QUOTES ON #నిజాలు

#నిజాలు quotes

Trending | Latest
17 JAN 2022 AT 1:11

కొన్ని ప్రేమలు అబద్ధాలు
గాయం చేస్తే...
కొన్ని ప్రేమలు నిజాలు
జయం చూస్తే...

ప్రేమ,మనిషి దారో/తీరో

-



అబద్ధాలు
తీయగా ఉన్నప్పుడు..
నిజాలు రుచించవు..

-


13 AUG 2021 AT 8:21

నేను నిజాలతో కలిసి జీవించడం లేదు
నేను భావాలతో నమ్మకాలతో జీవిస్తున్నాను

నేను నిజాలకు భక్తున్ని కాదు బానిస కాదు
నాకు ఎక్కువ నిజాలు అవసరం లేదు

నేను
సుగంధ మధురమైన భావాలకు భక్తున్ని
పరిమళ మకరంద భావోద్వేగాలకు ఆరాధకున్ని

నేను
భావాలలో కనిపించే
అందమైన రూపానికి భక్తున్ని
నేను
అందమైన💛రూపంలో కనిపించే
భావాలకు ఆరాధకున్ని

-


28 MAY 2020 AT 12:26

తప్పు నాదని తెలుసు
ఒప్పుకుంటే పదిమందికి అలుసు
అందుకే తిరుగుతుంది తప్పుల గొలుసు.

-


1 NOV 2021 AT 0:03

ఆకాశం అందరిది.
విచిత్రం ...
భూమి మాత్రం కొన్నవారిది.
నిజం ఏమిటి అంటే..
ప్రకృతి అందరిది.
ఇది నిజం.
అందుకే నిజం మాట్లాడండి.
నిజం తో బ్రతకండి

-




నిజాలు చెప్పే నిజాయితీ పరులకన్నా..
అబద్ధాలు చెప్పే అవకాశవాదులనే నమ్ముతుంది ఈ లోకం..
....✍️వెన్నెల సీత

-


3 MAR 2019 AT 23:32

అదేంటో జనం..
నిజాన్ని గూర్చి నిర్భయంగా మాట్టాడేందుకు
ఒక్కరూ ముందుకు రారు...
ఏ ముప్పు ముంచుకొస్తుందోననే భయం
ఆపేస్తోందేమో మరి...
నిన్ను నిలువునా కాల్చినా,
నిజంవైపే నిలబడు...
వెన్నెల సతీష్...

-


5 JUN 2024 AT 2:06

మనసుకు తెలిసిన మందు వేరు
గాయానికి రాసే మందు వేరు
ప్రతిది.. వేరు.. ఈ కాలములో.

-



🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
ఇల్లు ఇరుకుగా ఉన్నా పర్లేదు కానీ
మనసులు విశాలంగా ఉంటే చాలు.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
మనుషులు మురికిగా ఉన్నా పర్లేదు కానీ
మనసులు మురికిగా ఉండకుంటే చాలు.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
మాటలు చేదుగా ఉన్నా పర్లేదు కానీ
మనసు నిష్కల్మషంగా ఉంటే చాలు..
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

-


24 AUG 2019 AT 18:26

నిజాన్ని నిజంగా నరుడు నమ్మడం లేదనేది నిజం
నిజం లేని నాడీజగం లేదనేది నిజం...!!
నీతిదప్పిన నీచులు దోచుకుతినడం నిజం
దొంగలే ధర్మాత్ముల్లా దేశాన్నేలడం నిజం
అభివృద్ధి అంటూనే
లంచాలతో కంచాలు నింపుకోవడం నిజం...!
సమాజం,స్వార్థపు సంకెళ్ళలో మిగిలిందనేది నిజం
కూతలు కూసే కోతులే నీతులు చెప్పడం నిజం
అభంశుభమెరుగని ఆడబిడ్డలు
కావరకాములకు బలౌతున్నారనేది నిజం
నా మాటలు నిక్కమైనా నమ్మక
కుక్కల్లా కొట్టుకుచావడం నిజం....!
ముక్కలైన దిక్కులు ఒక్కటైనా నరుడు నక్కబుద్ధి మారకపోవడం నిజం
వేరైతే ఉండలేమని ప్రాణాలొదిలేసే
ప్రేమికుల ప్రేమ నిజం
పెద్దలు వేరుచేస్తే
వర్ణనాతీతమైన వేదన వెలుపల దాగడం నిజం
ఈ నిజాలు నరలోకానికి నిజంగా అనిపించినా
ఇదంతా నాకెందుకు అనుకునే నీచ స్వభావం నిజం...!!
అర్థమైనా అంత అవసరంలేదనుకునే అధమ ఆవేశఆక్కరోషాలు నిజం
ఒంటరైన వాడిలో
ఎదిగి ఒదిగే వేదన నిజం
ఓదార్పు కూడా కడతేర్చలేని
నా ఒంటరి ప్రయాణం నిజం...!!!
నిజం నిజం అని నీతిని ఎత్తిచూపుతున్న
నాలోని ఆ ఆవేదన నిజం....!!!!

-