నీ పలుకులు తేనేటి విందులు...
నీ కనులు నక్షత్రాలా మిలమిలలు...
నీ చిరునవ్వుతో మ్రోగెను నా మదిలో ప్రేమసరాగాలు...
నీ అందెల గలగలలు కురిపించెనే హర్షద్వానాలు...
నీ మోములో నర్తించెను అందాల హొయలు ...
పుట్టినరోజు శుభాకాంక్షలు భార్యామణి❤️💥🤓🎂-
తెలివికి నెలవు...
మాటలలో మెరుపు...
చిరునవ్వుల హరివిల్లు..
మా అత్తయ్యగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 🙏🎂-
మీ పరిచయం తొలకరి చిరుజల్లులు...
మీ చూపులు ఎవరూ వర్ణించలేని అయస్కాంతక్షేత్రాలు...
మీ పలుకులు గల గల పారే సెలయేర్లు...
మీ వాణి మనసులో వెల్లివిరిసే సరిగామబానిలు...
మీ సొగసుకు కారా అందరూ బానిసలు...
మీ చిరునవ్వులో దాగాయే మధురక్షణాలు...
మీతో ప్రయాణం ఎప్పటికి ఒక మధురస్వప్నం...
ఓ నేస్తమా!-
మరచిపోలేను మన మొదటి కలయిక...
మరువలేను నీ చేతి స్పర్శ కడదాకా...
ఓ ప్రియతమా!-
ప్రేమకి హద్దు...
తపనకి అడ్డు...
ఎక్కడా చూడలేము...
ఓ బంధమా!-
సరదాల నీ గమ్యం...
మాటలతో నీ మాయాజాలం...
నవ్వులతో సాగే నీ ప్రపంచం...
నీ మోము చెరగని ఒక ఆహ్లాదం...
ఓ బంధమా!-
వాడిపోని నీ మాటల తంత్రం...
సరిపోల్చలేని నీ ముఖవచ్ఛస్సు వేరెవ్వరితో...
విహరించానే నీ నవ్వుల ఒడిలో...
ఓ నేస్తమా!-
నిను చూసిన నిమిషాన...
మది పొంగెను పరవసాన...
తెలియకుండా ఎదలోన...
కురిపించావే తొలిప్రేమ...
ఓ ప్రియతమా!-
కనులకి అందంగా...
కలలకి దూరంగా...
నడకకి మనిహారంగా...
మాటతీరు సౌమ్యంగా...
గుణానికి వారసత్వంగా...
మనసుకి ఆహ్లాదంగా...
కురిపించావే ప్రేమ తప్పెట్లు...
ఓ ప్రాణమా!-