అగమ్యగోచరమనే ప్రవాహంలో
కొట్టుకుపోతూ... ఏమి జరుగుతుందో ...
ఏమో... ఎలా భగవంతుడా... అనుకున్న
తరుణంలో, మేము ఉన్నామని చేయి
అందించిన మీకు, మేము ఏమి ఇవ్వగలము ?
శిరస్సు వంచి నమస్కరించడం తప్ప,
హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏.
-
మీకు తెలుసా....
సరస్వతి అమ్మవారి చేతిలో
ఉండే వీణ పేరు" కచ్ఛపి" .
కచ్ఛపి సకల విద్యలకు నిలయం,
ఆ స్వరం వింటే....
ఆజ్ఞానం ఆమడ దూరం 🙏 .-
భయపడకు బుజ్జి తల్లి
ఈ సమాజం ఇంతే,
అప్పుడే ప్రేమిస్తుంది,
అప్పుడే చంపేస్తుంది,
ఇదంతా... వింత నాటకాల
సొంత బూటకాల వేదిక
జర జాగర్త సుమా...!-
బాల్యం
నీకైనా...
నాకైనా...
ఏ జీవికైనా...
ఒక అమృత దశ ,
ఎంత ఇచ్చినా... తిరిగిరాని
మధుర జ్ఞాపకాల తెగని కొస .
-
మన తనువులు ,
భాషలు వేరు కావొచ్చు
కాని మనసులు ఒక్కటేగా...!
-
జన్మదిన శుభాకాంక్షలు
గూరుజి
ధ్యానం మీ మాట
యోగం మీ బాట
సమానత్వం అభిమతం
మీ ఆశ... శ్వాశ...
ధ్యాస... సత్సంకల్పం
అందుకే మీకు జేజేలు...
అందుకోండి కాదనక
ఇవే మా శుభాకాంక్షలు
- కొండాచ్చియ్య నివాస్
-
అనిగిన ఆశలకు పునర్జీవనం.
అలిగిన మనసుకు మనోహరం
చీకటి బ్రతుకుకి చిరు కాంతిపుంజం
చెదిరిన చెలిమికి సయోద్యరూపం
నలిగిన బ్రతుకుకు ఆశాదీపం
నావంటి అల్పునకు అరుదైన అవకాశం .-
నిజం నమ్ము...
నలుగురిలో మాట్లాడాలంటే భయం !
నేను ఇది చేయలేను ఏమో...?
నన్ను చూసి నవ్వి, ఏదో అనుకుంటారేమో
అని తక్కువ చేసుకుని నిన్ను
నీవే నమ్మలేకుంటే... ఇంక బయటి వారు
ఎలా నమ్ముతారు...? ఒకటి మాత్రం పచ్చి
నిజం, ఈ లోకంలో నీలాంటి వ్యక్తి ఇంకొకరు
లేరు, నివ్వు " ప్రత్యేకమని " మర్చిపోకు,
లే... లేచి ప్రయత్నించి చూడు, వీలుంటే
గెలుస్తావు, లేకుంటే ... గెలుపుని ఎలా
గెలవాలో నేర్చుకుంటావు 👍.
-
భోగి & సంక్రాంతి శుభాకాంక్షలు
అరమరికలు లేకుండా...
ఆనందం హత్తుకోవాలని,
మనసు చెప్పే మాట...
ఆచరణ బాట ఎక్కాలని,
కమ్మనైన ఆరోగ్యం...
ఇంపుగా అందాలని
నా ఆశ... శ్వాస... ధ్యాస🙏
- కొండాచ్చియ్య నివాస్.
-
అభినందనలు Mam🌷👏
వజ్రం వెదకదు
వెతకబడుతుంది
అందుకే మీకు ఇలాంటి
అవార్డులు పరిపాటి ,
మీతో మేము నడవడం
మాకు ఎంతో ఘనాపాటి .-