కన్నయ్య... నువ్వు నా నేస్తం
పడిపోతుంటే ఇచ్చేవు నీ హస్తం
కష్టమొచ్చినా ఓర్పు నిచ్చి
నష్టమేమి లేదంటావు నిక్కచ్చి
నాలుక చీలిన నరుని గుణం నీది కాదని తెలిసి
నలువుకి నిలువు దోపిడి ఇవ్వనా నీ మనసు గెలిచి
నవ్వేపుడు సంబురమయ్యేవూ
నడిచేపుడు చేయుతవయ్యేవూ
-
నలుపు మరియు తెలుపు.. భవిష్యత్తు నలుపును... read more
తనకోసం నేను కొన్ని అక్షరాలు అయినా రాయాలి
లేదంటే నా మనసు కుదుటపడదు, నిలువనీయదు
మేము ఎపుడూ టామ్ అండ్ జెర్రీ లమే,
అయినా సరే మేం స్నేహితులమే..
అరవం నుంచి ఆంగ్లం వరకి తిట్లన్నీ మాకు చుట్టాలే..
అయినా మేము కలిసే ఉండగలం
ఏ దేశమేగినా ఎందు ఉద్యోగం చేసిన..
పొగడాలి నన్ను మేరా దోస్త్ అనీ ,
ఎంత అల్లరి చేసినా నవ్వాలి చిన్న పిల్లనీ నేననీ..!!
రామ్ లాంటి నేస్తం ఒకరుంటే కష్టమొచ్చినా ఇష్టమే..!!-
స్నేహమంటే మంచిగా ఉన్నపుడు మాత్రమే చేసేది కాదేమో, గొప్పగా బతికేపుడూ చూసేది కాదేమో..?
కష్టంలో, నష్టంలో కన్నీరుని తూడ్చే వేలే నేస్తం
కలలోనైనా మరువలేనిది, కథ ఏదైనా మలుపుతిప్పేది స్నేహం..!!-
కలిసామంటే చాలు దొర్లుతూనే ఉంటాయి మాటలు,
పూల దొంతరల మధ్య సీతాకోకచిలుకలు తారాడినట్టు..!!
కదులుతూనే ఉంటాయి కొత్త ఆలోచనలు,
కోటి సింగిడీలను మోసుకొచ్చినట్టు...!!
చల్లగా తాకుతూనే ఉంటాయి చూపులు,
ఆనందాల వెన్నెలను అద్దుకున్నట్టు...!!
నవ్వుతాం, నవ్విస్తాం,
బాధలో తోడైతాం, బంధంలా నిలబడతాం..!!
స్నేహమంటే ఒకరికొకరమనే పదమే కాదు,
పరస్పరం గౌరవించుకుంటూ,ప్రోత్సాహించుకోవాలి.
అపుడే నిజమైన స్నేహం అచ్చంగా
నదిఒడ్డు ఇసుకలో ఊరే నీరులా స్వచ్చంగా,
అచ్చు ఆల్చిప్పలో ఒదిగిన ముత్యములా...!!-
మన ఆలోచనలే మన అలవాట్లు
మన అలవాట్లే మన ఆచరణలు
మన ఆచరణలే మన గుర్తింపు
-
మూసిన కనుల నిండున రూపం నీదని
మెరిసే అధరాలు చెప్తున్నవి అది నిజమనీ...!!-
మనకి తెలివి ముద్దు
తెంపరితనము వద్దు
మనకి ఉందంటే క్రమశిక్షణ
అలంకరణ అక్కర్లేని ఆకర్షణ
-