QUOTES ON #బాట

#బాట quotes

Trending | Latest
23 MAY 2017 AT 18:46

నువ్వు నడిచే బాట నీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది...

నువ్వు పలికే మాట నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది...

బాట తప్పితే గమ్యం చేరలేవు...

మాట జారితే మనిషిగా మనలేవు...

-


24 MAY 2017 AT 7:44

మిత్రమా........


నీ మాట ఉత్తేజం కలిగించాలి,

నీ బాట స్పూర్తి రగిలించాలి,

నీ మాట శాసనమవ్వాలి,
నీ బాట ఆదర్శమవ్వాలి.........

-


30 JUL 2020 AT 7:33

గతమంతా పూలబాట
వర్తమానం ముళ్ళబాట
భవిష్యత్ కనపడని బాట.

-


22 MAY 2017 AT 21:02

గమ్యం కన్నా ముఖ్యమైనది నువ్వు

నడిచిన,పలికిన బాట మాట

-


4 DEC 2019 AT 16:23

బాటలో నడవటం కంటే
బాట వేస్తూ నడవటం గోప్ప

-


28 AUG 2021 AT 18:58

నింగికి బాట వేసి పయనం చేస్తున్న
నా చెలి ఎక్కడని!

సింగారాల బాట వేసి పయనం చేస్తున్న
నా చెలి కోసం అన్వేషణ!

అలుపెరుగక బాట వేసి పయనం చేస్తున్న
నా చెలి అందని అధరాల కోసం!

బ్రతుకు బరువు మోసుకొని ఆకాశ బాట వైపు పయనం చేస్తున్న నా చెలి కోసం!



-


9 DEC 2020 AT 23:59

మదిలో చోటు కోసం వేతికా
తను నడిచిన బాట చూసి
వెను తిరిగా!!

-


21 MAR 2021 AT 12:37

నవ్వు అనే బాటలో...
కష్టం అనే సంగ్రామాన్ని...
అధిగమిస్తూ కొందరికి పరిచయమవుతూ...
ఇంకొందరికి దగ్గరవుతూ...
అనుకోని సంఘటనల్లో ముందుకు సాగుతూ...
ఉండటమే సిసలైన గుణం...
చక్కనైన వ్యక్తిత్వం.

-


6 MAY 2020 AT 22:58

బాట బాధపడుతోంది
నిత్యం కదిలే కాళ్ళు
ఈ దారి మరిచిపోయి
వేరే దారిని వెతుక్కోగానే

-


26 AUG 2021 AT 14:47

"నాడిచేటి ధారుల్లోన ముళ్లు
ఎన్నో ఉన్నాయి....ముండ్లు అన్నీ ఏరివేస్తూ
పూలబాట వెయ్యాలి జీవితాన్ని ఛేదించాలి...!

-