపానివో
విరూపాక్ష నేత్రివో
విలసిత విశారదవో
విహంగ పద మంజరివో
మా వైక్యూ పద ప్రహేళికవు
అంచెలంచెలుగా
అక్షర మొగ్గలను సవరిస్తూ
కలువలా విరబూసిన
వరూధిని గారికి జన్మదిన
శుభాకాంక్షలు
🌹❤💖💖💖❤🌹

-


25 DEC 2017 AT 1:17

అప్పటి వరకు ఈ ప్రపంచంలో తానూ ఉన్నా,
నేను పుట్టాక నేనే ప్రపంచంగా భావించి,
అన్నీ తానై నా జీవితానికి జీవం నింపిన...
నా ప్రతీ అడుగులో అండగా నిలిచిన....
మా అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు
💐💝🌸💐

-


17 SEP 2020 AT 16:45

మోది నామము వినగనే మోకరిల్లె
నుగ్ర వాదుల్భయంబుతో నుర్విపైన
చైన, పాకు దేశములెల్ల చల్ల బడెను
దేశ క్షేమంబె తలతురు ధీరులెపుడు..

-


21 DEC 2019 AT 23:14

సంధ్యా రాగంలా సుమధుర భావంలా సుగంధాల తెలుగులా తెనుగున తడిసిన సుమలా మీ కవితా వాహినిలో జన హృదయాలు ఓలలాడుతాయి మనసులను మృదువుగా తాకి పలకరిస్తాయి ఎన్నో విజయాలను వరిస్తూ ప్రగతిపధాన సాగాలని నిండు నూరేళ్ల సౌభాగ్యాలతో వర్దిల్లాలని ఆశీర్వదిస్తూ జన్మదిన శుభాకాంక్షలు😊😊🎂💐💐😊😊

-


3 APR 2023 AT 20:01

జనహృదయ నేతకి జన్మదిన శుభాకాంక్షలు...
🙏💐🎂
వదనంలో వడలని ప్రశాంతం..
గమనంలో సడలని నిబ్బరం..
అందరికీ మంచే చేయాలనే సంకల్పం..
మనదనకుంటే వదలని స్నేహహస్తం..
ఇవన్నీ కలబోసిన మౌన విగ్రహం..
తనవారికి అడ్డంకులొస్తే కాచే మనో నిగ్రహం..
పని చేయాలంటే పదవే అక్కర్లేదనే స్వభావం..
పదిమంది దీవెనలే మీకు శతాయుష్మానం...!!

-


23 OCT 2021 AT 20:22

Happy birthday dear sir

I love you.......

ఇంతకన్నా పెద్ద పదాలు
కోసం నా హృదయాన్ని అడిగితే....
దీని ముందు అన్ని చిన్నవని
దీన్ని ఇచ్చింది మరి.
May god bless you sir... !

-


19 OCT 2021 AT 0:02

ఓ నా ప్రాణమా...!
నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ...
నువ్వు అనుకున్న దానిలో విజయం సాధించాలి అని...
మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
జన్మదిన శభాకాంక్షలు.

-