తానెక్కడ? నేనెక్కడ?
పాల బండలపై నడిచిన తానెక్కడ?
పలుగు రాళ్లపై నడిచే నేనెక్కడ?
మేడెమిద్దెలలో పెరిగిన తానెక్కడ?
పాత పెంకల కింద పెరిగిన నేనెక్కడ?
తానెక్కడ? నేనెక్కడ?
నిండు పున్నమి వన్నెలు గల తానెక్కడ?
నింగిలో దాగిపోయిన అమావాస్యలా నేనెక్కడ?
చిలిపి అల్లరితో అలిసిపోయిన తానెక్కడ?
తడిపే చెమటలతో సొమ్మసిల్లిన నేనెక్కడ?
అవును తానెక్కడా?.. నేనెక్కడ..?
నింగి తాను, నేల నేను .
ఎదురెదురుగా ఉన్నా ఎదురుచూపులే ఫలితం.
కంట నీరుగా జారితే తప్ప చెంత చేరలేని వైనం.
అందుకేనేమో వర్షించిన ప్రతిసారి హర్షిస్తుంది నా మనసు.— % &-
👉Fan of Indian army
అందని చందమామకై అంధకారంలో ఉండి ఆలోచిస్తే ఏంలాభం, అంతు చిక్కని శూన్యంలో అనువంత కాదు నీ ఆలోచన!!.
-
One day you will find someone
Who will truly understands you...
And protect you.. because they don't allow you to suffer again..😌-
ఆమె ప్రేమ ఏంతో చెప్పనా..
సంద్రానికి సొంతమైన నీటి బిందువులకి రెట్టింపు..!!
ఆమె ఓర్పు ఎంతో తెల్సా..
ఆకాశం విస్తీర్ణం కూడా సరితూగదు..!!
ఆవును ఆమె ఎవరో కాదు అమ్మే...
సృష్టి జీవనానికి మూలం..
స్వచ్ఛమైన ప్రేమకి తోరణం..
-
కరిగే కాలానికేంతెలుసు,
చెరగని కలల గుర్తులు.!!
రగిలే జ్వాలలకేంతెలుసు,
దహించిన గాయం విలువలు.!!-
నిందించక నిన్నటి నీడను,
సాధించు రేపటి రోజును.
కురిపించక కన్నీటి బొట్టును,
చిందించు స్వేదపు చినుకును.
తలవక గతపు నిషులను,
తిలకించు మరుసటి ఉషస్సును.-
శాశ్వతం..!!!
కాటికి చేరే కాయం శాశ్వతం కాదు,
కన్నీరు తుడిచే కరము శాశ్వతం కాదు.
పీల్చే ఊపిరి శాశ్వతం కాదు,
పిలిచే బంధం శాశ్వతం కాదు.
జారే కన్నీరు శాశ్వతం కాదు,
జనుల మధ్య ప్రేమ శాశ్వతం కాదు.
బాధ శాశ్వతం కాదు,
సంతోషం శాశ్వతం కాదు.
గెలుపు శాశ్వతం కాదు,
ఓటమి శాశ్వతం కాదు.
నిషి శాశ్వతం కాదు,
ఉషస్సు శాశ్వతం కాదు.
ఏదీ శాశ్వతం కాదని తెలిసినా....... ఆ ఊహ కూడా శాశ్వతం కాదు.-
నీడనవ్వాలనుంది..,
బాటసారులకు నీడనిచ్చే చెట్టునవ్వాలనుంది.!!!
చెట్టునవ్వాలనుంది..,
జీవరాశుల ఆకలితీర్చే పండునవ్వాలనుంది.!!!
పండునవ్వాలనుంది..,
పాపాలను పోగొట్టే మందునవ్వాలనుంది.!!!-
కన్న తండ్రే కాలయముడైతే
కటిక చీకటే కాదు పొమ్మంటే
ఆడించిన చెయ్యే ఆయుధమైతే
పంచిన ప్రేమే యమపాశమైతే
మత్తులో మునిగి తెలుతుంటే
కామందుడవై ఎగిసిపడుతుంటే
మత్తు పిశాషి వదలదాయే
దారి చూపే చెయ్యే దయచూపదాయే
లోకమెరుగనిదానికి పైలోకమే దిక్కాయే...
-