మను   (మను)
79 Followers · 26 Following

Joined 12 October 2019


Joined 12 October 2019
18 JAN 2022 AT 9:49

"మంచు కాగితంపై
సూర్యుడి కిరణమే
వేకువ తొలిచరణం"

-


18 JAN 2022 AT 9:28

మంచిని
"తను మర్చిపోతాడు
ఇతరుల్లో వెతుకుతాడు"

-


24 OCT 2021 AT 10:59

"కనబడని ఏ దేవుడి శాపవెూ
తన భర్త తలపై వెలిగే ఈ దీపం"

-


24 OCT 2021 AT 10:55

"కష్టాల వలలకు
కన్నీళ్ళే చేపలయే"

-


24 OCT 2021 AT 10:53

"నేనో
నటుడిని
పైకి నవ్వుతూ
లోన ఏడుస్తుంటా"

-


24 OCT 2021 AT 10:52

"పైన దేహనికి రాసుకున్నాడు విభూతి
లోన పనికిమాలిన ఆలోచనల దుస్థితి"

-


24 OCT 2021 AT 10:49

"కాలం గీసిన కనబడే చిత్రాలు
కమిలిపోయిన రైతు చేతిగుర్తులు"

-


24 OCT 2021 AT 10:45

"క్షణాలన్ని
అగ్నికణాలై
కాల్చుతున్నాయి
కన్నెమనసులు"

-


23 OCT 2021 AT 12:45

"అతి వేగం
అదో రోగం
ప్రాణం పోయాక పనికిరాదు వైద్యం
ఊపిరాగితే చితికి నువ్వే నైవేద్యం"

-


16 JUN 2021 AT 6:55

నీలి మేఘాలు
నీ నీలి కన్నుల్లో
నిల్చుని స్నానాలు చేస్తుంటే
నీ పెదవి వాగుల్లో
చిరునవ్వు ప్రవాహాలు
జలపాతాలై దూకుతుంటే
కురుల సామ్రాజ్యంలో
ఒక ముంగురు రాణి
ముఖమనే నింగిలో
గాలి పాడే పాటలకు నర్తించే

-


Fetching మను Quotes