"శరీరాన్ని అయితే డబ్బు తో
దక్కించుకునే వాడిని
కానీ నేను ఇష్టపడ్డది నీ మనసుని,
అందుకేనేమో ఓడిపోయాను-
ఎప్పుడైనా టైం దొరికినప్... read more
"అన్నమాట తీయని తమ్ముడు
తమ్ముడే తోడుగా...
ముందుకు సాగుతున్న అన్న...
ఈ తోడు ఇలాగే ఉంటే కష్టాలు దహనం అయ్యి
సప్త సముద్రాలు దాటేబలం మీ సొంతం...!-
"బంధాలను వదిలి భారం అంత ఎత్తుకొని
భవిష్యత్తు కోసం,పైసా కోసం
పరాయి దేశం ప్రయాణమైతి.
"కష్టాలతో కన్నీళ్లు పెడుతూ
బాధలకి బానిస నైన నేను
కడుపు చంపుకొని ఆకలినితో అలమటిస్తూ
డొక్కలు ఎండుతున్న
బుక్కెడు బువ్వ కోసం
ఎడారిలో ఏకాకిలా జీవిస్తున్నా.-
"చీకటి ఎంత చుట్టుముట్టినా
ప్రకాశంవంతంగా వెలిగేది చందమామ
మన జీవితంలో ఎంత చీకటి కమ్మిన
ఆ చీకటినీ తొక్కి వేస్తూ వెలుగుతేనే
మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది.-
పైసా పైసా పైసా
"ఊపిరి పోసుకున్న నుండి శ్వాస ఆగే వరకు
కావలసింది పైసా...!-
"జీవితంలో మూడు ముఖ్యమే
'ప్రాణం 'పైసా 'ఆకలి'
ఆకలి కోసం ఎంతకైనా దిగజారి
పైస సంపాదించాల్సి వస్తుంది.
పైసే కావాలి అని ఆకలిని చంపుకొని కష్టపడితే
'ప్రాణానికి అలసట వస్తుంది.
ఆ ప్రాణంబాగా చేయించుకోవడానికి
మళ్ళీ కావాల్సింది' పైస...!-
"మనసుతో చెలగాటలాడటం
మనిషిని వాడుకోవటం
అంతా పైసా కోసమే
పైసా అనే ఆశ ఆడిస్తుంది మనిషిని ఒక ఆట.-
"కాలం ముందుకు వెళ్ళింది
వయసు ముందుకు వెళ్ళింది
జీవితం కూడా ముందుకు సాగుతుంది.
కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే
జీవితమంతా శూన్యంగానే కనిపిస్తుంది.
జీవితంలో చేసిన కొన్ని పనుల గుర్తులు
తప్ప ఇంకా ఏదీ లేదు
అయినా ఏదో సాధించాలని
కాలంతో పాటు పరిగెడుతూనే ఉన్నా...!-
ప్రపంచంలో దేనికైనా విలువ కట్టొచ్చు
"ప్రాణం" కి తప్ప
అన్నిటికంటే విలువైనది
"ప్రాణం" ఒకటే
ఆ "ప్రాణమే" లేకుంటే
విలువ కట్టగలవా...?-